సిఎం రమేష్ తో విజయసాయి రెడ్డి సుదీర్ఘ మంతనాలు

First Published 18, Jun 2019, 8:37 AM IST

లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోమవారం ఆసక్తికర సన్నివేశం కనిపించింది.విజయసాయి, సిఎం రమేష్ మధ్య మంతనాలు అందరినీ ఆకర్షించాయి

లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోమవారం ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌లు పక్కపక్కనే కూర్చొని సుదీర్ఘ మంతనాలు జరిపారు

విజయసాయి, సిఎం రమేష్ మధ్య మంతనాలు అందరినీ ఆకర్షించాయి. మొదట వచ్చిన సీఎం రమేశ్‌ గ్యాలరీలో ముందువరుసలో కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి వచ్చి ఆయన వెనుక వరుసలో కూర్చున్నారు. తొలుత ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. కొద్దిసేపు ఎవరి సీట్లలో వారే కూర్చుండి పోయారు

ఆ తర్వాత విజయసాయిరెడ్డి ముందు వరుసకు వచ్చి సీఎం రమేశ్‌ పక్కన కూర్చున్నారు. దాదాపు గంటన్నరకుపైగా వారిద్దరూ చాలా సన్నిహితంగా మాట్లాడుకుంటూ కనిపించారు. కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వచ్చారు. అయితే ఆయన వారిద్దరికీ కొంత దూరంలో ఆయన కూర్చున్నారు

ఆ తర్వాత కూడా సీఎం రమేశ్‌, విజయసాయిరెడ్డి  సంభాషణ కొనసాగించారు. సమావేశానంతరం ఈ చర్చల సారాంశం గురించి విజయసాయిరెడ్డిని మీడియా ప్రతనిధులు ప్రశ్నించగా "మీ హయాంలో ఏమేం చేశారో చెప్పాల"ని రమేశ్‌ను అడిగినట్లు జవాబిచ్చారు అని బదులిచ్చారు.

loader