Asianet News TeluguAsianet News Telugu

సానియా భర్త ఖేల్ ఖతమ్?: మరిన్ని వార్తలు

 

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం

 

Top stories of the day
Author
Hyderabad, First Published Jun 18, 2019, 6:18 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మీ ఫ్రస్టేషన్ నా మీదా..? నేనేం పాక్ క్రికెటర్లకు అమ్మను కాను.. సానియా మీర్జా

తానేమీ పాకిస్థాన్ జట్టుకి డైటీషియన్ ని కానని... వాళ్లకి అమ్మని కూడా కానని అంటున్నారు ఇండియన్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా. చాలా మంది నెటిజన్లు తమ ప్రస్టేషన్ తీర్చుకోవడానికి తనకు మెసేజ్ లు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. 
 

ఎన్నికల వరకే పార్టీలు,గెలిచిన తర్వాత అంతా నావారే : వైయస్ జగన్

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న నవరత్నాల ద్వారా రాష్ట్రంలో 90 శాతం జనాభాకు ఆర్థిక, విద్యా, వైద్య రంగాల ద్వారా లాభం చేకూరుతోందన్నారు. ప్రతీ ఒక్కరికి విద్యను ప్రాథమిక హక్కుగా కల్పిస్తామన్నారు.
 

29 సార్లు ఢిల్లీకి చంద్రబాబు... పడిపడి నవ్విన జగన్

అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ పడి పడి నవ్వారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ సమావేశాల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక హోదా గురించి చర్చించారు.
 

ప్రత్యేక హోదా: చంద్రబాబుపై అవంతి సంచలన వ్యాఖ్యలు

ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడాన్ని తాను ఆనాడే తీవ్రంగా వ్యతిరేకించానని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. ఈ విషయమై తాను ఎంపీ పదవికి కూడ రాజీనామా చేస్తానని చెబితే తనను బెదిరించి దీక్షను విరమింపజేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
 

చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సీఎం ఆదేశాలకు అనుగుణంగానే నుడుచుకొంటున్నారని   మాజీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

అది మన ఖర్మ, అయినా వారి మనసు కరిగే వరకు పోరాడుతా: సీఎం వైయస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన దుర్నీతిని, దుశ్సాసన పర్వానికి స్వస్తి పలికి ప్రజల మెచ్చిన పాలన అందించాలన్నదే తమ లక్ష్యమని ఏపీ సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు. అవినీతి రహిత పాలన అందించాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల మంజూరు వంటి ప్రతీ పనిలో అవినీతి చోటు చేసుకుందన్నారు.
 

ప్రత్యేక హోదా ఏ పాపం చేసింది చంద్రబాబూ!: సీఎం వైయస్ జగన్

తాను నడచిన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో అదే చెప్పానని అదే చేస్తానని భవిష్యత్ లో మంచి పాలన అందిస్తానని భరోసా ఇచ్చారు వైయస్ జగన్. వైయస్ జగన్ ప్రసంగానికి మాజీమంత్రి అచ్చెన్నాయుడు పదేపదే అడ్డుతగులుతుండగా స్పీకర్ వారించే ప్రయత్నం చేశారు. అచ్చెన్నాయుడు అలా అడ్డుపడుతూనే ఉంటారని వారిని పట్టించుకోవద్దని కుక్కతోక ఎప్పుడూ వంకరేనని చెప్పుకొచ్చారు వైయస్ జగన్.
 

ఏపీకి ప్రత్యేక హోదా: జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్దం

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం  తాము అన్ని రకాల సహకరిస్తామని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీకి తాము ఒప్పుకొన్నామని ఆయన  వివరణ ఇచ్చారు.
 

కక్షలొద్దు, బాబుకు భద్రత పెంచండి: జగన్‌కు అవినాశ్ లేఖ

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సెక్యూరిటీపై రాష్ట్రప్రభుత్వ తీరుపై తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
 

చంద్రబాబుకు షాక్: టీడీపీలో చీలిక, బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

టీడీపీలో తిరుగుబాటు వస్తోంది... ఆ పార్టీ చీలిపోనుందని బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  విష్ణువర్ధన్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు చేస్తున్నారని ఆయన చెప్పారు.
 

ఇంటి నుండి చంద్రబాబును ఖాళీ చేయిస్తాం: ఆర్కే

ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఉండవల్లి నివాసం నుండి ఖాళీ చేయిస్తామని  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి  స్పష్టం చేశారు.మంగళవారం నాడు ఆయన అసెంబ్లీ  లాబీల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి  మీడియాతో చిట్ చాట్ చేశారు. మీడియాతో మాట్లాడారు.  కరకట్టపై అక్రమ నిర్మాణాల అంశం కోర్టులో కేసులో ఉందని ఆయన గుర్తు చేశారు.
 

సిఎం రమేష్ తో విజయసాయి రెడ్డి సుదీర్ఘ మంతనాలు

లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోమవారం ఆసక్తికర సన్నివేశం కనిపించింది.విజయసాయి, సిఎం రమేష్ మధ్య మంతనాలు అందరినీ ఆకర్షించాయి
 

జబర్దస్త్ ఫెమ్ చలాకీ చంటికి రోడ్డు ప్రమాదం.. (వీడియో)

సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరబండ వద్ద ఆగివున్న ఓ లారీని చలాకీ చంటి ప్రయాణిస్తున్న క్రెటా కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారు ముందుబాగం నుజ్జవగా చంటికి స్వల్ప గాయాలయ్యాయి.
 

పంజాగుట్టలో ఉద్రిక్తత: వైఎస్ విగ్రహాన్ని కూల్చే యత్నం, వీహెచ్ అరెస్ట్

పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చి వేసిన చోట కాంగ్రెస్ సీనియర్ నేత, వి. హనుమంతరావు మరో విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.
 

తన న్యూడ్ ఫోటోలను షేర్ చేసిన హీరోయిన్!

రీసెంట్ గా హాలీవుడ్ నటి బెల్లా థ్రోన్ ఫోన్ ని హ్యాక్ చేసిన కొందరు సైకోలు ఆమె న్యూడ్ ఫోటోలను డౌన్ లోడ్ చేసుకొని ఆమెని బెదిరించడం మొదలుపెట్టారు. వారి అవసరం తీర్చకపోతే ఆ ఫోటోలను నెట్ లో అప్లోడ్ చేస్తామని బెదిరించారట.
 

 

కుర్ర హీరోతో అదితి రావు హైదరి రొమాన్స్.. రెమ్యునరేషన్ చుక్కల్లో!

అదితి రావు హైదరి బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. కానీ ఆమెకు స్టార్ స్టేటస్ తీసుకువచ్చే సినిమా ఇంతవరకు పడలేదు. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం వరుస పరాజయాల్లో ఉన్నాడు. ఓ హిట్ సినిమా కోసం ప్రయత్నిస్తున్నాడు. 
 

'జబర్దస్త్'కి అనసూయ బ్రేక్ ఇవ్వనుందా..?

బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' కార్యక్రమానికి యాంకర్లుగా రష్మి, అనసూయ వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ షోకి అనసూయ గ్యాప్ ఇవ్వనుందనే మాటలు వినిపిస్తున్నాయి. 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి క్రేజ్ దక్కించుకున్న ఈ నటికి వెండితెరపై నటించే వరుస అవకాశాలు వస్తున్నాయి.
 

భారతీరాజా ఘాటు వ్యాఖ్యలు.. అసలు ఎవరీ విశాల్..?

లుగువాడైన విశాల్ తమిళ నడిగర సంఘంలో కీలకబాధ్యతలు నిర్వర్తించడం పలువురిని అసంతృప్తికి గురి చేస్తోంది. గతంలో జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ ప్యానెల్.. శరత్ కుమార్ ప్యానెల్ తో పోటీకి దిగి గెలిచారు. ఆ సమయంలో శరత్ కుమార్, అతడి భార్య రాధికా.. విశాల్ తెలుగువాడని, అతడి కుల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. కానీ అవేవీ విశాల్ పై ఎఫెక్ట్ చూపించలేకపోయాయి.
 

పవన్ పై విమర్శలు.. పృధ్వీకి సినిమా ఇండస్ట్రీ షాక్!

టాలీవుడ్ కమెడియన్ పృధ్వీ ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ, జనసేన పార్టీలపై దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ చాలా కామెంట్స్ చేశారు.
 

 

భారత్-పాక్ మ్యాచ్... అడ్డంగా బుక్కైన గంభీర్

టీం ఇండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దేశం కన్నా డబ్బే ముఖ్యమా అంటూ... గంభీర్ పై మండిపడుతున్నారు. ఆదివారం జరిగిన భారత్- పాక్ మ్యాచ్ నేపథ్యంలో... గంభీర్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అంత పెద్ద నేరం గంభీర్ ఏం చేశాడనేగా మీ సందేహం.

 

పాక్ చెత్త: సానియాతో రెస్టారెంటుకు, షోయబ్ మాలిక్ ఖేల్ ఖతమ్

ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో పాకిస్తాన్ చెత్తగా ఓడిపోవడం ఆ దేశం క్రికెట్ అభిమానులకు మింగుడు పడడం లేదు. తమ జట్టు కెప్టెన్ కు బుర్ర లేదని మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్య పాకిస్తాన్ జట్టుపై ఎంత ఆగ్రహం పెల్లుబుకుతోందో తెలియజేస్తోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios