అమరావతి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఉండవల్లి నివాసం నుండి ఖాళీ చేయిస్తామని  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి  స్పష్టం చేశారు.

మంగళవారం నాడు ఆయన అసెంబ్లీ  లాబీల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి  మీడియాతో చిట్ చాట్ చేశారు. మీడియాతో మాట్లాడారు.  కరకట్టపై అక్రమ నిర్మాణాల అంశం కోర్టులో కేసులో ఉందని ఆయన గుర్తు చేశారు.

అక్రమంగా నిర్మించిన నివాసంలోనే మాజీ సీఎం చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్నారని.. ఈ నివాసం నుండి  చంద్రబాబును ఖాళీ చేయిస్తామని ఆయన చెప్పారు.

రాజధాని నిర్మాణ పనులు ఎందుకు నిలిపివేశారో తనకు తెలియదన్నారు. ఎక్సెస్ టెండర్లపై ఆందోళన అవసరం లేదన్నారు.  కాంట్రాక్టర్లకు అనుమానాలుంటే  ఈ విషయమై ప్రభుత్వాన్ిన సంప్రదించాలని  ఆయన సూచించారు. 

సీఆర్‌డీఏ ఛైర్మెన్‌గా సీఎం ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే  ఈ విషయంలో జగన్ మనసులో ఏముందో తనకు తెలియద్నారు.రాజధానిలో స్వంత ఇల్లు కూడ కట్టుకోలేని చంద్రబాబునాయుడు రాజధాని గురించి మాట్లాడడాన్ని ఆయన  ఎద్దేవా చశారు.