MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
  • Home
  • Entertainment
  • Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక

Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక

అల్లరి నరేష్‌ హీరోగా నటించిన `రంభ ఊర్వశి మేనక` మూవీ రెండు వారాల క్రితం విడుదలైంది. ఇప్పుడు థియేటర్లో క్లోజింగ్‌కి చేరుకుంది. మరి సినిమా హిట్టా ఫట్టా అనేది చూస్తే,

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 17 2026, 09:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మళ్లీ కామెడీ జోన్‌లోకి వచ్చిన అల్లరి నరేష్‌
Image Credit : X/@HasyaMovies

మళ్లీ కామెడీ జోన్‌లోకి వచ్చిన అల్లరి నరేష్‌

కామెడీ చిత్రాల హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అల్లరి నరేష్‌. `అల్లరి` మూవీనే తన ఇంటి పేరుగా మార్చుకొని రాణించారు. వరుసగా అనేక కామెడీ చిత్రాలు చేసి మెప్పించారు. స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. కానీ వాళ్ల నాన్న ఈవీవీ సత్యనారాయణ మరణం తర్వాత కెరీర్‌ గాడి తప్పింది. అంటే ఆశించిన స్థాయిలో విజయాలు రాలేదు. సరైన స్క్రిప్ట్ ల ఎంపికలోనూ కొంత తడబాటు కనిపిస్తుంది. ఈక్రమంలో ఓ దశలో ఆయన సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపించలేదు. దీంతో యాక్షన్‌ థ్రిల్లర్స్ వైపు టర్న్ తీసుకున్నారు. మల్టీస్టారర్స్ కూడా చేశారు. అక్కడ సక్సెస్‌ అయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బాక్సాఫీసు వద్ద డీలా పడ్డా రంభ ఊర్వశి మేనక
Image Credit : X/@HasyaMovies

బాక్సాఫీసు వద్ద డీలా పడ్డా రంభ ఊర్వశి మేనక

కానీ మళ్లీ కామెడీ సినిమాల డిమాండ్ రావడంతో మరోసారి తన బలమైన కామెడీ కంటెంట్‌తో ఇప్పుడు `రంభ ఊర్వశి మేనక` అనే చిత్రంలో నటించారు. దీనికి చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వం వహించారు. ఇందులో సురభి, రాశీ సింగ్‌, విష్ణు ప్రియా భీమనేని, ప్రిషా సింగ్‌ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్‌, నరేష్‌ వీకే, శ్రీనివాస్‌ రెడ్డి వంటి వారు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. హాస్య మూవీస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకాలపై రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మించారు. సెప్టెంబర్‌ 4న ఈ చిత్రం విడుదలైంది. ప్రారంభం నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

34
రంభ ఊర్వశి మేనక కలెక్షన్లు
Image Credit : X/@HasyaMovies

రంభ ఊర్వశి మేనక కలెక్షన్లు

ఇక `రంభ ఊర్వశి మేనక` మూవీ కలెక్షన్లు ఎలా ఉన్నాయి? ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందనేది చూస్తే, సినిమా విడుదలై 13 రోజులు పూర్తి చేసుకుంది. బుధవారం దీనికి రెండు లక్షల కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.5.40కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. సాక్నిల్క్ సైట్‌ మాత్రం ఇది రూ.4.82కోట్లు మాత్రమే వసూలు చేసినట్టు వెల్లడించడం గమనార్హం. ఏవైనా ఇది చాలా తక్కువ కలెక్షన్లు అనే చెప్పాలి.

44
అల్లరి నరేష్‌కి బిగ్‌ షాక్‌
Image Credit : X/@HasyaMovies

అల్లరి నరేష్‌కి బిగ్‌ షాక్‌

`రంభ ఊర్వశి మేనక` మూవీకి దాదాపు రూ.15కోట్ల బడ్జెట్‌ అయ్యిందట. థియేట్రికల్‌గా రూ.4.5కోట్లకు అమ్మినట్టు సమాచారం. చాలా వరకు సొంత రిలీజ్‌కి వెళ్లారు. ఏదేమైనా ఐదు కోట్ల థియేట్రికల్‌ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ తో విడుదలైన ఈ మూవీ ఇప్పటి వరకు అందులో సగం కలెక్షన్లని మాత్రమే వసూలు చేసింది. థియేట్రికల్‌గా ఇది క్లోజింగ్‌కి చేరుకుంది. మన తెలుగు రాష్ట్రాల రెండు మూడు థియేటర్లలోనే ఆడుతుంది. రేపటి నుంచి అందులోనూ ఎత్తేసే ఛాన్స్ ఉందని సమాచారం. దీంతో థియేట్రికల్‌ రన్‌ పూర్తి కాబోతుందని తెలుస్తోంది. మొత్తంగా రెండున్నర కోట్ల వరకు నష్టాలను తీసుకొచ్చే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అల్లరి నరేష్‌కిది మరో దెబ్బ అని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
25 కోట్ల బడ్జెట్.. 300 కోట్ల కలెక్షన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ
Recommended image2
krishna: చార్లీ చాప్లిన్ గెటప్ వేయమంటే సూపర్ స్టార్ కృష్ణ ఏమన్నారో తెలుసా? షాక్ అయిన దర్శకుడు.. అస్సలు ఊహించలేదు..
Recommended image3
Irumudi 27 Days Collections: థియేటర్లో రవితేజ మాస్‌ జాతర.. 27వ రోజూ ఇరుముడికి సంచలన వసూళ్లు.. ఇక ఓటీటీ వంతు
Related Stories
Recommended image1
Allu Arjun: అన్న అల్లు అర్జున్‌లోని సీక్రెట్ టాలెంట్స్ అన్ని బయటపెట్టిన శిరీష్‌.. వామ్మో ఇన్ని కళలున్నాయా?
Recommended image2
Irumudi 27 Days Collections: థియేటర్లో రవితేజ మాస్‌ జాతర.. 27వ రోజూ ఇరుముడికి సంచలన వసూళ్లు.. ఇక ఓటీటీ వంతు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved