Asianet News TeluguAsianet News Telugu

భారతీరాజా ఘాటు వ్యాఖ్యలు.. అసలు ఎవరీ విశాల్..?

తెలుగువాడైన విశాల్ తమిళ నడిగర సంఘంలో కీలకబాధ్యతలు నిర్వర్తించడం పలువురిని అసంతృప్తికి గురి చేస్తోంది. 

vishal background
Author
Hyderabad, First Published Jun 18, 2019, 1:06 PM IST

తెలుగువాడైన విశాల్ తమిళ నడిగర సంఘంలో కీలకబాధ్యతలు నిర్వర్తించడం పలువురిని అసంతృప్తికి గురి చేస్తోంది. గతంలో జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ ప్యానెల్.. శరత్ కుమార్ ప్యానెల్ తో పోటీకి దిగి గెలిచారు. ఆ సమయంలో శరత్ కుమార్, అతడి భార్య రాధికా.. విశాల్ తెలుగువాడని, అతడి కుల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. కానీ అవేవీ విశాల్ పై ఎఫెక్ట్ చూపించలేకపోయాయి.

ఇప్పుడు మరోసారి ఎన్నికలు దగ్గర పడుతుండడంతో విశాల్ తెలుగోడంటూ కొందరు కోలీవుడ్ ఇండస్ట్రీ సభ్యులు కామెంట్స్ చేస్తున్నారు. విశాల్ ని కలుపు మొక్క అని, పందికొక్కు అంటూ సీనియర్ దర్శకుడు భారతీరాజా చేసినవ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తమిళ నడిగర్ సంఘం తమిళేతరుల చేతిలో నడుస్తుండడం బాధగా ఉందని, విశాల్ తమిళవాడు కాదని మరోసారి గుర్తు చేశారు.

తమిళ నడిగర్ సంఘంలో తమిళులు మాత్రమే ఉండాలని ఆవేశంగా చెప్పుకొచ్చారు. విశాల్ తమిళ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ అతడు తెలుగువాడే.. విశాల్ కుటుంబం కొంతకాలం పాటు హైదరాబాద్ లో నివసించింది. విశాల్ పూర్తి పేరు విశాల్ కృష్ణారెడ్డి.. స్క్రీన్ పేరు విశాల్ గా పెట్టుకోవడంతో అదే పేరుతో అందరూ పిలుస్తారు. 1977, ఆగస్ట్ 29న జి.కె.రెడ్డి, జానకి దేవి దంపతులకు విశాల్ పుట్టాడు. 

అతడి కుటుంబం హైదరాబాద్ లో నివసించే సమయంలో విశాల్ దిల్ షుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నాడని అంటారు. ఆ తరువాత విశాల్ కుటుంబం చెన్నైకి మకాం మార్చారు. దీంతో విశాల్ చదువు మొత్తం చెన్నైలోనే సాగింది. విశాల్ సెకండరీ ఎడ్యుకేషన్ ను చెన్నైలోని డాన్ బాస్కో మెట్రిక్యులేన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పూర్తి చేశాడు. ఆ తరువాత లయోలా కాలేజీ నుండి విజువల్ మీడియాలో డిగ్రీ చేశారు.

విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణకి సినిమా రంగంలో సంబంధాలు ఉన్నాయి. దీంతో విశాల్ కి సినిమాల మీద ఆసక్తి పెరిగింది. ఆ విధంగా తమిళ ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అయి, తన మార్క్ చూపించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios