MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • మీ టెన్షన్స్ అన్నీ దూరం కావాలా..? : అయితే చంద్రబాబు చిట్కా పాటించిచూడండి

మీ టెన్షన్స్ అన్నీ దూరం కావాలా..? : అయితే చంద్రబాబు చిట్కా పాటించిచూడండి

ప్రతిఏటా జూన్ 21న యోగా డే జరుపుకుంటాం. అంటే ఇవాళ్టికి (మే 21) సరిగ్గా నెలరోజులు ఉంది. ఈ నెలరోజులు ఏపీలో యోగాంధ్ర 2025 నిర్వహించనున్నారు. యోగా డే రోజున ప్రధాని మోదీతో విశాఖపట్నంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. 

4 Min read
Arun Kumar P
Published : May 21 2025, 04:42 PM IST| Updated : May 21 2025, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఏపీలో అట్టహాసంగా యోగా డే వేడుకలు
Image Credit : ANI

ఏపీలో అట్టహాసంగా యోగా డే వేడుకలు

Nara Chandrababu Naidu : ప్రస్తుత కాలంలో మనుషుల శారీరక ఆరోగ్యమే కాద మానసిక ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండటంలేదు. ఈ అహారపు అలవాట్లు, మారిన జీవనశైలి శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తే... పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లో ప్రెజర్స్ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఆరోగ్యం దెబ్బతింటే నయం చేయడానికి డాక్టర్లు, హాస్పిటల్స్ ఉన్నాయి... మరి మానసికంగా దెబ్బతింటే ఎలా? ఇందుకు సరైన మెడిసిన్ యోగా.

యావత్ ప్రపంచమే ఇప్పుడు భారతీయ యోగా వైపు చూస్తోంది... యోగా ద్వారా తమ జీవితంలో అద్భుతాలు జరిగాయని దేశవిదేశాలకు చెందినవారు చెబుతున్నారు. ఈ క్రమంలో యోగాను భారతీయులకు మరీముఖ్యంగా తెలుగువారికి దగ్గర చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమయ్యింది. ఇందుకోసమే ఈసారి యోగా డే (జూన్ 21) వేడుకల సందర్భంగా యావత్ దేశమే ఏపీ వైపు చూసేలా చేస్తున్నారు. యోగా డే ను ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్ర ప్రదేశ్ లో జరుపుకునేలా సీఎం చంద్రబాబు నాయుడు చేసారు.

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో యోగా డే వేడుకలకు ప్రధాని హాజరుకానున్నారు... దీంతో అట్టహాసంగా నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగా డే కు సంబంధించిన కీలక ప్రకటన చేసారు.

26
యోగాంధ్ర 2025
Image Credit : our own

యోగాంధ్ర 2025

ఏపీలో నేటి నుంచి (మే 21) నెలరోజుల పాటు కూటమి ప్రభుత్వం యోగాంధ్ర-2025 నిర్వహించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇక యోగా డే సందర్భంగా జూన్ 21న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకూ 5 లక్షలమందితో ప్రత్యేక యోగా కార్యక్రమం జరుపుతామని తెలిపారు. ఈ క్రమంలోనే ఇవాళ యోగాంధ్ర వెబ్ సైట్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

యోగా ప్రాముఖ్యత గురించి చంద్రబాబు మాట్లాడుతూ... మనిషి జీవితంలో మెరుగైన జీవన ప్రమాణాలకు ఈ యోగాయే నాందిగా పేర్కొన్నారు. నేటి ఆధునిక యుగంలో ప్రతిఒక్కరు కాలంవెనక పరుగు సాగిస్తున్నారు.. ఇది ఒత్తిడితో కూడుకున్నదే. ఇక ఈ లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి రావడమేంటో గానీ ఇదికూడా ఒత్తిడికి గురిచేసేదే. ఇలా ప్రతి విషయంలోనూ ఒత్తిడికి గురవుతూ లైఫ్ మొత్తం టెన్షన్ టెన్షన్ గా ఉంటోందని.. జీవితాలు మెకినికల్ గా మారిపోయాయని చంద్రబాబు అన్నారు.

నేటి తరానికి అన్ని టెన్షన్స్ ను దూరంచేసే ఏకైక మార్గం యోగా అని చంద్రబాబు అన్నారు. శారీరక, మానసిక సమస్యల నుండి కూడా యోగా ద్వారా ఉపశమనం లభిస్తుందన్నారు. అందుకే ప్రధాని మోదీ దీక్షతో, పట్టుదలతో యోగాను బాగా ప్రమోట్ చేస్తున్నారు... కాబట్టి మనవంతుగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

Related Articles

Related image1
Yoga vs Walking: యోగా వర్సెస్ వాకింగ్.. డయాబెటిక్స్ కు ఏది బెస్ట్..
Related image2
Now Playing
యోగా చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా?
36
యోగాకు గుర్తింపు తెచ్చింది మోదీయే : చంద్రబాబు
Image Credit : Chandrababu Naidu, Narendra Modi

యోగాకు గుర్తింపు తెచ్చింది మోదీయే : చంద్రబాబు

ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా... ఇది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్రమోదీకే దక్కుతుందన్నారు. యోగా మన దేశానికి వారసత్వంగా వస్తోంది... భారతీయ జీవన విధానంలో ఒక భాగమన్నారు.  

