MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Chicken Curry Tips: చికెన్ కూర మరింత రుచిగా రావాలంటే సింపుల్ చిట్కాలు ఇవిగో

Chicken Curry Tips: చికెన్ కూర మరింత రుచిగా రావాలంటే సింపుల్ చిట్కాలు ఇవిగో

Chicken Curry Tips: చికెన్ కూర మరింత రుచిగా రావాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటించాలి. ఎన్ని మసాలాలు వేసినా ఒక్కోసారి చికెన్ కూర టేస్ట్ రాదు. అలాంటప్పుడు కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 18 2026, 09:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చికెన్ కూర రుచి కోసం చిట్కాలు
Image Credit : Google

చికెన్ కూర రుచి కోసం చిట్కాలు

చికెన్ తో చేసే వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి. ముఖ్యంగా వేడి వేడి అన్నంలో చికెన్ కూర వేసుకుని తింటే ఆ రుచే వేరు. అయితే చికెన్‌ను రుచిగా వండటం అందరికీ రాదు. కాస్త అటూ ఇటైనా చికెన్ గట్టిగా, డ్రైగా మారిపోతుంది. లేదా చికెన్ ఇగురు అంత రుచిగా రాదు. చికెన్ ముక్కలు పైన ఉడికినట్లు కనిపించినా లోపల మాత్రం సరిగ్గా ఉడకదు. కొన్ని తప్పులు వల్ల చికెన్ కూర సరిగా రాదు. చికెన్ కూర రుచిగా రావాలంటే చికెన్ కూర ఎలా వండకూడదు, ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకోండి.

ఫ్రోజెన్ చికెన్ వాడుతారు కొంతమంది. కానీ దాన్ని వాడకూడదు. తాజా చికెన్‌లో తేమ ఎక్కువగా ఉంటుంది. దీన్ని వండినప్పుడు జ్యూసీగా వస్తుంది. ఫ్రోజెన్ లేదా ప్యాక్ చేసిన చికెన్ తన సహజమైన తేమను కోల్పోయి డ్రైగా మారుతుంది. వీలైనంత వరకు ఫ్రెష్ చికెన్ వాడేందుకు ప్రయత్నించండి.

కేవలం బోన్‌లెస్ ముక్కల కంటే ఎముకలు ఉండే భాగాల్లో కొవ్వు శాతం సరిగ్గా ఉంటుంది. ఇది ఉడికేటప్పుడు కరిగి, మాంసానికి మంచి ఫ్లేవర్, తేమను ఇస్తుంది. కాబట్టి బోన్‌లెస్ చికెన్ వండితే అంత రుచిగా ఉండదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
గిన్నెపై మూత పెట్టకపోవడం
Image Credit : stockPhoto

గిన్నెపై మూత పెట్టకపోవడం

చికెన్ కూర వండుతున్నప్పుడు కళాయిపై మూత పెట్టాలి. ఆవిరి బయటకు పోకుండా లోపలే లాక్ అవ్వడం వల్ల, ఆ తేమతో చికెన్ డ్రై అవ్వకుండా చాలా సాఫ్ట్‌గా ఉడుకుతుంది.

చాలామంది హడావిడిలో చికెన్‌ను మ్యారినేట్ చేయకుండా వండేస్తుంటారు. చికెన్‌ను ఉప్పు, పెరుగు, నిమ్మరసం, మసాలాలతో మ్యారినేట్ చేయడం వల్ల ముక్కలకు మసాలా బాగా పడుతుంది. వండినప్పుడు డ్రై అవ్వకుండా జ్యూసీగా ఉంటుంది.

చికెన్‌ను నీటితో కడిగితే క్లీన్ అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల చికెన్ పై ఉండే హానికరమైన బ్యాక్టీరియా వంటగదిలోని పాత్రలు, సింక్‌కు వ్యాపిస్తుంది. సరిగ్గా ఉడికించడం ద్వారా మాత్రమే చికెన్‌లోని బ్యాక్టీరియా చనిపోతుంది.

33
స్కిన్‌లెస్ చికెన్..
Image Credit : X

స్కిన్‌లెస్ చికెన్..

చికెన్ పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా రావాలంటే స్కిన్ ఉంచడం మంచిది. స్కిన్ లోపలి తేమ బయటకు పోకుండా కాపాడి, చికెన్ క్యారమెలైజ్ అవ్వడానికి సహాయపడుతుంది.

చికెన్ బ్రెస్ట్ ముక్కలు చాలా మందంగా ఉంటాయి. వాటిని అలాగే వండితే పైన ఉడికి, లోపల పచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే మీట్ హ్యామర్‌తో ముక్కను సమాన మందంతో ఉండేలా కొట్టుకోవాలి. ముక్క సమానంగా ఉంటే బాగా ఉడుకుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rice: వైట్ రైస్ కాదు.. రెడ్ రైస్ , బ్లాక్ రైస్.. ఏది తినడం ఆరోగ్యానికి మంచిది?
Recommended image2
Hair Growth: ఒత్తైన జుట్టు కోసం.. వీటిని రెగ్యులర్ గా తింటే చాలు!
Recommended image3
Navaratri Fasting: నవరాత్రి ఉపవాసం చేస్తున్నారా? అయితే ఈ 9 రోజులు ఇలా ప్లాన్ చేసుకోండి
Related Stories
Recommended image1
Modi Food: ప్రధాని మోదీ ప్రతిరోజూ ఇష్టంగా తినే అయిదు ఆహారాలు ఇవే
Recommended image2
America: అమెరికాలో ఇళ్ల ముందు కరెంటు స్తంభాలు, వైర్లు ఎందుకు కనిపించవు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved