Asianet News TeluguAsianet News Telugu

ఆ సీట్లతో సర్దుకుపోదాం: రమణతో బాబు, నేరుగా రంగంలోకి....

తెలంగాణలో పోటీ చేసే  అభ్యర్థుల జాబితాను  నవంబర్ 9వ తేదీన  టీడీపీ ప్రకటించనుంది.  

Tdp ready to announce candidates list on nov 9
Author
Hyderabad, First Published Nov 8, 2018, 1:28 PM IST


అమరావతి: తెలంగాణలో పోటీ చేసే  అభ్యర్థుల జాబితాను  నవంబర్ 9వ తేదీన  టీడీపీ ప్రకటించనుంది.  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఇవాళ రాత్రి హైద్రాబాద్‌కు చేరుకొంటారు.తెలంగాణ నేతలతో సమావేశం తర్వాత అభ్యర్థుల జాబితాను ప్రకటించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

అభ్యర్థుల జాబితా, సీట్ల సంఖ్యపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో తెలంగాణ టీడీపీ నేతలు గురువారం నాడు అమరావతిలోని  సీఎం నివాసంలో 
సమావేశమయ్యారు. బెంగుళూరులో కర్ణాటక సీఎం కుమారస్వామితో  సమావేశానికి ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డిలు కూడ చంద్రబాబునాయుడుతో బయలుదేరనున్నారు.

ప్రజా కూటమిలో  సీట్ల సర్ధుబాటు, అభ్యర్థుల జాబితా విషయమై తెలంగాణ నేతలతో  బాబు చర్చించారు. మరో వైపు టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డితో  చంద్రబాబునాయుడు  30 నిమిషాల పాటు  ఏకాంతంగా చర్చించారు.  

అసంతృప్తులతో స్వయంగా మాట్లాడుతానని చంద్రబాబునాయుడు ఎల్. రమణకు హామీ ఇచ్చారు. మోడీని ఎదుర్కొనేందుకు తెలంగాణ ఎన్నికలు కలిసివస్తాయని  తెలంగాణ నేతలకు బాబు చెప్పారు.

అయితే  తెలంగాణలో అభ్యర్థుల జాబితా ప్రకటించే విషయంలో తెలంగాణ టీడీపీ నేతలతో చర్చించేందుకు వీలుగా బెంగుళూరుకు తనతో పాటు రావాలని చంద్రబాబునాయుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డిలను చంద్రబాబు కోరారు. ఈ మేరకు వీరిద్దరూ కూడ బాబుతో పాటు బెంగుళూరుకు వెళ్లనున్నారు.

బెంగుళూరులో విమానంలో వెళ్లే సమయంలో  తెలంగాణ ఎన్నికల విషయంలో  అనుసరించాల్సిన  వ్యూహంపై  బాబుతో చర్చించే అవకాశం ఉంది. బెంగుళూరులో కుమారస్వామితో చర్చించిన తర్వాత టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు గురువారం రాత్రి హైద్రాబాద్‌కు రానున్నారు.
 

సంబంధిత వార్తలు

శేరిలింగంపల్లి టీడీపీలో లొల్లి: మెనిగళ్ల ప్రసాద్‌పై దాడికి కారణమిదే: మువ్వ

శేరిలింగంపల్లి లొల్లి: టీడీపీలో బాహాబాహీ, సైకిల్‌కు సీటొద్దంటున్న బిక్షపతి యాదవ్

శేరిలింగంపల్లి లొల్లి: గాంధీ భవన్ ఎదుట బిక్షపతి ధర్నా, ఇద్దరి ఆత్మహత్యాయత్నం

టీడీపీలో ముసలం: మెనిగళ్లపై మువ్వ వర్గీయులు చెప్పులతో దాడి

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

 

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

Follow Us:
Download App:
  • android
  • ios