టెక్నాలజీ బాగా పెరగడంతో కొందరు ఆకతాయిలు తమ అవసరాలు తీర్చుకోవడం కోసం పక్క వారిని ఇబ్బంది పెడుతూ ఆనందం పొందుతున్నారు. పోలీసులు ఇలాంటి వారికి బుద్ధి చెబుతున్నా.. కొందరు మారడం లేదు.

రీసెంట్ గా హాలీవుడ్ నటి బెల్లా థ్రోన్ ఫోన్ ని హ్యాక్ చేసిన కొందరు సైకోలు ఆమె న్యూడ్ ఫోటోలను డౌన్ లోడ్ చేసుకొని ఆమెని బెదిరించడం మొదలుపెట్టారు. వారి అవసరం తీర్చకపోతే ఆ ఫోటోలను నెట్ లో అప్లోడ్ చేస్తామని బెదిరించారట.

దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో రాత్రంతా నిద్ర పోకుండా నరకం అనుభవించిందట. అయితే చివరకు ధైర్యం చేసి ఆమె తీసుకున్న నిర్ణయం హ్యాకర్లకు షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. ఎవరో తన ఫోటోలను అప్లోడ్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడమేంటని.. తన న్యూడ్ ఫోటోలను హ్యాకర్స్ కంటే ముందుగా తనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె చేసిన పనికి హ్యాకర్లు షాక్ అయినట్లే ఉన్నారు. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.