Shani Jayanti: మే 27న శని జయంతి.. ఈ వస్తువులు దానం చేస్తే, మీ రాత మారడం ఖాయం
శని దేవుని పుట్టినరోజుగా భావించే శని జయంతి జ్యేష్ట మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది శని జయంతి మే 27వ తేదీన వస్తోంది. ఈ ప్రత్యేక దినాన్ని శని భక్తులు ఆరాధన, పూజలతో ఘనంగా జరుపుకుంటారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
శని దోషాలు తగ్గుతాయి
శని జయంతి రోజు కొన్ని రకాల వస్తువులను దానం చేయడం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. శనివారం రోజే శనికి అంకితమైన రోజు అయినా, జ్యేష్ఠ అమావాస్య (శని జయంతి) సమయంలో శని దేవుడిని పూజించడం అత్యంత శ్రేష్ఠంగా పరిగణిస్తారు. ఈ రోజు నల్ల వస్తువులను పూజలో సమర్పించడం, అలాగే దానం చేయడం వల్ల శని దోషాలు తగ్గుతాయి. సుఖశాంతులు కలుగుతాయి.
నల్ల నువ్వులు దానం (గ్రహదోష నివారణకు):
శని దేవుడికి నల్ల నువ్వులు ఎంతో ప్రీతికరమైనవి. పూజ సమయంలో వీటిని నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది. అలాగే పేదవారికి నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా శని గ్రహ సంబంధిత దోషాలు తగ్గుతాయి, అనుకోని అడ్డంకులు తొలగిపోతాయి.
నల్ల గొడుగు దానం:
జ్యేష్ఠ మాసంలో ఎండ తీవ్రంగా ఉంటుంది. శని జయంతి రోజున పేదలకు నల్ల గొడుగులు దానం చేయడం ద్వారా శని దేవుడు కృప చూపిస్తాడు. ఈ చిన్న సేవ శని అనుగ్రహానికి తోడ్పడుతుంది. సాడేసాతి ప్రభావం ఉన్న వారు ఈ దానం చేస్తే ఉపశమనం లభిస్తుంది.
నల్ల దుస్తులు:
శని గ్రహ ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు శని జయంతి రోజున పేదలకు నల్లటి దుస్తులు ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. ఇది శని కృపను పొందడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా సాడేసాతి, అష్టమ శని, ధైయ్యలతో ఇబ్బంది పడే వారికి బాధలు తగ్గుతాయి.
నల్ల మినపప్పు:
నల్ల మినపప్పును శని దేవుడు ఎంతో ఇష్టపడతాడని జ్యోతిష్కులు చెబుతున్నారు. శని జయంతి లేదా శనివారాల్లో దీనిని పేదలకు దానం చేయడం శని దోషాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యం, ఆర్ధిక స్థిరత్వం వంటి ఫలితాలను కూడా అందిస్తుంది.