MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • TTD Jobs : హిందూ యువతకు బంపరాఫర్ .. టిటిడిలో ఉద్యోగాలే ఉద్యోగాలు

TTD Jobs : హిందూ యువతకు బంపరాఫర్ .. టిటిడిలో ఉద్యోగాలే ఉద్యోగాలు

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన టిటిడి పాలకమండలి సమావేశంలో ఉద్యోగాల భర్తీతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Arun Kumar P
Published : May 21 2025, 12:27 PM IST| Updated : May 21 2025, 02:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టిటిడి బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం
Image Credit : our own

టిటిడి బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం

TTD Jobs : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలి, ఆయన సేవలో తరించాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. ఇలా ఏడుకొండలవాడి సన్నిధిలో స్వచ్చందంగా సేవ చేసేందుకు చాలామంది ముందుకు వస్తుంటారు.. అలాంటిది సాలరీ ఇచ్చిమరీ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఉద్యోగాలు ఇస్తామంటే ఎవరు వదులుకుంటారు చెప్పండి. తాజాగా టిటిడి బోర్డు సమావేశంలో ఉద్యోగాల భర్తీతో పాటు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

25
టిటిడి ఉద్యోగాల భర్తీ నిర్ణయం
Image Credit : our own

టిటిడి ఉద్యోగాల భర్తీ నిర్ణయం

టిటిడి బోర్డు ఆధ్వర్యంలో నడిచే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS)లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. స్విమ్స్ లోని వివిధ విభాగాల్లో మొత్తం 597 పోస్టుల భర్తీకి టిటిడి బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. కాబట్టి తిరుమల శ్రీవారి సేవలో తరించాలనుకునే యువతకు ఇది అద్భుత అవకాశం... అర్హతలుంటే స్విమ్స్ లో ఉద్యోగాలను పొందవచ్చు.

తిరుపతి స్విమ్స్ అనేది ఓ మెడికల్ యూనివర్సిటీ. దీన్ని ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీతో పాటు మరికొన్ని విద్యాలయాలు, పలు హాస్పిటల్స్ నడుస్తున్నాయి. తక్కువ ఖర్చుతోనే సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించే హాస్పిటల్స్ ను నిర్వహిస్తోంది స్విమ్స్. ఇలా 'మానవ సేవే మాధవ సేవ' అన్నది నిజంచేసి చూపిస్తోంది టిటిడి... ఇందులో భాగంగానే మరింత మెరుగైన వైద్యసేవల కోసం స్విమ్స్ లో ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది.

Related Articles

Related image1
Tirumala: తిరుమల తులాభారం సేవలో అవకతవకలు జరుగుతున్నాయి: TTD సభ్యుడు
Related image2
Tirumala : ఇక ఈ రైలెక్కితే చాలు.. చాలా తొందరగా తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం
35
టిటిడి పాలకమండలి నిర్ణయాలివే
Image Credit : Getty

టిటిడి పాలకమండలి నిర్ణయాలివే

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఛైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన బోర్డ్ సమావేశం జరిగింది... అన్నమయ్య భవన్ లో పాలకమండలి సభ్యులు, ఉన్నతాధికారులు సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. టిటిడి బోర్డు నిర్ణయాలను ఈవో శ్యామలరావు వెల్లడించారు.

తిరుమల ఏడుకొండలు ఇప్పటికే పచ్చదనంతో ప్రకృతి రమణీయంగా ఉంటుంది. ఈ క్రమంలో కొండపై కూడా పచ్చదనాన్ని పెంచి భక్తులకు మరింత మెరుగైన వాతావరణాన్ని కల్పించడమే కాదు అందంగా తీర్చిదిద్దాలని టిటిడి నిర్ణయించింది. ఇలా తిరుమల కొండలు, శ్రీవారి ఆలయ పరిసరాల్లో చెట్ల పెంపకం, పర్యావరణాన్ని కాపాడే చర్యల కోసం రూ.4 కోట్లు కేటాయించారు. అటవీ శాఖతో సమన్వయం చేసుకుంటూ పచ్చదనాన్ని పెంచాలని టిటిడి ప్లాన్ చేస్తోంది.

45
ఒంటిమిట్ట ఆలయంలోనూ నిత్యాన్నధానం
Image Credit : our own

ఒంటిమిట్ట ఆలయంలోనూ నిత్యాన్నధానం

టిటిడి పరిధిలోని ఆలయాల అభివృద్ధికి కమిటీని ఏర్పాటుచేయాలని టిటిడి నిర్ణయించింది. అలాగే తిరుమలలోని 42 అతిథి గృహాల ఆద్యాత్మిక పేర్లు మార్చాలని నిర్ణయించింది. ఇక ఆకాశ గంగ, పాప వినాశనం మార్గాల్లో భక్తుల సౌకర్యార్థం మెరుగైన సేవలు అందించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

టిటిడి ఆధ్వర్యంలో నడిచే ఒంటిమిట్ట రామాలయంలో భక్తులకు నిత్యాన్నధానం కల్పించాలని టిడిపి నిర్ణయించింది. అలాగే తుళ్లూరు మండలం అనంతవరంలోని టిటిడి ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారు. తిరుమలలో క్యాంటీన్లను మంచి సంస్థలకే ఇవ్వాలని నిర్ణయం.. లైసెన్స్ ఫీజుపై కూడా టిటిడి పాలకమండలిలో చర్చించారు.

55
తిరుమలలో యాంటి డ్రోన్ టెక్నాలజీ
Image Credit : our own

తిరుమలలో యాంటి డ్రోన్ టెక్నాలజీ

ఇక చాలాకాలంగా తిరుమలలో అన్యమతస్తులైన ఉద్యోగులు పనిచేస్తుండటంపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే కొందరిపై చర్యలు తీసుకున్నారు. తాజాగా టిటిడిలో పనిచేసే అన్యమతస్తులు స్వచ్చందంగా పదవీ విరమణ పొందితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఇక తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగరకుండా యాంటీ డ్రోన్ టెక్నాలజీని వాడుకోవాలని టిటిడి నిర్ణయించింది. ఇక తిరుచానూరు పద్మావతి అమ్మవారి, అమరావతి వెంకటేశ్వస్వామి ఆలయం, నారాయణవనం కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వరస్వామి ఆలయం, ఒంటిమిట్ట రామాలయాల అభివృద్ధికి సమగ్ర బృహత్‌ ప్రణాళిక సిద్దం చేసేందుకు ప్రతిపాదనలను ఆహ్వానించాలని టిటిడి నిర్ణయించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తిరుపతి
ఆంధ్ర ప్రదేశ్
ఉద్యోగాలు, కెరీర్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved