MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Hyderabad: హైదరాబాద్ నగరం ఎక్కడి నుంచి మొదలౌతుందో తెలుసా?

Hyderabad: హైదరాబాద్ నగరం ఎక్కడి నుంచి మొదలౌతుందో తెలుసా?

Hyderabad: అటు చివర పఠాన్ చెరు నుంచి.. ఇటు చివర ఎల్బీనగర్ వరకు అంతా హైదరాబాద్ నగరమే. కానీ.. అసలు హైదరాబాద్ ఎక్కడి నుంచి మొదలౌతుంది? హైదరాబాద్ జీరో మైల్ స్టోన్ ఎక్కడ ఉంది? దీని వెనక కథ ఏంటి?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 18 2026, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
హైదరాబాద్ ఎక్కడి నుంచి మొదలౌతుంది?
Image Credit : Gemini ai

హైదరాబాద్ ఎక్కడి నుంచి మొదలౌతుంది?

మనం ఏదైనా ఊరు నుంచి హైదారాబాద్ ప్రయాణిస్తున్నట్లయితే.... "హైదరాబాద్ – 50 KM" లేదా "హైదరాబాద్ – 10 KM" అని రాసి ఉన్న మైలురాళ్లు చూస్తూనే ఉంటాం. కానీ, అసలు ఈ దూరాన్ని లెక్కించడానికి నగరంలో '0 కిలోమీటర్లు' పాయింట్ ఎక్కడ ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? హైదరాబాద్ నగరం సరిగ్గా ఎక్కడ ప్రారంభమవుతుంది? నగరానికి అసలైన హార్ట్ లాంటి ఆ జీరో మైల్‌స్టోన్ ప్రదేశం ఏది అనే విషయం చాలామందికి తెలియదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
హైదరాబాద్ 'జీరో మైల్‌స్టోన్' ఎక్కడ ఉందంటే:
Image Credit : Gemini ai

హైదరాబాద్ 'జీరో మైల్‌స్టోన్' ఎక్కడ ఉందంటే:

హైదరాబాద్ నగర అధికారిక, చారిత్రక 'జీరో మైల్‌స్టోన్' నాంపల్లిలోని తెలంగాణ అసెంబ్లీ భవనానికి సరిగ్గా ఎదురుగా ఉంటుంది. ఆరెంజ్ రంగులో మెరిసిపోయే ఈ రాతి మైలురాయిపై "0 KM" అని స్పష్టంగా చెక్కి ఉంటుంది. నిజాం పాలనా కాలంలో హైదరాబాద్ రాజ్యాన్ని, దాని చుట్టుపక్కల ప్రాంతాలను మ్యాపింగ్ చేయడానికి, దూరాలను కొలవడానికి ఈ ప్రదేశాన్ని ప్రధాన కేంద్ర బిందువుగా నిర్ణయించారు.

ఈ ప్రదేశానికే ఆ ప్రత్యేకత ఎందుకు?

నాంపల్లి, అసెంబ్లీ పరిసర ప్రాంతాలు నిజాం రాజుల కాలం నుండి ప్రధాన పరిపాలనా రంగానికి నిలయంగా ఉన్నాయి. అందుకే రాష్ట్రాలోని ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్‌కు ఉన్న దూరాన్ని కొలవడానికి ఈ ప్రాంతాన్ని 'హార్ట్ ఆఫ్ హైదరాబాద్' గా గుర్తించారు.

అంతేకాదు, పూర్వ నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రధాన రవాణా కేంద్రంగా ఉండటం, అలాగే రాజ్ భవన్, అసెంబ్లీ వంటి ముఖ్యమైన ప్రభుత్వ భవనాలు ఇక్కడే ఉండటంతో రోడ్డు కొలతలన్నింటికీ అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఈ పాయింట్‌నే ప్రామాణికంగా తీసుకున్నారు.

మైలురాళ్ల లెక్కలు: మీరు కర్నూలు, విజయవాడ, వరంగల్ లేదా ముంబై వైపు నుండి హైదరాబాద్ నగరం వైపు వస్తున్నప్పుడు రహదారిపై తగ్గుతూ వచ్చే కిలోమీటర్ల లెక్క సరిగ్గా నాంపల్లి అసెంబ్లీ వద్ద ఉన్న ఈ 'జీరో మైల్‌స్టోన్' వద్దకే ముగుస్తుంది.

నగరం గ్రేటర్ హైదరాబాద్‌గా, ఐటీ కారిడార్‌గా ఎంత విస్తరించినప్పటికీ, భాగ్యనగర భౌగోళిక చరిత్రకు, నగర ప్రారంభ రేఖకు నాంపల్లి అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఈ 'జీరో మైల్‌స్టోన్' నేటికీ సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Chain: అర తులంలో ఈజీగా లభించే చైన్ డిజైన్లు..చూసేయండి
Recommended image2
వేడి పెనంపై నీళ్లు పోయ‌కూడ‌ద‌ని ఎందుకు అంటారు.? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా?
Recommended image3
Egg vs Chicken vs Mutton: గుడ్డు, చికెన్, మటన్.. ఈ మూడింటిలో ప్రోటీన్ దేనిలో ఎక్కువ?
Related Stories
Recommended image1
Moral Story: నా కన్నా గొప్ప ఎవరూ లేరు అనుకుంటే.. చివరకు జరిగేది ఇదే.. కళ్లు తెరిపించే కథ ఇది..!
Recommended image2
Tamarind: చింతపండు రంగు, రుచి మారకుండా సంవత్సరం మొత్తం తాజాగా ఉండాలా? ఇలా చేస్తే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved