నెలన్నర క్రితమే వారిద్దరికీ వివాహమైంది. కొద్ది రోజులపాటు దంపతులు ఇద్దరూ బాగానే ఉన్నారు. తర్వాత ఏమైందో తెలీదు... నాకు ఈ భర్త వద్దు... నాకు ఇష్టం లేదంటూ భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన మేడ్చల్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చంద్రానగర్‌కు చెందిన వ్యక్తికి గత మే 15న ఓ యువతిని   ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. నెలన్నర వరకు సంతోషంగా గడిపారు. జూన్‌ 26న తన బంధువుల ఇంటికి వెళ్లిన భార్య జులై 1న తిరిగి వచ్చింది. ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో నిలదీసిన భర్తకు నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పింది. మంగళవారం తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని భర్త ఇంటికి వెళ్లి వచ్చే చూసేవరకు భార్య కనిపించలేదు.  ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అని రావడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.