పాక్ చెత్త: సానియాతో రెస్టారెంటుకు, షోయబ్ మాలిక్ ఖేల్ ఖతమ్
First Published Jun 18, 2019, 11:02 AM IST
ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో పాకిస్తాన్ చెత్తగా ఓడిపోవడం ఆ దేశం క్రికెట్ అభిమానులకు మింగుడు పడడం లేదు. తమ జట్టు కెప్టెన్ కు బుర్ర లేదని మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్య పాకిస్తాన్ జట్టుపై ఎంత ఆగ్రహం పెల్లుబుకుతోందో తెలియజేస్తోంది.

ఇస్లామాబాద్: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో పాకిస్తాన్ చెత్తగా ఓడిపోవడం ఆ దేశం క్రికెట్ అభిమానులకు మింగుడు పడడం లేదు. తమ జట్టు కెప్టెన్ కు బుర్ర లేదని మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్య పాకిస్తాన్ జట్టుపై ఎంత ఆగ్రహం పెల్లుబుకుతోందో తెలియజేస్తోంది. మరో వెటరన్ క్రికెటర్ వకార్ యూనిస్ కూడా పాకిస్తాన్ జట్టుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సర్ఫరాజ్ ఫీల్డింగ్ ప్లేస్ మెంట్ ను తప్పు పట్టారు. సర్ఫ్‌రాజ్ అయోమయానికి గురయ్యాడని ఆయన వ్యాఖ్యానించారు. వాహబ్ రియాజ్ బౌలింగ్‌లో షార్ట్ మిడ్ వికెట్‌లో ఫీల్డర్‌ను ఉంచాడని, షాదాబ్‌ఖాన్ బౌలింగ్‌లో స్లిప్‌లో ఫీల్డర్‌ను పెట్టాడని ఆయన తప్పు పట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో లెగ్ స్పిన్నర్‌కు బంతిపై పట్టు దొరకడం కష్టమని, పాక్ జట్టులో ఊహాశక్తి కొరవడిందని. ఆలోచన విధానంలోనే లోపం ఉందని వ్యాఖ్యానించాడు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?