MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Healthy Breakfast: డాక్టర్లు సూచించే టాప్ 5 హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవే!

Healthy Breakfast: డాక్టర్లు సూచించే టాప్ 5 హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లు ఇవే!

Healthy Breakfast: ఉదయం మనం తినే ఆహారం రోజంతా శరీరానికి శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రోటీన్‌, ఫైబర్‌, విటమిన్లు అందించే ఫుడ్ తీసుకోవడం మేలు. మరి రోజును హెల్తీగా స్టార్ట్ చేసేందుకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్‌ ఆప్షన్స్‌ ఏవో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Sep 18 2026, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఐడియాస్
Image Credit : AI

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఐడియాస్

రోజును హెల్తీగా ప్రారంభించాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం చాలా ముఖ్యం. బ్రేక్‌ఫాస్ట్‌ను మానేయడం లేదా కేవలం కడుపు నింపే ఆహారాన్ని తీసుకోవడం కంటే, శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అందించే ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది. అలాంటి టాప్ 5 హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఇడ్లీ
Image Credit : stockPhoto

ఇడ్లీ

సులభంగా జీర్ణమయ్యే అల్పాహారాల్లో ఇడ్లీ ముందుంటుంది. బియ్యం, మినపప్పుతో తయారు చేసే ఇడ్లీని ఆవిరిపై ఉడికించడం వల్ల నూనె అవసరం చాలా తక్కువగా ఉంటుంది. మినపప్పు నుంచి ప్రోటీన్ కూడా లభిస్తుంది. ఇడ్లీని కేవలం చట్నీతో కాకుండా సాంబార్‌తో కలిపి తింటే పప్పులు, కూరగాయల ద్వారా ప్రోటీన్, ఫైబర్, ఇతర పోషకాలు కూడా అందుతాయి.

36
పెసరట్టు
Image Credit : Getty

పెసరట్టు

పెసలు లేదా పెసరపప్పుతో తయారయ్యే పెసరట్టు ప్రోటీన్, ఫైబర్ అందించే మంచి బ్రేక్ ఫాస్ట్. పెసరపప్పులో ఉండే మొక్కల ఆధారిత ప్రోటీన్ కడుపు నిండిన భావనను ఇస్తుంది. అయితే పెసరట్టును తక్కువ నూనెతో తయారు చేసుకోవడం మంచిది. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వంటి పదార్థాలను మితంగా జోడించవచ్చు. అల్లం చట్నీ లేదా పల్లీ చట్నీతో తీసుకుంటే రుచిగా ఉంటుంది. పోషకంగా ఉంటుంది.

46
రాగి ఇడ్లీ లేదా రాగి దోస
Image Credit : stockPhoto

రాగి ఇడ్లీ లేదా రాగి దోస

రాగులను ఆహారంలో చేర్చుకోవడానికి రాగి ఇడ్లీ, రాగి దోస మంచి మార్గాలు. రాగిలో ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రాగి దోసను తయారు చేసేటప్పుడు నూనె తక్కువగా వాడటం మంచిది. అలాగే రాగి ఇడ్లీని సాంబార్, కూరగాయలతో కలిపి తింటే మరిన్ని పోషకాలు అందుతాయి.

56
వెజిటబుల్ ఊతప్పం
Image Credit : Instagram

వెజిటబుల్ ఊతప్పం

కూరగాయలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి వెజిటబుల్ ఊతప్పం రుచికరమైన మార్గం. దోస పిండితో తయారు చేసే ఊతప్పంపై క్యారెట్, ఉల్లిపాయ, టమాట, క్యాప్సికమ్, కొత్తిమీర వంటి వాటిని జోడించవచ్చు. ఇలా చేయడం వల్ల బ్రేక్ ఫాస్ట్ లో కూరగాయల పరిమాణం పెరుగుతుంది. అయితే ఊతప్పం హెల్తీగా ఉండాలంటే నూనె తక్కువగా ఉపయోగించడం మంచిది.

66
గోధుమ రవ్వ ఉప్మా
Image Credit : Getty

గోధుమ రవ్వ ఉప్మా

నార్మల్ రవ్వ ఉప్మాకు బదులుగా గోధుమ రవ్వతో చేసే ఉప్మా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. గోధుమ రవ్వలోని ఫైబర్ కారణంగా ఎక్కువ సేపు కడుపునిండిన భావన కలుగుతుంది. ఉప్మాలో క్యారెట్, బీన్స్, బఠానీలు, క్యాప్సికమ్ వంటి కూరగాయలను ఎక్కువగా వేస్తే ఆహారంలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాల పరిమాణం పెరుగుతుంది. వేరుశనగలు లేదా ఇతర గింజలను మితంగా వేసుకోవడం ద్వారా రుచి, పోషక విలువలు పెరుగుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rani Haram: ఒక్క రాణి హారం చాలు.. ఎవరైనా మహారాణిలా మెరిసిపోతారు
Recommended image2
Cumin: ఇంట్లో కుండీలోనే జీలకర్ర ఎలా పెంచాలో తెలుసా?
Recommended image3
Flax Seeds: ప్రతిరోజూ ఒక స్పూన్ అవిసెగింజలు తింటే ఏమౌతుంది?
Related Stories
Recommended image1
Telugu Saying: చెబితే వినని వాళ్లని చెడితే చూడాలట! పెద్దలు ఈ సామెత ఊరికే చెప్పలేదు!
Recommended image2
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం.. మీపై అసూయ ఉన్నవారిని ఎలా గుర్తించాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved