MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 25 కోట్ల బడ్జెట్.. 300 కోట్ల కలెక్షన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ

25 కోట్ల బడ్జెట్.. 300 కోట్ల కలెక్షన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ

కేవలం 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఓ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్ కూడా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 17 2026, 09:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చిన్న సినిమాగా వచ్చి సంచలనం
Image Credit : others

చిన్న సినిమాగా వచ్చి సంచలనం

చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించింది బెత్లెహెం ఫ్యామిలీ యూనిట్. 'ప్రేమలు' లాంటి సూపర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన గిరీష్ ఏ.డి. ఈ కొత్త తరం లవ్ స్టోరీని తెరకెక్కించారు. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ, ట్రెండింగ్ బ్యూటీ మమితా బైజు జంటగా నటించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్న సినిమాలు ఈ మధ్య కాలంలో చాలానే ఉన్నాయి. భారీ యాక్షన్ సీన్లు, స్పెషల్ సాంగ్స్, వీఎఫ్ఎక్స్ హంగామా ఏమీ లేకపోయినా.. ఇవి కేవలం కంటెంట్ బలంతో కోట్లు కొల్లగొడుతున్నాయి. నివిన్ పౌలీ, మమితా బైజు నటించిన 'బెత్లెహెం ఫ్యామిలీ యూనిట్' కూడా సరిగ్గా ఇదే కోవలోకి వస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కలెక్షన్ల వర్షం కురిపించిన మూవీ..
Image Credit : Bhavana Studios

కలెక్షన్ల వర్షం కురిపించిన మూవీ..

ఈ సినిమా కొద్ది రోజుల క్రితం మలయాళంలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇది ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయేలా రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతోంది. కేవలం 25 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ఇప్పటివరకు 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. దీంతో నిర్మాతలకు భారీ లాభాలు వచ్చాయి.

ఈ సినిమా థియేటర్లలో రిలీజై దాదాపు నెల రోజులు కావస్తున్నా కలెక్షన్ల జోరు మాత్రం తగ్గలేదు. ఈ మూవీ తెలుగు వెర్షన్ రీసెంట్‌గా తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజైంది. ఇక్కడ కూడా ఆడియన్స్ నుంచి దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో గట్టిగానే చర్చ జరుగుతోంది.

34
ఓటీటీలోకి ఎప్పుడొస్తుందంటే?
Image Credit : Bhavana Studios

ఓటీటీలోకి ఎప్పుడొస్తుందంటే?

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ 'బెత్లెహెం ఫ్యామిలీ యూనిట్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాను థియేటర్లలో రిలీజైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ కుదిరినట్లు సమాచారం.

ఈ లెక్కన చూసుకుంటే.. ఈ బ్లాక్ బస్టర్ మూవీ సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. మలయాళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా ఒకేసారి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

44
ఎవరెవరు నటించారంటే?
Image Credit : Bhavana Studios

ఎవరెవరు నటించారంటే?

ఇక 'బెత్లెహెం ఫ్యామిలీ యూనిట్' సినిమాలో నివిన్ పౌలీ, మమితా బైజుతో పాటు సంగీత్ ప్రతాప్, సురేష్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, రోషన్ షానవాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దిలీష్ పోతన్, ఫహద్ ఫాజిల్, శ్యామ్ పుష్కరన్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. విశేషం ఏంటంటే.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi Songs: ఆ హీరో చిరంజీవి సాంగ్స్ చేయడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదా ? అందుకే ఆపేశా అంటూ కామెంట్స్
Recommended image2
Nagarjuna: ఛి.. ఛి ఇదేం పని అనుకున్న నాగార్జున, బిగ్ బాస్ హోస్ట్ ఎలా అయ్యాడు, కింగ్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Master Bharath: యాక్టర్ నుంచి డాక్టర్ గా.. తల్లి చివరి కోరిక తీర్చడానికి కెరీర్ ను త్యాగం చేసిన మాస్టర్ భరత్...
Related Stories
Recommended image1
krishna: చార్లీ చాప్లిన్ గెటప్ వేయమంటే సూపర్ స్టార్ కృష్ణ ఏమన్నారో తెలుసా? షాక్ అయిన దర్శకుడు.. అస్సలు ఊహించలేదు..
Recommended image2
Venkatesh: ఒక్క ఫైట్ లేదు, విలన్ కూడా లేడు, సినిమా చూసి వెంకటేష్ భార్య త్రివిక్రమ్ ను పిలిచి ఏమన్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved