Mumbai Indians: అంబానీ టీమ్ కు టెన్షన్ పెంచుతున్న ఆర్సీబీ స్టార్
Mumbai Indians: ఐపీఎల్ 18వ సీజన్ హోరాహోరీగా సాగుతోంది. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించగా, ముంబై ఇండియన్స్ కూడా ప్లేఆఫ్స్ దిశగా పయనిస్తోంది. కానీ ముంబై చేసిన ఒక్క తప్పు ఇప్పుడు వారిని వెంటాడుతోంది. అంబానీ టీమ్ ను టెన్షన్ పెడుతోంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
హోరాహోరీగా ఐపీఎల్ 2025
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 తుదిదశకు చేరుకుంది. ఐపీఎల్ 18వ ఎడిషన్ లో గుజరాత్ టైటాన్స్, ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాయి.
సూపర్ ఫామ్ లో ఆర్సీబీ
రజత్ పాటిదార్ నాయకత్వంలోని ఆర్‌సీబీ రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ప్లేఆఫ్స్ స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఈ సారి అద్భుత ప్రదర్శనతో తొలి ఐపీఎల్ ట్రోఫీ గెలవాలని విరాట్ కోహ్లీ టీమ్ కలలు కంటోంది.
IPL 2025 లో ముంబై జోరు
అంబానీని టెన్షన్ పెడుతున్న టిమ్ డేవిడ్
ముంబై ఇండియన్స్ వేలంలో చేసిన పెద్ద తప్పు ఇప్పుడు నీతా అంబానీని వెంటాడుతోంది. బిగ్ హిట్టర్ టిమ్ డేవిడ్‌ను వదిలేయడమే ఆ తప్పు. అతనితోనే ఇప్పుడు ముంబైకి పెద్ద టెన్షన్.
ఐపీఎల్ లో ముంబై తరఫున కూడా ఆడిన టిమ్ డేవిడ్
2022 ఐపీఎల్ వేలంలో ముంబై 8.25 కోట్లకు టిమ్ డేవిడ్‌ను కొనుగోలు చేసింది. గత మూడు సీజన్లలో డేవిడ్ ముంబై తరపున 650కి పైగా పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో టిమ్ డేవిడ్ ను వదులుకున్న ముంబై
గత నవంబర్‌లో జరిగిన మెగా వేలం ముందు టిమ్ డేవిడ్‌ను ముంబై ఇండియన్స్ వదిలేసింది. వేలంలో కేవలం 3 కోట్లకే అతన్ని తిరిగి కొనుగోలు చేయలేదు. ఆర్సీబీ అతన్ని దక్కించుకుంది.
మూడు కోట్లకే ఆర్సీబీలోకి టిమ్ డేవిడ్
టిమ్ డేవిడ్‌ను వదిలి, ఇంగ్లాండ్‌కి చెందిన విల్ జాక్స్‌ను 5.25 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. కానీ ఆర్‌సీబీలో కేవలం 3 కోట్లకే చేరిన డేవిడ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆర్సీబీ బ్యాటింగ్ లో కీలకంగా మారాడు.
ప్లేఆఫ్స్‌లో ఆర్‌సీబీ, ముంబై మళ్ళీ తలపడే అవకాశం ఉంది. అప్పుడు టిమ్ డేవిడ్ ముంబైకి సింహస్వప్నంలా మారవచ్చు.