- Home
- Business
- దేశం కోసం అంబానీ దంపతులు అన్ని వందల కోట్లు దానం చేశారా? TIME మ్యాగజైన్ దాతృత్వ జాబితాలో దక్కిన చోటు
దేశం కోసం అంబానీ దంపతులు అన్ని వందల కోట్లు దానం చేశారా? TIME మ్యాగజైన్ దాతృత్వ జాబితాలో దక్కిన చోటు
భారతదేశంలో అత్యంత ధనిక దంపతులైన ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు దేశం అభివృద్ధి కోసం వందల కోట్లు దానం ఇచ్చారు. వారి దాతృత్వాన్ని గుర్తించిన TIME మ్యాగజైన్ తొలిసారి విడుదల చేసిన TIME100 Philanthropy List 2024లో చోటు కల్పించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
TIME మ్యాగజైన్ లో చోటు..
భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబాలలో ఒకటైన అంబానీ కుటుంబం రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విస్తృతంగా విరాళాలు ఇచ్చారు. 2024లో రూ.407 కోట్లు (సుమారు $48 మిలియన్లు) విరాళం ఇచ్చారు. దేశంలోనే అతిపెద్ద దాతలలో ఒకరిగా నిలిచారు.
అందుకే TIME మ్యాగజైన్ తొలిసారి విడుదల చేసిన TIME100 Philanthropy List 2024లో అంబానీలు ప్రపంచానికి మార్పు తీసుకొచ్చే వ్యక్తులుగా గుర్తింపు పొందారు.
రూ.407 కోట్ల విరాళాలు
2024లో ముఖేష్, నీతా అంబానీలు రూ.407 కోట్లు (సుమారు $48 మిలియన్లు) విరాళాల రూపంలో సమాజానికి అందించారు.
ఈ జాబితాలో స్థానం దక్కడం సాధారణ విషయం కాదు. ఎందుకంటే పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చిన వారికి మాత్రమే TIME మ్యాగజైన్ లో చోటు దక్కదు. వాటిని ఆ దాతలు సమాజానికి ఎంతలా ఉపయోగించారన్న విషయాన్ని కూడా పరిశీలించి సరైన వ్యక్తులైతేనే జాబితాలో చోటు ఇస్తారు.
విరాళాలు ఎందుకు?
విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం, గ్రామీణాభివృద్ధి, గ్రామాల్లో సౌకర్యాలు కల్పించడం, పెద్ద ఆరోగ్య, విద్యా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దేశాభివృద్ధికి ముఖేష్, నీతా అంబానీ దంపతులు కృషి చేశారు. అంతేకాకుండా వ్యవసాయం, మహిళా ఉపాధి, నీటి సంరక్షణ, పాఠశాల మౌలిక సదుపాయాలు, కంటి సంరక్షణ, ఆసుపత్రుల నిర్మాణం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వీటి ద్వారా లక్షలాది మంది భారతీయులు ప్రయోజనం పొందారు.
క్రీడాకారులకు ప్రోత్సాహం
నీతా అంబానీ క్రీడాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించారు. రిలయన్స్ ఫౌండేషన్ క్రీడా మిషన్ ద్వారా వేలాది మంది యువ క్రీడాకారులకు శిక్షణ ఇప్పించారు. మహిళల క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆధునిక శిక్షణా పద్ధతులు, సైంటిఫిక్ ఫిట్‌నెస్ సెంటర్లు స్థాపించి యువతను ప్రోత్సహించారు.
నీతా అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ ప్రపంచ స్థాయి శిక్షణ, ఆధునిక క్రీడా సైన్స్ సౌకర్యాలను అందించడం ద్వారా వేలాది మంది యువ క్రీడాకారులను, ముఖ్యంగా మహిళలను ప్రోత్సహించింది.
భారతీయులకు చేయూత
సుమారు 110 బిలియన్ల డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. అంబానీ కుటుంబం వారి ఆదాయంలోనే ఎక్కువ మొత్తంలో విరాళాలు ఇచ్చి సాధారణ భారతీయుల జీవితాల్లో ప్రత్యక్ష మార్పును తీసుకొచ్చారు. ఆసుపత్రుల నిర్మాణం నుంచి రైతులకు ఆర్థిక సహాయం అందించడం వరకు వారి దాతృత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది.