MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jabardasth: మెగాస్టార్ నే మెప్పించిన జబర్దస్త్ కమెడియన్, ఒక్క ఏడాది 8 సినిమాలు, భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న నటుడు ఎవరు?

Jabardasth: మెగాస్టార్ నే మెప్పించిన జబర్దస్త్ కమెడియన్, ఒక్క ఏడాది 8 సినిమాలు, భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న నటుడు ఎవరు?

Jabardasth: బుల్లితెరపై తన మార్క్ చూపించిన కమెడియన్, వెండితెరపై వరుస అవకాశాలు సాధిస్తున్న నటుడు, తన గెటప్పులతో మిమిక్రీ, కామెడీ టైమింగ్ తో మెగాస్టార్ చిరంజీవి మెప్పించిన నటుడు.. ప్రస్తుంతం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నది ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 18 2026, 08:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జబర్దస్త్ తో గుర్తింపు.. మెగాస్టార్ మెచ్చిన కమెడియన్
Image Credit : Asianet News

జబర్దస్త్ తో గుర్తింపు.. మెగాస్టార్ మెచ్చిన కమెడియన్

జబర్దస్త్ ద్వారా తన మార్క్ చూపించి.. తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన హాస్య నటుడు గెటప్ శ్రీను. జబర్దస్త్ కామెడీ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ఆయన, ఇప్పుడు వెండితెరపై కూడా డిమాండ్ ఉన్న కమెడియన్‌గా దూసుకుపోతున్నారు. బుల్లితెరపై ‘జబర్దస్త్’ ప్రోగ్రామ్ ద్వారా చిత్రవిచిత్రమైన గెటప్స్ తో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు గెటప్ శ్రీను. సుడిగాలి సుధీర్, ఆటో రామ్‌ప్రసాద్‌లతో కలిసి ఆయన చేసిన స్కిట్‌లు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సాధించడమే కాకుండా, విపరీతమైన ఆదరణ పొందాయి.

పేరుకు తగినట్లే ఏ పాత్ర వేసినా అందులోనే ఒదిగిపోయే ఆయన టాలెంట్‌కు సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలు సైతం ముగ్ధులయ్యారు. గెటప్ శ్రీను కోసం మాత్రమే జబర్దస్త్ చూసే ప్రేక్షకులు ఉన్నారంటే ఆయన మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. శ్రీను టాలెంట్ కు మెచ్చిన చిరంజీవి తన సినిమాల్లో వరుసగా అవకాశాలు ఇచ్చాడు. ఇండస్ట్రీలో నిలబడటానికి శ్రీనుకి ఇది మంచి అవకాశంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బుల్లితెర నుంచి వెండితెరకు – స్టార్ ఆఫర్లు
Image Credit : ETV

బుల్లితెర నుంచి వెండితెరకు – స్టార్ ఆఫర్లు

చిన్న తెరపై సాధించిన తిరుగులేని క్రేజ్ ఆయనకు టాలీవుడ్‌లో వెండితెర అవకాశాలను తెచ్చిపెట్టింది. వరసగా సినిమా అవకాశాలు వస్తుండటంతో శ్రీను క్రమంగా జబర్దస్త్ షోకు దూరమై, ప్రస్తుతం సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. సీనియర్ హీరోల సినిమాలతో పాటు యంగ్ హీరోల చిత్రాల్లోనూ కీలకమైన కామెడీ పాత్రల్లో నటిస్తున్నారు. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'రాకాస', రీసెంట్‌గా వచ్చిన 'లెనిన్' వంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఒకే ఏడాది దాదాపు 8 చిత్రాల్లో నటించారంటే వెండితెరపై ఆయనకున్న క్రేజ్ స్పష్టమవుతోంది.

35
హాట్ టాపిక్‌గా మారిన భారీ రెమ్యునరేషన్
Image Credit : ETV

హాట్ టాపిక్‌గా మారిన భారీ రెమ్యునరేషన్

సినిమా ఇండస్ట్రీలో డిమాండ్‌తో పాటు నటుల పారితోషికం కూడా మారుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో గెటప్ శ్రీను రెమ్యునరేషన్ చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు రోజువారీ పారితోషికంతో ప్రారంభించిన ఆయన, ఇప్పుడు తనకున్న క్రేజ్ ,మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగానే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తను అనుకున్న పారితోషికం అందుకోవడం విశేషం. దర్శక నిర్మాతలు కూడా ఆయన కామెడీకున్న టైమింగ్, థియేటర్లో తెచ్చే నవ్వుల స్కోప్‌ను దృష్టిలో ఉంచుకుని అడిగినంత ఇవ్వడానికి వెనుకాడటం లేదని సమాచారం.

45
ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నాడంటే?
Image Credit : ETV

ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నాడంటే?

ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం గెటప్ శ్రీను తను నటించే పాత్ర ప్రాధాన్యాన్ని బట్టి ఒక్కో సినిమాకు రూ. 40 లక్షల నుంచి 50 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొన్ని పెద్ద ప్రాజెక్టులు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలకు ఈ మొత్తం మరికొంత ఎక్కువగా కూడా ఉండే అవకాశం ఉంది. ఏటా పొడవునా వరస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల, ఏడాదికి ఆయన సంపాదన కోట్లలోనే ఉంటుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

55
నిరంతర శ్రమకు దక్కిన ప్రతిఫలం
Image Credit : ETV

నిరంతర శ్రమకు దక్కిన ప్రతిఫలం

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి వచ్చి, కేవలం తన సొంత ప్రతిభ, నిరంతర కష్టంతో ఈ స్థాయికి ఎదిగారు గెటప్ శ్రీను. బుల్లితెర హాస్య నటుడి నుంచి ఒక సినిమాకి రూ. 50 లక్షల పారితోషికం అందుకునే స్థాయికి చేరుకోవడం ఆయన ప్రతిభకు దక్కిన గౌరవం. కమెడియన్‌గానే కాకుండా విభిన్నమైన పాత్రలు చేస్తూ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టులలో ఒకరిగా తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు గెటప్ శ్రీను.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image2
25 కోట్ల బడ్జెట్.. 300 కోట్ల కలెక్షన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved