Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల వరకే పార్టీలు,గెలిచిన తర్వాత అంతా నావారే : వైయస్ జగన్

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న నవరత్నాల ద్వారా రాష్ట్రంలో 90 శాతం జనాభాకు ఆర్థిక, విద్యా, వైద్య రంగాల ద్వారా లాభం చేకూరుతోందన్నారు. ప్రతీ ఒక్కరికి విద్యను ప్రాథమిక హక్కుగా కల్పిస్తామన్నారు. 

ap cm ys jagan final speech in ap assembly sessions
Author
Amaravathi, First Published Jun 18, 2019, 3:38 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని ఏపీ సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో అందర్నీ భాగస్వామ్యులను చూస్తూ ముందుకు వెళ్తామని జగన్ స్పష్టం చేశారు. 

అందులో భాగంగానే తన సామాజిక వర్గాన్ని పక్కనబెట్టి దళితులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వడం ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న నవరత్నాల ద్వారా రాష్ట్రంలో 90 శాతం జనాభాకు ఆర్థిక, విద్యా, వైద్య రంగాల ద్వారా లాభం చేకూరుతోందన్నారు. ప్రతీ ఒక్కరికి విద్యను ప్రాథమిక హక్కుగా కల్పిస్తామన్నారు. 

అటు ఏవ్యక్తి వైద్యం అందకుండా చనిపోకూడదన్న లక్ష్యంతో వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం తన లక్ష్యం కాదన్న జగన్ గెలిచే ముందు ఒక మాట గెలిచిన తర్వాత మరో మాట మాట్లాడే మనస్తత్వం తనది కాదన్నారు.

గత ప్రభుత్వం మాదిరిగా మేనిఫెస్టో పేరుతో ఒక పుస్తకాన్ని తయారు చేసి ఒక్కోసామాజిక వర్గానికి ఒక్కో పేజీ కేటాయిస్తూ ఎన్నికల అనంతరం వాటిని డస్ట్ బిన్ లో పడేయడం లాంటివి చూశామన్నారు. 

మేనిఫెస్టొ అంటే తన చెత్తబుట్టలో పడేసే చిత్తుకాగితం కాదన్నారు. మేనిఫెస్టో అంటే తనకు ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావిస్తానన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పథకం ద్వారా రూ.12,500 చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. ఆదిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

అలాగే రైతులకు పూర్తిగా ప్రీమియం ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లిస్తోందని హామీ ఇచ్చారు. రైతుల ఇన్సూరెన్స్ క్లైమ్ చేసి ప్రభుత్వమే వారికి అందిస్తోందన్నారు. ఇన్సూరెన్స్ క్లైమ్ చేసేందుకు ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే వారిని వెతుక్కుంటూ వెళ్లి క్లైమ్ చేస్తుందన్నారు. 

అలాగే కరువు, వరదలు ప్రకృతి వైపరిత్యాల నుంచి రైతులను ఆదుకునేందుకు ఇన్ పుట్ సబ్సీడీ అందజేయడంతోపాటు ప్రకృతి వైపరీత్యాల నిధిగా రూ.2000 కోట్లు కేటాయించినట్లు జగన్ తెలిపారు. గత ప్రభుత్వం రూ.2,000కోట్ల ఇన్ పుట్ సబ్సీడీ పెండింగ్ పెడితే ఆ పెండింగ్ నిధులను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

రైతుల పండించిన పంటధరలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు రూ.3000కోట్లతో ధరల స్థిరీకరణను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 

గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తే తాము బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై శ్రద్ధ పెట్టలేదన్నారు. సకాలంలో పుస్తకాలు అందించలేదని సెప్టెంబర్ దాటినా పుస్తకాలు అందని పరిస్థితన్నారు. 

అలాగే మధ్యాహ్నం భోజనం కార్మికులకు పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే క్లియర్ చేశామన్నారు. యూనిఫామ్స్ సకాలంలో అందజేస్తామని తెలిపారు. టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చబోతున్నట్లు హామీ ఇచ్చారు. 

అధికారంలోకి వచ్చిన మెుదటి రోజే 40వేల స్కూల్స్ ఫోటోలు తీయించుకున్నామని వాటిని భద్రపరచి, రెండేళ్లలోపు రూపురేఖలు మార్చి మరో ఫోటో తీసి ఎలా మార్చామో ప్రజలకు వివరిస్తామన్నారు. 

ప్రభుత్వ పాఠశాలలో తెలుగు కంపల్సరీ సబ్జెక్టుగా చేసి ఇంగ్లీషు మీడియం స్కూల్స్ గా తీర్చిదిద్దుతానన్నారు. నారాయణ స్కూల్స్ కంటే ఏ మాత్రం తక్కు కాకుండా ప్రతీ ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు తీసుకువస్తానని తెలిపారు. 

స్కూల్లో మధ్యాహ్నాభోజన పథకం కోసం క్వాలిటీ రైస్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. అలాగే రైట్ టు ఎడ్యుకేష్ యాక్ట్ ను కచ్చితంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో పేదలకు 25శాతం రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లకు అమ్ముడుపోయి వాటిని అమలు చేయడం లేదన్నారు. 

రాష్ట్రంలో నిరక్షరాస్యతను రూపుమాపుతానని హామీ ఇచ్చారు. జనవరి 26న రిపబ్లిక్ డే నాడు అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. బడికి పంపిన తల్లులకు గణతంత్ర దినోత్సవం నాడు రూ.15వేలు అందజేయనున్నట్లు తెలిపారు. 

అలాగే డ్వాక్రా యానిమేటర్లకు జీతాలు 10వేలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశానని జగన్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న జీతాలు కంటే ఆశావర్కర్లకు, హోంగార్డులకు ఎక్కువ జీతాలు ఇస్తున్నట్లు తెలిపారు. పారిశుధ్యకార్మికులకు మేలు చేసేలా వారి జీతాలను రూ.18వేలకు పెంచామన్నారు. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చామని ఆదిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. విలీనం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో వీలైనంత మందిని రెగ్యులరైజ్ చేస్తామన్నారు. 

కాంట్రాక్ట్ ఉద్యోగుల క్వాలిఫికేషన్, వారి సర్వీస్ ను పరిగణలోకి తీసుకుని రెగ్యులరైజ్ చేసేందుకు మంత్రులతో కూడిన కమిటీని కూడా వేసినట్లు తెలిపారు. ఔట్ సోర్సింగ్ లో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచుతామని ఇకపై ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.  

అలాగే రూ.1000 దాటితే వైయస్ఆర్ ఆరోగ్యశ్రీని అమలు చేస్తామని తెలిపారు. వార్షికాదాయం రూ.5లక్షలలోపు వారికి ఆరోగ్యశ్రీని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. మూగబోయిన 108 అంబులన్స్ లను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. 

ప్రస్తుతం ఉన్న అంబులెన్స్ తోపాటు అదనంగా మరో 350 అంబులెన్స్ లను కొనుగోలు చేసేందుకు రూ.350 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 104 అంబులెన్స్ కూడా ప్రతీ మండలానికి ఒకటి చొప్పున 650 కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. 

ప్రతీ ఒక్కిరికి వైద్యం అందాలనే లక్ష్యంతో వైద్యవ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే మెడికల్ అడ్వైజరీ కమిటీ వేసినట్లు తెలిపారు. రెండు నెలల్లో కమిటీ నివేదిక అందజేస్తుందని నివేదిక ఆధారంగా ఆరోగ్యశ్రీ పాలసీలో మార్పులు తీసుకువస్తామన్నారు. 

మరోవైపు రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ ఇళ్లు ఉండాలన్నదే తన లక్ష్యమని అందులో భాగంగా ఉగాది పర్వదినాన 25లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. పండుగ వాతావరణంలో రిజిస్ట్రేషన్లు చేసి అక్కచెల్లెమ్మలకు అందజేస్తామన్నారు.  

ఇకపోతే అగ్రిగోల్డ్ బాధితులకు అక్షరాల రూ.1100 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ నిధుల ద్వారా 9లక్షల మంది బాధితులకు మేలు జరుగుతుందన్నారు. అలాగే అక్టోబర్ 2న గ్రామ సెక్రటేరియటర్లను అమలులోకి తీసుకువస్తామని ఆగష్టు 15 నాటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ ద్వారా అందిస్తామన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

అది మన ఖర్మ, అయినా వారి మనసు కరిగే వరకు పోరాడుతా: సీఎం వైయస్ జగన్

ప్రత్యేక హోదా ఏ పాపం చేసింది చంద్రబాబూ!: సీఎం వైయస్ జగన్

29 సార్లు ఢిల్లీకి చంద్రబాబు... పడిపడి నవ్విన జగన్

Follow Us:
Download App:
  • android
  • ios