MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు

Mandaadi 6 Days Collections: ఆనంద్‌, సుమంత్‌, కార్తీలకు చుక్కలు చూపిస్తోన్న సుహాస్‌, సూరి.. మండాడికి మతిపోయే వసూళ్లు

తెలుగు హీరో తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ నటించిన మూవీ `మండాడి`. సూరి హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. పోటీగా వచ్చిన హీరోలకు చుక్కలు చూపిస్తోంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 16 2026, 08:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోన్న మండాడి
Image Credit : X/@rsinfotainment

బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోన్న మండాడి

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ‘మండాడి’ మూవీ రూపొందింది. ఇందులో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి భారీ ఎత్తున విడుదల చేసింది. సెప్టెంబర్‌ 10న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. సంచలన వసూళ్లని రాబడుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బండాడి ఆరు రోజుల కలెక్షన్లు
Image Credit : X/@rsinfotainment

బండాడి ఆరు రోజుల కలెక్షన్లు

`మండాడి` మూవీకి మొదట మిశ్రమ స్పందన లభించింది. యావరేజ్‌ నుంచి, ఎబౌ యావరేజ్‌గా వినిపించింది. కానీ నెమ్మదిగా పుంజుకుంది. రెండో రోజు నుంచే జోరు చూపించింది. అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. ఈ చిత్రానికి ఆరో రోజు రూ.4.40కోట్లు రాబట్టింది. వీక్‌ డేస్‌లో ఈ స్థాయిలో వసూళ్లు రావడం విశేషం. ఓవర్సీస్‌లో ఆరో రోజు కోటిన్నర వచ్చింది. అక్కడ మొత్తంగా రూ.10.65కోట్లు రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.69.43కోట్లు రావడం విశేషం. ఇండియాలో దీనికి రూ.58.78కోట్ల గ్రాస్‌ వచ్చింది.

34
బ్రేక్‌ ఈవెన్‌ దాటి లాభాల్లోకి మండాడి
Image Credit : X/@rsinfotainment

బ్రేక్‌ ఈవెన్‌ దాటి లాభాల్లోకి మండాడి

అయితే ఐదో రోజు సోమవారం దీనికి రూ.11.25కోట్ల కలెక్షన్లు రాగా, మంగళవారం భారీగా పడిపోయింది. సుమారు అరవై శాతం పడిపోవడం గమనార్హం. ఇది పెద్ద డ్రాప్‌ అనే చెప్పాలి. ఇక ఈ మూవీకి అయిన బడ్జెట్‌ రూ.60కోట్లు అని సమాచారం. సుమారు 70కోట్లు అయ్యిందని సూరి ఆ మధ్య ఓ ఈవెంట్‌లో తెలిపారు. ఇక సినిమాకి అయిన థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.25కోట్లు. దాదాపు రూ.27కోట్ల బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌తో థియేటర్‌లో విడుదలైంది. ఇప్పుడు ఆల్‌రెడీ బ్రేక్‌ ఈవెన్‌ దాటేసింది. దీనికి సుమారు రూ.35కోట్ల షేర్‌ రావడం విశేషం. అంటే ఇది పది కోట్ల లాభాల్లోకి వెళ్లింది. ఇప్పుడు వంద కోట్ల దిశగా వెళ్తోంది. సుహస్‌, సూరిల సినిమాకి ఈ రేంజ్‌ కలెక్షన్లు అంటే మామూలు విషయం కాదు. కంటెంట్‌ ఉంటే ఆడియెన్స్ బ్రహ్మరథం పడతారని మరోసారి నిరూపితమైంది.

44
ఆనంద్‌, కార్తీ, సుమంత్‌లకు సుహాస్‌ షాక్‌
Image Credit : X/@rsinfotainment

ఆనంద్‌, కార్తీ, సుమంత్‌లకు సుహాస్‌ షాక్‌

అంతేకాదు ఓటీటీ రూపంలోనూ అదిరిపోయే డీల్‌ వచ్చింది. నెట్‌ ఫ్లిక్స్ దీనికి రూ.40కోట్లు ఇచ్చి కొనుగోలు చేసిందట. మొదట పది కోట్లకు రిజెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు అదే ఎక్స్‌ ట్రా రూ.30కోట్లు చెల్లించి కొనడం విశేషం. గత వారం విడుదలైన చిత్రాల్లో `మండాది`నే బాక్సాఫీసుని షేక్‌ చేస్తోంది. సుహస్‌, సూరి కలిసి.. ఆనంద్‌ దేవరకొండ(ఎపిక్‌), సుమంత్‌(మహేంద్రగిరి), కార్తి(సర్దార్‌ 2) సినిమాలకు చుక్కలు చూపిస్తున్నారు. `మండాడి`తో పోటీలో వారి సినిమాలు డీలా పడ్డాయి. డిజాస్టర్లుగా నిలుస్తుండటం గమనార్హం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తమిళ సినిమా
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Recommended image2
Priyanka Singh: బతుకుతానో లేదో తెలియదు, అద్ధంలో ముఖం చూసుకుంటే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రియాంక సింగ్ ఎమోషనల్ కామెంట్స్
Recommended image3
Indian 3: రెండోది అట్టర్ ఫ్లాప్, అయినా మూడోది మొదలు పెట్టిన శంకర్.. వార్ మోడ్‌లో 'భారతీయుడు 3' షురూ
Related Stories
Recommended image1
Maremma Day 5 Collections: రవితేజ తమ్ముడి కొడుకు సినిమాకి టీ ఖర్చులు కూడా రాలేదా.. మారెమ్మ 5 రోజుల వసూళ్లు
Recommended image2
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved