Asianet News TeluguAsianet News Telugu

మీ ఫ్రస్టేషన్ నా మీదా..? నేనేం పాక్ క్రికెటర్లకు అమ్మను కాను.. సానియా మీర్జా

తానేమీ పాకిస్థాన్ జట్టుకి డైటీషియన్ ని కానని... వాళ్లకి అమ్మని కూడా కానని అంటున్నారు ఇండియన్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా. చాలా మంది నెటిజన్లు తమ ప్రస్టేషన్ తీర్చుకోవడానికి తనకు మెసేజ్ లు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. 

"Not Pak Team's Dietician": Sania Mirza, Veena Malik Spar On Twitter
Author
Hyderabad, First Published Jun 18, 2019, 1:49 PM IST

తానేమీ పాకిస్థాన్ జట్టుకి డైటీషియన్ ని కానని... వాళ్లకి అమ్మని కూడా కానని అంటున్నారు ఇండియన్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా. చాలా మంది నెటిజన్లు తమ ప్రస్టేషన్ తీర్చుకోవడానికి తనకు మెసేజ్ లు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. 

ఇంతకీ మ్యాటరేంటంటే... భారత్-పాక్ మ్యాచ్ కి ముందు తన భర్త షోయబ్ మాలిక్ అలాగే కొందరు పాక్ క్రికెటర్లతో కలిసి సానియా మీర్జా ఓ రెస్టారెంట్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అది హుక్కా బార్ సెంటర్. కాగా... అక్కడికి సానియా వెళ్లడాన్ని తప్పుపడుతూ పాక్ నటి వీణా మాలిక్ ట్వీట్ చేశారు.

‘‘సానియా..నాకు మీ బాడుని చూస్తుంటే బాధగా ఉంది. మీరు వెళ్లింది.. ఓ హుక్కా బార్ కి. అలాంటి చోటుకి మీరు మీ బిడ్డను తీసుకువెళ్లారు. నాకు తెలిసినంత వరకు ఆ బార్ లో జంక్ ఫుడ్స్ ఎక్కువగా అమ్ముతారు. క్రీడాకారులు అయ్యి ఉండి మీరు, మీ భర్త అలాంటి ఫుడ్ తినడం ఎంత వరకు కరెక్ట్. ఓ తల్లిగా మీకు ఈ విషయాలన్నీ తెలిసి ఉండాలి కదా’ అంటూ ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్ కి సానియా మీర్జా కాస్త ఘాటుగానే స్పందించారు. ‘‘వీణా.. నేను నా బాబుని ఎలాంటి బార్ కి తీసుకువెళ్లలేదు. అయినా.. ఈ విషయాలన్నీ మీకు అనవసరం. నేను నా బిడ్డను ఎంత జాగ్రత్తగా పెంచుకుంటున్నానో నాకు తెలుసు. మరో విషయం..పాకిస్థానీ క్రికెటర్లు ఏం తింటారు, ఎప్పుడు నిద్రపోతారు వంటి విషయాలను పట్టించుకోవడానికి నేనేమీ పాక్‌ క్రికెట్‌ టీం డైటీషియన్‌ను కాను. వారి తల్లిని కాను.. ప్రిన్సిపల్‌ని కాను.. టీచర్‌ను అంతకన్నా కాను. ఏదేమైనా మీరు మా పట్ల ఇంత శ్రద్ధ చూపుతున్నందుకు ధన్యవాదాలు.’’ అంటూ బదులిచ్చారు.

మరో ట్వీట్ లో ‘‘కొందరు నెటిజన్లు ఇలాంటి ట్వీట్లు చేస్తూ నాకు పిచ్చెక్కిస్తుంటారు. మీ ఫ్రస్ట్రేషన్‌ను పోగొట్టుకోవడానికి ఇతర మార్గాలను ఎంచుకోండి’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios