తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
12:06 AM (IST) May 22
Heavy rains: హైదరాబాద్‌లో బుధవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
11:54 PM (IST) May 21
Pakistan School Bus Blast: పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో స్కూల్ బస్సులో జరిగిన బాంబు పేలుడులో ఆరుగురు మరణించగా, 38 మంది గాయపడ్డారు. బాధితుల్లో నలుగురు పిల్లలు ఉన్నారు.
11:26 PM (IST) May 21
గాజాలో అంతర్జాతీయ ప్రతినిధి బృందంపై కాల్పులు జరిగాయి. అయితే ఇలా ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో ఇజ్రాయెల్ వివరణ ఇచ్చింది.
11:19 PM (IST) May 21
MI vs DC: ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ లో తన బెర్త్ ను కన్ఫార్మ్ చేసుకుంది.
11:19 PM (IST) May 21
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పాకిస్తాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది.
10:50 PM (IST) May 21
పహల్గాం దాడి చేసిన వారిని అరెస్ట్ చేయడంలో జాప్యంపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ కేంద్రాన్ని నిలదీసారు. ఆపరేషన్ సింధూర్ బ్రీఫింగ్‌లను దారి మళ్లించే ప్రచార ప్రయత్నంగా కొట్టిపారేశారు.
10:29 PM (IST) May 21
Telangana: తెలంగాణ ప్రభుత్వం బుధవారం అఖిల భారత సర్వీసు (AIS) అధికారులకు కఠిన హెచ్చరిక జారీ చేసింది. వారి స్థానానికి తగని ప్రజా ప్రవర్తనను నివారించాలని ఆదేశించింది.
10:07 PM (IST) May 21
Mumbai Indians: ఐపీఎల్ 18వ సీజన్ హోరాహోరీగా సాగుతోంది. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించగా, ముంబై ఇండియన్స్ కూడా ప్లేఆఫ్స్ దిశగా పయనిస్తోంది. కానీ ముంబై చేసిన ఒక్క తప్పు ఇప్పుడు వారిని వెంటాడుతోంది. అంబానీ టీమ్ ను టెన్షన్ పెడుతోంది.
09:24 PM (IST) May 21
IndiGo flight faces hailstorm: ఇండిగో విమానం శ్రీనగర్‌లో తుఫానులో చిక్కుకుంది. వడగళ్ల వానతో విమానం కుదుపునకు గురైంది. అలాగే, ముందుభాగం కూడా ధ్వంసమైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
09:00 PM (IST) May 21
Chhattisgarh encounter: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టుల హతమయ్యారు. వీరిలో మావోయిస్టుల అగ్రనేత బసవరాజు హతమయ్యాడు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా భద్రతా బలగాలను అభినందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
08:46 PM (IST) May 21
భారతదేశంలో అత్యంత ధనిక దంపతులైన ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు దేశం అభివృద్ధి కోసం వందల కోట్లు దానం ఇచ్చారు. వారి దాతృత్వాన్ని గుర్తించిన TIME మ్యాగజైన్ తొలిసారి విడుదల చేసిన TIME100 Philanthropy List 2024లో చోటు కల్పించింది.
08:16 PM (IST) May 21
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 తుదిదశకు చేరుకుంది. దీంతో టైటిల్ ఎవరు గెలుస్తారనే చర్చ మొదలైంది. ఐపీఎల్ 2025 టైటిల్ రేసులో బలమైన జట్లు ఏవి? ఎవరు టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
08:00 PM (IST) May 21
పాకిస్తాన్ సైనిక చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌కి ఫీల్డ్ మార్షల్ గౌరవం దక్కింది. ఈ హోదా కేవలం పాక్ ఆర్మీలోనే కాదు ఇండియన్ ఆర్మీలోనూ ఉంది. ఇప్పటివరకు ఇక్కడ ఎవరికి ఈ హోదా దక్కిందంటే..
