కోస్టల్ బ్యాంక్ అధినేత, ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం చౌదరి హత్య కేసు విచారణలో రాకేశ్ రెడ్డి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు బయటపడుతున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్టు జయరాం హత్యతో గతంలో రాకేశ్ వల్ల నష్టపోయిన బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు.

తాజాగా రాకేశ్ రెడ్డికి పలువురిని బెదిరించిన ఆడియో టేపులు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెల్లించాల్సిన డబ్బులివ్వకుండా అతనిని రాకేశ్ రెడ్డి బెదిరించాడు. బెంగళూరులో రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో .. తన వద్ద నుంచి రూ.1.5 కోట్లు తీసుకున్నట్లు రాజ్‌కుమార్ అనే వ్యక్తి చెప్పాడు.

డబ్బులు అడిగితే తనను మూడేళ్ల క్రితం బాలానగర్ ‌ఏసీపీ నాగరాజారెడ్డి వద్దకు పిలిపించి రాకేశ్ రెడ్డి బెదిరించాడని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడితో ఆగకుండా డబ్బులు అడిగిన ప్రతీసారి పోలీస్ అధికారులతో తనను బెదిరించేవాడని రాజ్‌కుమార్ తెలిపాడు.

డబ్బులు గురించి ప్రస్తావిస్తే.. అందుకు ప్రతిగా అమ్మాయిలను పంపుతానని అనేవాడన్నాడు. రాకేశ్‌పై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకునేవారు కాదని వెల్లడించాడు. పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో చివరికి కోర్టును ఆశ్రయించినట్లు రాజ్‌కుమార్ వాపోయాడు.

రాకేశ్ రెడ్డి పెద్ద దొంగని, జయరామ్‌కు అప్పు ఇచ్చేంత స్థోమత అతనికి లేదన్నాడు. రాజకీయ నేతలతో ఫోటోలు దిగి, వారితో పరిచయం ఉందని తన జోలికి వస్తే అంతు చూస్తానంటూ రాకేశ్ బెదిరింపులకు దిగేవాడని పేర్కొన్నాడు. తన లాంటి వారు చాలామందిని రాకేశ్ రెడ్డి మోసం చేసేవాడని రాజ్‌కుమార్ వివరించాడు. 

హైదరాబాద్ కు జయరాం హత్యకేసు నిందితులు

ఎన్నిసార్లు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు: పద్మశ్రీ

అలా చెప్పడంతో కీడును శంకించింది: జయరామ్ భార్య

భర్త లేకుండా తొలిసారి పెళ్లి రోజు: జయరామ్ భార్య ఆవేదన

శిఖా చౌదరే చంపించింది, దేవుడు చెప్పినా నమ్మను: జయరామ్ భార్య

ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ

జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ

పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ

జయరామ్‌ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్

జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?