సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ కొందరు నటీమణులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అందులో కొన్ని ఆరోపణలు నిజమని కూడా తేలాయి. భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు సాగుతున్నాయి.

సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారికి ఇలాంటి వేధింపులు ఇంకా ఎక్కువగా ఉంటాయని ఇటీవల మీడియా ముందుకొచ్చిన కొందరు తారలు కామెంట్స్ చేశారు. తాజాగా మలయాళీ ముద్దుగుమ్మ గాయత్రి సురేష్ కాస్టింగ్ కౌచ్ పై సంచనల కామెంట్స్ చేసింది.

నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన కొత్తలో ఈమె కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొందట. అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో చాలా మంది తన ఫోన్ కి 'కాంప్రమైజ్'కి ఓకేనా అంటూ మెసేజ్ లు చేసేవారట. వారందరికీ తాను నో చెప్పానని.. కాంప్రమైజ్ కాకుండానే ఇండస్ట్రీలో రాణించాలని భావించినట్లు చెప్పుకొచ్చింది.

అయితే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిలు అవకాశాల కోసం రాజీ పడుతుంటారని.. అలా కాకుండా టాలెంట్ ని నమ్ముకోవాలని గాయత్రి సురేష్ అంటోంది. ఇండస్ట్రీలో 'మీటూ' ఉద్యమం మొదలైన తరువాత చాలా వరకు కాస్టింగ్ కౌచ్ సమస్యలు తగ్గినట్లు తెలుస్తోంది.