07:51 PM (IST) May 21
పిల్లల్ని సంతోషంగా ఉంచడంలో ఏ దేశం ముందుంది? అక్కడి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
07:29 PM (IST) May 21
ఎస్టోనియాలోని టార్టు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 59,000 మందిపై చేసిన అధ్యయనంలో ఏదయినా లక్ష్యం, సాాధించామన్న సంతృప్తి భావన కలిగించే ఉద్యోగాలు సంతోషాన్నిస్తాయని తేలింది. అలాంటి ఉద్యోగాలేవి, అసంతృప్తికర ఉద్యోగాలేవి ఇక్కడ తెలుసుకుందాం.
07:14 PM (IST) May 21
PM Modi to inaugurate 3 Telangana railway stations: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణలో ఎయిర్ పోర్టులను తలపించేలా ఆధునీకరించిన బేగంపేట్, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించనున్నారు.
06:53 PM (IST) May 21
పాకిస్తాన్ పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విమానాలపై వైమానిక ఆంక్షలను విధించింది. దీన్ని మరో నెల పొడిగించనుందా?
06:53 PM (IST) May 21
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF).. టెన్షన్ లేకుండా చేసే చక్కటి సేవింగ్స్ స్కీమ్ ఇది. ఖాతాదారులకు ఎంతో భద్రతనిస్తుంది. ఇందులో దాచుకున్న డబ్బులు మెచ్యురిటీ కాకుండానే అవసరాలకు వాడుకోవచ్చు. కాని ఎన్ని సంవత్సరాల తర్వాత విత్ డ్రా చేయొచ్చో తెలుసుకుందాం.
06:46 PM (IST) May 21
టీ అంటే పడి చచ్చే వాళ్లు మనలో చాలా మంది ఉంటారు. కాస్త తల నొప్పిగా ఉన్నా వెంటనే ఒక టీ తాగేస్తుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన టీ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
06:13 PM (IST) May 21
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ని సృష్టించడం, ఎడిట్ చేయడం ఎలా? వీడియోలు రికార్డ్ చేయడం నుండి మ్యూజిక్, ఎఫెక్ట్స్ జోడించి షేర్ చేయడం వరకు అన్నింటి గురించి గో ఇక్కడ తెలుసుకోండి.
06:03 PM (IST) May 21
Nambala Keshava Rao: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో టాప్ మావోయిస్ట్ నాయకుడు నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎవరీ కేశవరావు?
05:48 PM (IST) May 21
శని దేవుని పుట్టినరోజుగా భావించే శని జయంతి జ్యేష్ట మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది శని జయంతి మే 27వ తేదీన వస్తోంది. ఈ ప్రత్యేక దినాన్ని శని భక్తులు ఆరాధన, పూజలతో ఘనంగా జరుపుకుంటారు.
05:39 PM (IST) May 21
అవకాశం వచ్చినప్పుడల్లా చైనా.. పాకిస్థాన్‌పై తనకున్న విధేయతను చాటుతూనే ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు చైనా తన మద్ధతును బహిరంగంగానే చాటుతోంది.
05:37 PM (IST) May 21
డాన్ పిక్చర్స్ అధినేత ఆకాష్ బాస్కరన్ విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నటులు శివకార్తికేయన్, ధనుష్, శింబులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించనున్నట్లు సమాచారం.
05:31 PM (IST) May 21
Shikhar Dhawan buys luxury apartment: టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ 'ది డాలియాస్' ప్రాజెక్ట్‌లో లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. ధావన్ కొత్త ఇల్లు ధర ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు !
05:24 PM (IST) May 21
మిస్ వరల్డ్ 2025 పోటీదారులు హైదరాబాద్‌లోని కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్‌ను సందర్శించారు. డాక్టర్ రఘురాం నేతృత్వంలో చేపట్టిన బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలను వారు ప్రశంసించారు.