ఒకప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన దేశంలో చదువుకునేవారు... రానురాను విదేశీ దాడులతో అంతా కనుమరుగైందన్నారు. మళ్లీ ఇప్పుడు యోగా విలువ ప్రపంచానికి తెలిసేలా ప్రధాని మోదీ చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. 2014 డిసెంబర్ లో యునైటెడ్ నేషనన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచంమంతా యోగా దినోత్సవం జరపాలని నిర్ణయించిందన్నారు. యోగా అనేది ఒక ప్రాంతానికో, ఒక మతానికో సంబంధించినది కాదు... ప్రపంచంలో అన్ని దేశాల్లో, మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమమని చంద్రబాబు తెలిపారు.

46
ఏపీ చరిత్రలో నూతన అధ్యయనం
Image Credit : X-Narendra Modi

ఏపీ చరిత్రలో నూతన అధ్యయనం

రికార్డు సృష్టించేలా నేటి నుంచి నెలరోజుల పాటు యోగాంధ్ర-2025 నిర్వహిస్తామన్నారు. ఫోటోల కోసమో , ఈవెంట్ల కోసమే చేసే కార్యక్రమం కాదు.. నెల మొత్తం పలు కార్యక్రమాలు నిర్వహించి యోగాపై ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించామన్నారు చంద్రబాబు.

ఇక యోగా డే సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 5 లక్షల మందితో ఉదయం 7 నుంచి 8 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లమందికి తగ్గకుండా కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 10 లక్షలమందితో యోగా కోర్సులు చేయించి వారికి సర్టిఫికెట్లు కూడా అందజేయాలని నిర్ణయించామన్నారు. సముద్రం పక్కన ఇలాంటి యోగా నిర్వహించడం అరుదైన విషయం... సముద్ర తీరాన, ప్రకృతి ఒడిలో జరిగే ఈ కార్యక్రమం ఎప్పటికీ గుర్తుండిపోతుందని చంద్రబాబు అన్నారు.

56
యోగాపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం
Image Credit : stockphoto

యోగాపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం

జూన్ 21న యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ హాజరవుతున్నందున మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల బృందం దిశానిర్దేశం చేస్తుందని చంద్రబాబు తెలిపారు. పలు యూనివర్సిటీలు, పబ్లిక్, ప్రైవేటు సంస్థల్లోని వాలంటీర్లు, మహిళలు, వృద్ధులు, పోలీసులు, ఉద్యోగులు యోగా దినోత్సవంలో భాగస్వాములు కావాలని సూచించారు. అలాంటివారికి ధ్రువపత్రాలు కూడా అందజేస్తామన్నారు. పట్టణాలు, నగరాల నుంచి గ్రామస్థాయి వరకూ యోగాభ్యాసన కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

మన రాష్ట్రంలో రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాలు 21 ఉన్నాయి... అమరావతి బుద్ద స్థూపం, లేపాక్షి శిల్పారామం, గండికోట, అరకు, లంబసింగి, కోనసీమ, అఖండ గోదావరి ఇలా 100 పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో యోగా ప్రాముఖ్యతను వివరించే ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రధాని మోదీ ప్రపంచమంతా యోగాను ప్రమోట్ చేస్తున్నప్పుడు మనకూ బాధ్యత ఉంటుంది కదా.. ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా కూడా చొరవ తీసుకుని యోగాను ప్రమోట్ చేయాలి. మంచి కంటెంట్ తో ఆర్టికల్స్ రాయాలి. మంచి వీడియోస్ తయారుచేయాలి అని సూచించారు.

మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగాతో అసోసియేట్ చేసుకుని 2 వేలమంది యోగా శిక్షకులను తయారుచేస్తామన్నారు. పాఠశాలలో రెండు వేల మందిని తయారుచేస్తాం... యోగా ప్రాముఖ్యత తెలిపేలా స్కూల్ సిలబస్ లో పెడతామన్నారు. స్కూళ్లు మొదలవగానే గంట సేపు విద్యార్థులకు యోగా శిక్షణ ఇప్పిస్తామన్నారు. యోగా గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన వాలంటీర్లకు జూన్ 21న ప్రధాని సభలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు.

66
ఆరోగ్యమే మహాభాగ్యం
Image Credit : stockPhoto

ఆరోగ్యమే మహాభాగ్యం

అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషమే స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యమన్నారు చంద్రబాబు. మన సమస్యలకు చక్కటి పరిష్కారం యోగా... అందరూ రోజూ ఒక గంట ప్రాణాయామం, ఆసనాలు, మెడిటేషన్ చేయాలని సూచించారు. వీటిని ప్రాక్టీస్ చేస్తే ఒత్తిడి మాయమై పనిని ఎంజాయ్ చేస్తారన్నారు. యోగా కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా, పతంజలి, బ్రహ్మ కుమారీస్ ఇలాంటి అసోసియేషపోలు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయని చంద్రబాబు తెలిపారు.

వీరితో తాను ఎన్నో ఏళ్లుగా అసోసియేట్ అవుతున్నానని చంద్రబాబు తెలిపారు. అప్పట్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, ఈషా సద్గురు వాసుదేవ్ తో ఐఏఎస్ , ఐపీఎస్, మంత్రులకు తాను క్లాసులు పెట్టించానని తెలిపారు. బ్రహ్మకుమారీస్ ప్రపంచమంతా యూనిట్లు పెట్టారని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశం
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
నరేంద్ర మోదీ
తెలుగుదేశం పార్టీ

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved