యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'సాహో' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఆగస్ట్ 15న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇప్పటినుండే సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలో సినిమా నుండి తొలి పాటను రిలీజ్ చేయబోతుంది చిత్రబృందం.

'సైకో సయాన్' పేరుతో రాబోతున్న ఈ పాటలో ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నాడు. ఈ పాటతో 'సాహో' సినిమాకు ఎవరు మ్యూజిక్ చేస్తున్నారో క్లారిటీ వస్తుందని భావించారు. అయితే దర్శకనిర్మాతలు మాత్రం కేవలం ఒక సంగీత దర్శకుడిని పెట్టుకోకుండా ఒక్కో పాట ఒక్కొక్కరితో చేయించుకొని ఈజీగా పని పూర్తి చేసుకుంటున్నారు.

మొదటి పాట 'సైకో సయాన్'ను బాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బాగ్జితో చేయించుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ తనిష్క్ కి మంచి పేరుంది. అతడి పాటలకు  యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి.

కాబట్టి ఈ పాట కూడా చాలా స్పెషల్ గా ఉంటుందని భావిస్తున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ పాటను రిలీజ్ చేస్తున్నారు. సినిమాలో మిగిలిన పాటలను కూడా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లతో చేయించుకుంటున్నారని సమాచారం.