04:42 PM (IST) May 21
04:42 PM (IST) May 21
ప్రతిఏటా జూన్ 21న యోగా డే జరుపుకుంటాం. అంటే ఇవాళ్టికి (మే 21) కి సరిగ్గా నెలరోజులు ఉంది. ఈ నెలరోజులు ఏపీలో యోగాంధ్ర 2025 నిర్వహించనున్నారు.. యోగా డే రోజున ప్రధాని మోదీతో విశాఖపట్నంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
04:38 PM (IST) May 21
Pawan Kalyan: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగుల సమస్యల నివారణకు కర్ణాటక ప్రభుత్వం 6 కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నాటక నుంచి కుంకీ ఎనుగులను స్వీకరించారు.
03:04 PM (IST) May 21
Mumbai Indians vs Delhi Capitals: ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ చేరేందుకు తుది పోరుకు సిద్ధంగా ఉన్నాయి. ఇరు జట్లు మధ్య బిగ్ ఫైట్ ఉత్కంఠను రేపుతోంది.
03:00 PM (IST) May 21
రోజూ మనం బ్రష్ చేస్తాం. కరెక్ట్ గా ఎంత సేపు చేస్తామో గుర్తుందా? ఎంత సేపు బ్రష్ చేస్తే పళ్లు శుభ్రంగా ఉంటాయో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
02:20 PM (IST) May 21
కోల్‌కతాలో గుర్తు తెలియని డ్రోన్ ఒకటి కలకలం రేపింది. అసలు ఆ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారన్న ఆసక్తి అందరిలోనూ పెరిగింది.
02:13 PM (IST) May 21
నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తమ అభిమాన నాయకుడు, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాందీ వర్ధంతి వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే ఆయన చివరి పర్యటన ఆంధ్ర ప్రదేశ్ లోనే సాగింది.. రాత్రికి వైజాగ్ లోనే బస చేయాల్సింది. మరి శ్రీపెరంబదూరు ఎలా వెళ్లారంటే..
02:07 PM (IST) May 21
నేషనల్ హెరాల్డ్ కేసులో రూ.142 కోట్లు లాభపడ్డారంటూ సోనియా, రాహుల్‌పై ఈడీ ఆరోపణలు చేసింది. ఢిల్లీలో విచారణ సందర్భంగా కొత్త వాదనలు వినిపించాయి.
01:20 PM (IST) May 21
టెక్సాస్‌లో బస్సులో ప్రయాణిస్తున్న భారత సంతతికి చెందిన అక్షయ్ గుప్తా హత్యకు గురయ్యారు. నిందితుడు మరో భారతీయుడే.
01:08 PM (IST) May 21
Gold: ఇండియాలో బంగారం నిల్వలు తక్కువగా ఉన్నా.. వినియోగించడంలో మాత్రం ఇండియా ఎప్పుడు టాప్ లో ఉంటుంది. ఇటీవల విడుదలైన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక కూడా అదే చెప్తోంది. దాని ప్రకారం ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువ బంగారు నిల్వలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
12:45 PM (IST) May 21
పాక్ ఇంటెలిజెన్స్ అధికారితో సంబంధాలు కలిగి గూఢచర్యం చేసినట్లు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అంగీకారించింది.
12:27 PM (IST) May 21
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన టిటిడి పాలకమండలి సమావేశంలో ఉద్యోగాల భర్తీతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
12:06 PM (IST) May 21
అమెరికా ను క్షిపణుల దాడుల నుంచి కాపాడేందుకు గోల్డెన్ డోమ్ ఫర్ అమెరికా అనే ప్రాజెక్టును ట్రంప్ ప్రారంభించారు.
11:29 AM (IST) May 21
లష్కర్-ఎ-తోయిబా (LeT) సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజా పాపం పండింది. అతడు ప్రస్తుతం చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ పాకిస్థాన్ లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇంతకూ అతడికి ఏమయ్యిందో తెలుసా?