MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • PM Modi: తెలంగాణలో 3 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా?

PM Modi: తెలంగాణలో 3 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా?

PM Modi to inaugurate 3 Telangana railway stations: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణలో ఎయిర్ పోర్టులను తలపించేలా ఆధునీకరించిన బేగంపేట్, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించనున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 21 2025, 07:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు
Image Credit : X/@kishanreddybjp

తెలంగాణలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు

PM Modi to inaugurate 3 Telangana railway stations: ప్రధాని న‌రేంద్ర మోడీ గురువారం దేశ‌వ్యాప్తంగా 103 కొత్త అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభిస్తారు. ఈ స్టేషన్లు దేశవ్యాప్తంగా ప్రజలకు అనుభవాన్ని, సౌకర్యాన్ని మ‌రింత‌గా మెరుగుపరుస్తాయి. వీటిలో చాలా వరకు టైర్ 2, 3 నగరాల్లో ఉన్నాయి.

ఇందులో తెలంగాణ‌కు చెందిన మూడు రైల్వే స్టేష‌న్లు కూడా ఉన్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణలో ఎయిర్ పోర్టులను తలపించేలా ఆధునీకరించిన బేగంపేట్, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభిస్తారు. గురువారం ఉదయం 9:30 గంటలకు వర్చువల్ విధానంలో ఈ స్టేషన్ల‌ను ప్రారంభించనున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పూర్తిగా మహిళా సిబ్బందిచే న‌డిచే బేగంపేట్ రైల్వే స్టేషన్‌
Image Credit : X/@kishanreddybjp

పూర్తిగా మహిళా సిబ్బందిచే న‌డిచే బేగంపేట్ రైల్వే స్టేషన్‌

ప్ర‌ధాని మోడీ ప్రారంభించే హైద‌రాబాద్ లో ఉన్న‌ బేగంపేట్ రైల్వే స్టేషన్‌ను పూర్తిగా మహిళా సిబ్బందిచే నిర్వహించే స్టేష‌న్. దేశంలోని మ‌హిళ‌లో నిర్వ‌హిస్తున్న‌ తొలి స్టేషన్‌గా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.

సౌత్ సెంట్రల్ రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బేగంపేట్ రైల్వే స్టేషన్‌ను రూ.26.55 కోట్ల వ్యయంతో ఆధునిక హబ్‌గా అభివృద్ధి చేశారు. ఇందులో ఎస్కలేటర్లు, లిఫ్టులు, విశాలమైన వెయిటింగ్ హాల్స్, ఆధునిక టాయిలెట్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను స్టేషన్ సెంటర్‌పీస్‌గా స్థాపించారు.

35
విమానాశ్రయాల తరహాలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్లు
Image Credit : X/@kishanreddybjp

విమానాశ్రయాల తరహాలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్లు

స్టేషన్ పరిసరాల్లో ఆహ్లాదకరమైన ఆకర్షించే ఉద్యానవనం, నీటి ఫౌంటెన్లు, మెరుగైన లైటింగ్, స్పష్టమైన సైన్‌బోర్డులు ఏర్పాటు చేశారు. బేగంపేట్ స్టేషన్ సుమారు 15,000 మంది ప్రయాణీకులకు ప్రతిరోజు సేవలందిస్తోంది. ఇది సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ తర్వాత హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటిగా నిలిచింది.

ఈ స్టేషన్‌లో పని చేసే సిబ్బంది అంతా మహిళలే. స్టేషన్ మాస్టర్ నుంచి టికెట్ కౌంటర్ సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుళ్లు వరకు అంద‌రూ మ‌హిళ‌లే. గత ఆరు సంవత్సరాలుగా మొత్తం మ‌హిళా సిబ్బందితో న‌డుస్తోంది. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.

45
 ఒక్కో స్టేషన్‌కు సుమారు రూ.25 కోట్ల వ్యయం
Image Credit : X/@kishanreddybjp

ఒక్కో స్టేషన్‌కు సుమారు రూ.25 కోట్ల వ్యయం

ఇక కరీంనగర్, వరంగల్ స్టేషన్లకు కూడా అమృత్ భార‌త్ ప‌థ‌కంలో భాగంగా విమానాశ్ర‌యాల త‌ర‌హాలో ఆధునీక‌రించారు. ఒక్కో స్టేషన్‌కు సుమారు రూ.25 కోట్ల వ్యయం జరిగినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మూడు స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద అభివృద్ధి చేశారు. ఇవి తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా నిర్మించారు.

55
రాబోయే రోజుల్లో తెలంగాణలో మరిన్ని అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు
Image Credit : X/@kishanreddybjp

రాబోయే రోజుల్లో తెలంగాణలో మరిన్ని అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు

కోల్ అండ్ మైన్స్ శాఖా కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, "ఈ మూడు స్టేషన్ల ప్రారంభోత్సవం తెలంగాణ రైల్వే ప్ర‌గ‌తికి మళ్లీ ఉత్సాహం నింపుతుంది" అని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమం కేవలం మౌలిక వసతుల పునర్నిర్మాణం మాత్రమే కాకుండా, ప్రయాణికుల భద్రత, సౌకర్యం, లింగ సమానత్వానికి దారితీయడం అనే లక్ష్యంతో రూపొందించిన‌ట్టు అధికారులు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని స్టేషన్లు ఈ విధంగా అభివృద్ధి చెయ్యబోతున్న‌ట్లు వెల్ల‌డించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
నరేంద్ర మోదీ
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
Recommended image2
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image3
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Related Stories
Recommended image1
Telangana: దేశంలో తెలంగాణకు టాప్ ప్లేస్
Recommended image2
Nambala Keshava Rao: మావోయిస్టు అగ్రనేత మృతి.. ఎవ‌రీ నంబాల కేశవరావు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved