ప్రపంచంలో అత్యంత సంతృప్తికరమైన జాబ్స్ ఏవి? అసంతృప్తికరమైన జాబ్స్ ఏవి?
ఎస్టోనియాలోని టార్టు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 59,000 మందిపై చేసిన అధ్యయనంలో ఏదయినా లక్ష్యం, సాాధించామన్న సంతృప్తి భావన కలిగించే ఉద్యోగాలు సంతోషాన్నిస్తాయని తేలింది. అలాంటి ఉద్యోగాలేవి, అసంతృప్తికర ఉద్యోగాలేవి ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఉద్యోగం బోర్ కొడుతుందా?
ఉద్యోగం బోర్ కొడుతుంది, బలవంతంగా చేయాల్సి వస్తుందని అంటుంటారు. కానీ కొంతమంది తమ ఉద్యోగాన్ని సంతోషంగా చేస్తారు. ఏ ఉద్యోగం సంతోషాన్నిస్తుంది, ఏది అసంతృప్తినిస్తుందో శాస్త్రవేత్తలు ఇప్పుడు కనుగొన్నారు.
ఉద్యోగాలపై శాస్త్రవేత్తల అధ్యయనం
ఏ ఉద్యోగం ప్రజలకు తృప్తినిస్తుంది, ఏది అసంతృప్తినిస్తుందనే దానిపై ఎస్టోనియాలోని టార్టు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఎస్టోనియన్ బయోబ్యాంక్ సహాయంతో దాదాపు 59,000 మంది నుండి 263 వేర్వేరు ఉద్యోగాల నుండి డేటాను విశ్లేషించారు. ఉద్యోగం, జీతం, వ్యక్తిత్వం, జీవిత తృప్తి గురించి ప్రశ్నలు అడిగి సమాచారం సేకరించారు.
తృప్తికరమైన ఉద్యోగం ఏది?
ఈ అధ్యయనం ప్రకారం ఏ ఉద్యోగమైతే లక్ష్యాన్ని కలిగివుంటుందో, ఏదయినా సాధించామన్న భావనను ఇస్తుందో ఆ ఉద్యోగులు చాలా సంతోషంగా ఉంటారు. మతపరమైన సేవలో ఉన్నవారు కూడా ఎక్కువ తృప్తిని పొందుతారని పరిశోధకులు చెబుతున్నారు. వైద్య నిపుణులు, రచయితలు, సృజనాత్మక వ్యక్తులు, మనస్తత్వవేత్తలు, ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు, షిప్ ఇంజనీర్లు, మెటల్ వర్కర్స్ వంటి సాంకేతిక ఉద్యోగాలు తృప్తికరమైనవిగా తేలింది.
అత్యంత అసంతృప్తికరమైన ఉద్యోగం
దీనికి విరుద్ధంగా, ఎక్కువ నియంత్రణలు, తక్కువ స్వేచ్ఛ, ఎక్కువ బాధ్యతల ఒత్తిడి ఉన్న ఉద్యోగాల్లో ప్రజలు తక్కువ తృప్తిని పొందుతారు. సెక్యూరిటీ గార్డ్స్, హోటల్ సిబ్బంది, సేల్స్‌పర్సన్స్, సర్వే ఇంటర్వ్యూయర్స్, పోస్ట్‌మెన్, కార్పెంటర్లు, కెమికల్ ఇంజనీర్లు, రవాణా, ఉత్పత్తి సంబంధిత ఉద్యోగాలు అసంతృప్తికరమైనవి.
డబ్బు, గౌరవంతో తృప్తి లేదు
అధ్యయనంలో వెల్లడైన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఉద్యోగ గౌరవం లేదా ఎక్కువ జీతం చాలామందికి తృప్తినివ్వడంలేదట. ఉన్నత గౌరవ ఉద్యోగాలు ఎక్కువ తృప్తికి దారితీస్తాయని అనుకోవడం భ్రమేనట. సమాజంలో ఆ ఉద్యోగానికి ఎంత తక్కువ గౌరవం ఉన్నా ఏదయినా సాధించామన్న సాఫల్య భావన కలిగినప్పుడే నిజమైన సంతోషం లభిస్తుందని అధ్యయన రచయిత కైట్లిన్ ఆన్ అన్నారు.
స్వయం ఉపాధి పొందుతున్నవారిలో అధిక సంతోషం
నిపుణుల అభిప్రాయం ప్రకారం స్వయం ఉపాధి పొందుతున్నవారు ఎక్కువ సంతోషంగా ఉంటారట. ఈ పరిశోధన ఎస్టోనియాలో జరిగింది. కానీ పరిశోధన ఫలితాలు ఎస్టోనియాకు మాత్రమే పరిమితం కాదు. ఇది ప్రపంచమంతటికీ వర్తిస్తుంది. ఆయా ప్రాంత సంస్కృతి కూడా ఉద్యోగం గురించి ఆలోచన, అనుభవాన్ని ప్రభావితం చేస్తుంది.