MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Epic 5 Days Collections: ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యకి పెద్ద షాక్‌.. దారుణంగా పడిపోయిన ఎపిక్‌ కలెక్షన్లు

Epic 5 Days Collections: ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యకి పెద్ద షాక్‌.. దారుణంగా పడిపోయిన ఎపిక్‌ కలెక్షన్లు

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన `ఎపిక్‌` మూవీ థియేటర్లో స్ట్రగుల్‌ అవుతుంది. భారీ హైప్‌తో వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 16 2026, 09:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎపిక్‌కి అదే గట్టి దెబ్బ
Image Credit : Asianet News

ఎపిక్‌కి అదే గట్టి దెబ్బ

`బేబీ` తర్వాత ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా `ఎపిక్‌ ఫస్ట్ సెమిస్టర్‌` చిత్రంలో నటించారు. ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీకర మూవీస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇది గత శుక్రవారం విడుదలైంది. రొమాంటిక్‌ కామెడీ చిత్రంగా దీనికి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఫస్టాఫ్‌ బాగుంది, కానీ సెకండాఫ్‌ డల్‌గా ఉందనే కామెంట్స్ వచ్చాయి. అదే సమయంలో యూకేలో మూవీ తీయడంలో అక్కడ కల్చర్‌ మెయిన్‌గా చూపించడంతో మన ఆడియెన్స్ కి పెద్దగా ఎక్కలేదు. దీంతో ఇది సినిమాపై ప్రభావం చూపించింది. సిటీ ఆడియెన్స్ తప్ప బీ, సీ సెంటర్ల నుంచి దీనికి పెద్దగా రెస్పాన్స్ లేదు. దీంతో `ఎపిక్‌`కి బాక్సాఫీసు వద్ద గట్టి దెబ్బ పడిందని చెప్పొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎపిక్‌ మూవీ కలెక్షన్లు
Image Credit : X/@SitharaEnts

ఎపిక్‌ మూవీ కలెక్షన్లు

ఇక ఐదు రోజులు పూర్తి చేసుకున్న `ఎపిక్‌ ఫస్ట్ సెమిస్టర్‌` మూవీకి కలెక్షన్లు ఎంత వచ్చాయనేది చూస్తే, ఈ చిత్రం మంగళవారం(ఐదో రోజు) కేవలం కోటి రూపాయలు చేసింది. ఇండియా నెట్‌ కేవలం రూ.57లక్షలు మాత్రమే. సోమవారం వసూళ్లతో పోల్చితే 40శాతం పడిపోయింది. ఇక ఐదు రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.9.5కోట్లు వచ్చాయి. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే సుమారు రూ.13కోట్ల గ్రాస్‌ రావాలి. అంటే ఇంకా ఐదు కోట్ల గ్రాస్‌ రాబట్టాలి. మరి లాంగ్‌ రన్‌లో దాన్ని చేరుకుంటుందా అనేది చూడాలి.

34
నిర్మాత సేఫ్‌, కానీ థియేట్రికల్ గా ఎపిక్‌ ఫ్లాప్‌?
Image Credit : X/@SitharaEnts

నిర్మాత సేఫ్‌, కానీ థియేట్రికల్ గా ఎపిక్‌ ఫ్లాప్‌?

`ఎపిక్‌` మూవీకి అయిన బడ్జెట్‌ సుమారు ఇరవై కోట్లు అని సమాచారం. ఓటీటీ, శాటిలైట్‌, ఆడియో రూపంలో బాగానే వచ్చాయి. నిర్మాత నాగవంశీ ఇప్పటికే సేఫ్‌లో ఉన్నారు. కానీ థియేట్రికల్‌గా ఈ మూవీ అనుకున్నది రాబడితేనే హిట్‌ కింద లెక్క. లేదంటే ఫ్లాప్‌గానే పరిగణించాల్సి ఉంటుంది. థియేట్రికల్‌గా ఈ మూవీ ఎంత చేస్తుందనేది ప్రశ్న. చూడబోతుంటే నష్టాల్లోనే ముగిసే అవకాశం కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

44
వందకోట్లు అనుకుంటే పది కోట్లు కూడా రాలే
Image Credit : Asianet News

వందకోట్లు అనుకుంటే పది కోట్లు కూడా రాలే

ఇదిలా ఉంటే ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన `బేబీ` మూవీ వంద కోట్లు వసూలు చేసింది. ఊహించని విజయాన్ని సాధించింది. అదే జోడీతో రూపొందిన మూవీ కావడంతో `ఎపిక్‌`పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో `ఎపిక్‌` వెనకబడింది. దీంతో ఇది వంద కోట్లు కాదు కదా, పది కోట్లు వసూలు చేయడానికే నానా కష్టాలు పడుతుండటం గమనార్హం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు
Recommended image2
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image3
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Related Stories
Recommended image1
Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు
Recommended image2
Maremma Day 5 Collections: రవితేజ తమ్ముడి కొడుకు సినిమాకి టీ ఖర్చులు కూడా రాలేదా.. మారెమ్మ 5 రోజుల వసూళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved