చంద్రయాన్‌-2పై భారతీయుల క్రేజ్: రిజిస్ట్రేషన్‌ వెబ్‌సైట్ క్రాష్

By Siva KodatiFirst Published Jul 4, 2019, 6:22 PM IST
Highlights

ఒక్కో మెట్టు ఎక్కుతూ.. అంతరిక్ష రంగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-2ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఒక్కో మెట్టు ఎక్కుతూ.. అంతరిక్ష రంగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-2ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రయోగం పట్ల భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీంతో ఆ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారి కోసం ఇస్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి పాస్‌లు అందజేస్తోంది. ఇందుకోసం రూపొందించిన వెబ్ పేజ్ ఇలా అందుబాటులోకి వచ్చిందో లేదో అలా క్రాష్ అయిపోవడం చంద్రయాన్-2 క్రేజ్‌కు నిదర్శనం.

గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రిజిస్ట్రేషన్ వెబ్ పేజ్‌ను ఇస్రో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో పేరు, వయస్సు, జెండర్, ఆధార్ కార్డ్ నంబర్, ఈ-మెయిల్ వంటి వివరాలను పొందుపరిచిన తర్వాత సదరు వ్యక్తి మెయిల్‌కు పాస్‌లు జనరేట్ అవుతాయి.

అయితే దీనిని కోట్లాది మంది ఓపెన్ చేయడంతో ట్రాఫిక్ పెరిగి.. వెబ్‌సైట్ క్రాష్ అయ్యింది. ప్రస్తుతం దీనిని ఓపెన్ చేయగానే సైట్ అందుబాటులో లేదన్న సందేశం వస్తోంది. కాగా.. జూలై 15 తెల్లవారుజామున శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్ఎల్‌వీ-iii వాహకనౌక ద్వారా చంద్రయాన్‌-2ను ఇస్రో ప్రయోగించనుంది. 

click me!