Asianet News TeluguAsianet News Telugu

సీట్ల లొల్లి: టీడీపీ కోరుతున్న సీట్లివే, కాంగ్రెస్ నుండి అందని జాబితా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  టీడీపీకి 14 స్థానాలను కాంగ్రెస్  పార్టీ కేటాయించింది.  కానీ ఏఏ స్థానాలను కాంగ్రెస్ పార్టీ టీడీపీకి కేటాయించిందనే  విషయమై జాబితాను ఇంతవరకు కాంగ్రెస్ నుండి  టీడీపీకి రాలేదు. 

telangana assembly: here is tdp assembly segments list
Author
Hyderabad, First Published Nov 9, 2018, 12:54 PM IST

హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  టీడీపీకి 14 స్థానాలను కాంగ్రెస్  పార్టీ కేటాయించింది.  కానీ ఏఏ స్థానాలను కాంగ్రెస్ పార్టీ టీడీపీకి కేటాయించిందనే  విషయమై జాబితాను ఇంతవరకు కాంగ్రెస్ నుండి  టీడీపీకి రాలేదు. కాంగ్రెస్ నుండి జాబితా కోసం  టీడీపీ నాయకత్వం ఎదురుచూస్తోంది. అయితే ఎవరికీ పార్టీ నాయకత్వం  నుండి  టికెట్టు లభిస్తోందో...ఎవరికీ బుజ్జగింపులు  వస్తాయనే  విషయమై  టీడీపీ ఆశావాహులు  ఎదురుచూస్తున్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌  ప్రజా కూటమిగా ఏర్పాటయ్యాయి. కాంగ్రెస్ పార్టీ  టీడీపీకి 14 సీట్లను కేటాయించింది. టీజేఎస్ కు 8, సీపీఐ 3 స్థానాలను కేటాయించాలని  నిర్ణయం తీసుకొంది. అయితే టీడీపీకి ఏఏ అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తామో ఆ జాబితా కోసం టీడీపీలోని ఆశావాహులు  ఎదురుచూస్తున్నారు.

గ్రేటర్ హైద్రాబాద్‌ పరిధిలోని  శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్,  ఖమ్మం జిట్లాలోని ఖమ్మం, ఆశ్వరావుపేట, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్ , నర్సంపేట, మహాబూబ్ నగర్ జిల్లాలోని  దేవరకద్ర, మక్తల్, మహాబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలోని  నిజామాబాదర్ రూరల్  అసెంబ్లీ నియోజకవర్గాలను  టీడీపీ కోరుతోంది.

 అయితే కాంగ్రెస్ పార్టీ  ఏ స్థానాలను ఇవ్వనుందో అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  గెలిచే స్తానాలను మాత్రమే కోరాలని  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  తెలంగాణ టీడీపీ నేతలకు  తేల్చి చెప్పారు.

ఈ తరుణంలో  బలం ఉన్న సీట్లను వదులుకోవద్దని  టీడీపీ నేతలు చంద్రబాబును కోరారు.  తెలంగాణ టీడీపీ నేతలతో  చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు  భేటీ కానున్నారు.ఈ సమావేశం తర్వాత అభ్యర్థుల జాబితాను  టీడీపీ ప్రకటించే అవకాశం ఉంది.

మరో వైపు  తాము కోరుకొంటున్న సీట్లు దక్కుతాయా... లేదా  తమకు బుజ్జగింపుల కోసం చంద్రబాబునాయుడు నుండి  ఫోన్ వస్తోందా అనే  విషయమై టీడీపీ ఆశావాహుల్లో  ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత వార్తలు

ఆ సీట్లతో సర్దుకుపోదాం: రమణతో బాబు, నేరుగా రంగంలోకి....

శేరిలింగంపల్లి టీడీపీలో లొల్లి: మెనిగళ్ల ప్రసాద్‌పై దాడికి కారణమిదే: మువ్వ

శేరిలింగంపల్లి లొల్లి: టీడీపీలో బాహాబాహీ, సైకిల్‌కు సీటొద్దంటున్న బిక్షపతి యాదవ్

శేరిలింగంపల్లి లొల్లి: గాంధీ భవన్ ఎదుట బిక్షపతి ధర్నా, ఇద్దరి ఆత్మహత్యాయత్నం

టీడీపీలో ముసలం: మెనిగళ్లపై మువ్వ వర్గీయులు చెప్పులతో దాడి

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?


 

Follow Us:
Download App:
  • android
  • ios