MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు కుండపోత వర్షాలు

Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు కుండపోత వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 18 2026, 08:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నాలుగు రోజులు కుండపోత వర్షాలు
Image Credit : chatgpt

నాలుగు రోజులు కుండపోత వర్షాలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ సడన్ షాకింగ్ న్యూస్ చెప్పింది. గత కొద్ది రోజులుగా ఎండలు, తీవ్రమైన ఉక్కపోతతో సతమతమవుతున్న జనాలకు ఉపశమనం లభించబోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 19 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఫామ్ అయి, అది దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాల వైపు కదిలే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ వర్షాలతో ఇప్పటివరకు ఉన్న లోటు వర్షపాతం భర్తీ అయ్యే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Image Credit : Google AI

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో వర్షాల తీవ్రత రోజురోజుకూ పెరగనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఐఎండీ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నందున ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

35
ఐటీ ఉద్యోగులకు అర్లీ లాగౌట్.. వర్క్ ఫ్రమ్ హోమ్
Image Credit : Gemini

ఐటీ ఉద్యోగులకు అర్లీ లాగౌట్.. వర్క్ ఫ్రమ్ హోమ్

హైదరాబాద్‌లో భారీ వర్ష సూచనతో పాటు గణేష్ నిమజ్జన వేడుకలు, ఊరేగింపులు ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు రాకుండా సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్ కీలక మార్గదర్శకాలు ఇచ్చారు. సెప్టెంబర్ 18 నుంచి 25వ తేదీ వరకు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు మధ్యాహ్నం 2 గంటల తర్వాత విడతల వారీగా ఎర్లీ లాగౌట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రోడ్లపై రద్దీ తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కోరారు. అలాగే వర్షాల కష్టాలు తప్పుకోవడానికి విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహిస్తే బెటర్ అని యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు.

45
ఆంధ్రప్రదేశ్‌ పై తుపాను ముప్పు
Image Credit : Gemini

ఆంధ్రప్రదేశ్‌ పై తుపాను ముప్పు

ఉత్తర థాయ్‌లాండ్‌పై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి ఈ నెల 21 లేదా 22 నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. సెప్టెంబర్ 24 నాటికి ఇది ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటవచ్చని ఐఎండీ తెలిపింది. అయితే ఈ వాయుగుండం మరింత బలపడి 'అర్నాబ్' తుపానుగా మారే ఛాన్స్ ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. దీని ఎఫెక్ట్‌తో కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు.

55
వాతావరణంలో మార్పులతో జాగ్రత్త
Image Credit : Gemini

వాతావరణంలో మార్పులతో జాగ్రత్త

ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ వాతావరణం భిన్నంగా ఉంది. ఓ వైపు ఎండ తీవ్రతతో నెల్లూరులో ఏకంగా 40.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే ఈ అల్పపీడనంతో ఒక్కసారిగా వాతావరణం కూల్ కానుంది. అరేబియా సముద్రంలోని అల్పపీడనం, బంగాళాఖాతంలో రాబోయే తుపాను పరిణామాలతో తెలంగాణ, ఏపీతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌లోనూ రానున్న వారం రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ, వాతావరణ శాఖ ఇచ్చే సమాచారాన్ని ఫాలో అవ్వాలని అధికారులు సూచించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్ అంత ఉన్న దేశం.. ప్ర‌పంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఎలా మారింది.?
Recommended image2
Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Recommended image3
9 రోజులు.. కానీ 8 నైవేద్యాలే.. బతుకమ్మ వేడుకల్లో ఒక రోజు నైవేద్యం ఎందుకు ఉండదో తెలుసా?
Related Stories
Recommended image1
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image2
Nissan Car: రూ. 5 లక్షలకే అదరగొట్టే 7 సీటర్ కారు.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 24 కిలోమీటర్ల మైలేజ్ గ్రావిట్‌ సొంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved