టాలీవుడ్ కమెడియన్ పృధ్వీ ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ, జనసేన పార్టీలపై దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ చాలా కామెంట్స్ చేశారు.

జగన్ గెలిచిన తరువాత కూడా మెగాఫ్యామిలీ, చిరంజీవిపై విమర్శలు చేశారు. ఇలా చేయడం వలన అతడి సినీ కెరీర్ దెబ్బ తింటుందనే ఆలోచన లేకుండా పృధ్వీ నోటికొచ్చినట్లు మాట్లాడడం మెగాహీరోలను బాధపెట్టింది. ఆ కారణంగానే ఇప్పుడు తమ సినిమాల్లో పృధ్వీకి అవకాశాలు ఇవ్వలేదు.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాలో పృధ్వీ కోసం ఓ రోల్ అనుకున్నాడు త్రివిక్రమ్. అయితే అల్లు అర్జున్ మాత్రం దీన్ని వ్యతిరేకించారట. తన సినిమాల్లో పృధ్వీకి చోటు లేదని చెప్పడంతో త్రివిక్రమ్ రాజీ పడక తప్పలేదు. పృధ్వీకి బదులుగా మరో కమెడియన్ ని రంగంలోకి దింపబోతున్నారు.

ఈ విధంగా చూసుకుంటే మెగాహీరోల చిత్రాల్లో పృధ్వీకి అవకాశాలు రావడం కష్టమనే అనిపిస్తోంది. వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేసిన జీవిత రాజశేఖర్, అలీ లాంటి వాళ్లు లౌక్యంగా ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ లేకుండా ప్రచారం చేసుకుంటే పృధ్వీ మాత్రం ఆవేశంతో మెగాఫ్యామిలీ టార్గెట్ చేసి ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు.