MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Technology
  • Jio Offers Free Canva Pro: జియో యూజర్లకు సూపర్ ఆఫర్.. 4 వేలు ఫ్రీ.. ఇలా చేయండి

Jio Offers Free Canva Pro: జియో యూజర్లకు సూపర్ ఆఫర్.. 4 వేలు ఫ్రీ.. ఇలా చేయండి

Jio Offers Free Canva Pro: రిలయన్స్ జియో తన యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 4,000 విలువైన క్యాన్వా ప్రో, క్యాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను 12 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. మైజియో యాప్ ద్వారా పొందే ఈ ఆఫర్ వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 16 2026, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్రియేటర్లకు పండగే పండగ.. ఫ్రీగా 12 నెలల క్యాన్వా ప్రో.. జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్
Image Credit : chatgpt

క్రియేటర్లకు పండగే పండగ.. ఫ్రీగా 12 నెలల క్యాన్వా ప్రో.. జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ఒక కిరాక్ ఆఫర్‌ను అనౌన్స్ చేసింది. ప్రముఖ విజువల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ ‘క్యాన్వా’తో జియో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ పార్టనర్‌షిప్ ద్వారా జియో యూజర్లకు రూ. 4,000 కంటే ఎక్కువ విలువైన క్యాన్వా ప్రో, క్యాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించనుంది. మీరు గనుక సోషల్ మీడియా క్రియేటర్, స్టూడెంట్ లేదా డిజైనింగ్ యాప్స్ వాడకంలో ఉన్నవారైతే ఇది మీకు సూపర్ న్యూస్ అని చెప్పవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏ జియో ప్లాన్‌పై ఏ క్యాన్వా ఆఫర్ లభిస్తుంది?
Image Credit : X/Canva

ఏ జియో ప్లాన్‌పై ఏ క్యాన్వా ఆఫర్ లభిస్తుంది?

జియో యూజర్లకు వారు చేసుకునే రీఛార్జ్ ప్లాన్ ఆధారంగా క్యాన్వా సబ్‌స్క్రిప్షన్ అందుతుంది. కంపెనీ వివరాల ప్రకారం..

• రూ. 399 ప్లాన్: ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే యూజర్లకు క్యాన్వా ప్రో (Canva Pro) సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

• రూ. 349 ప్లాన్, ఇతర ప్లాన్లు: రూ. 349 ప్లాన్, అలాగే రోజుకు 2GB డేటా ఇచ్చే రూ. 349 కంటే ఎక్కువ విలువైన సెలెక్టెడ్ ప్లాన్ల పై క్యాన్వా ప్రో లైట్ (Canva Pro Lite) సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందుతుంది.

ఈ ఆఫర్ వల్ల యూజర్లు ఏకంగా 12 నెలల పాటు ప్రీమియం టూల్స్‌ను ఫ్రీగా ఎంజాయ్ చేయవచ్చు. ఎలాంటి హిడెన్ ఛార్జీలు లేవని జియో స్పష్టం చేసింది.

35
మైజియో యాప్‌ ద్వారా ఉచితంగా ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
Image Credit : Google

మైజియో యాప్‌ ద్వారా ఉచితంగా ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?

ఈ బంపర్ ఆఫర్‌ను పొందడం చాలా ఈజీ. యూజర్లు విడిగా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

1. మీ స్మార్ట్‌ఫోన్‌లో మైజియో (MyJio) యాప్‌ను ఓపెన్ చేయండి.

2. యాప్‌లోని క్యాన్వా (Canva) ఆఫర్ బ్యానర్‌పై టాప్ చేయండి.

3. ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకుని డిజైనింగ్ స్టార్ట్ చేయండి.

ఈ ఆఫర్ 2026 సెప్టెంబర్ 16 నుంచి జియో రీఛార్జ్ ఛానెల్స్, మైజియో యాప్‌ ద్వారా అందుబాటులోకి వస్తుంది.

45
క్యాన్వా ప్రో, ప్రో లైట్ ఫీచర్లు ఇవే
Image Credit : X/Canva

క్యాన్వా ప్రో, ప్రో లైట్ ఫీచర్లు ఇవే

క్యాన్వా ప్రో సబ్‌స్క్రిప్షన్‌తో మిలియన్ల కొద్దీ ప్రీమియం టెంప్లేట్స్, ఫొటోలు, వీడియోలు, ఫాంట్స్ యాక్సెస్ లభిస్తుంది. అంతేకాకుండా ఒక్క టాప్‌తో బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్, మ్యాజిక్ ఎరేజర్, మ్యాజిక్ రీసైజ్ వంటి అమేజింగ్ టూల్స్ వాడొచ్చు.

ప్రో ప్లాన్‌లో 5 అడ్వాన్స్‌డ్ బ్రాండ్ కిట్స్, కంటెంట్ ప్లానర్, క్యాన్వా ఏఐ చాట్‌బాట్, ఎక్కువ ఏఐ యూసేజ్ లిమిట్స్, 100GB క్లౌడ్ స్టోరేజ్ లభిస్తాయి. మరోవైపు ప్రో లైట్ ప్లాన్‌లో 3 బేసిక్ బ్రాండ్ కిట్స్, 50GB క్లౌడ్ స్టోరేజ్ మాత్రమే అందుతాయి.

55
ఫోన్ నుంచే డిజైనింగ్.. క్రియేటర్లకు ఎంతో హెల్ప్‌ఫుల్
Image Credit : gemini

ఫోన్ నుంచే డిజైనింగ్.. క్రియేటర్లకు ఎంతో హెల్ప్‌ఫుల్

ఈ పార్టనర్‌షిప్ వల్ల ఎక్స్‌పీరియన్స్ లేని కొత్తవాళ్ళు కూడా తమ ఫోన్ల నుంచే సోషల్ మీడియా పోస్టులు, ప్రెజెంటేషన్లు, గ్రీటింగ్ కార్డులు, మార్కెటింగ్ కంటెంట్ ఈజీగా క్రియేట్ చేయవచ్చు. భారతీయ యూజర్ల కోసం క్యాన్వా హిందీతో పాటు అనేక ప్రాంతీయ భాషల సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. డిజిటల్ ఇండియాలో ప్రతి విద్యార్థి, క్రియేటర్, చిన్న వ్యాపారవేత్త తమ సొంత భాషలో కంటెంట్ క్రియేట్ చేసుకుని ఎదుగాలనే ఉద్దేశంతోనే ఈ ఆఫర్ తెచ్చినట్లు రిలయన్స్ జియో తెలిపింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartwatch : స్మార్ట్‌వాచ్ వెనక ఓ పచ్చ లైట్ ఎప్పుడూ బ్లింక్ అవుతుంటుంది.. ఎందుకో తెలుసా?
Recommended image2
POCO: పోకో నుంచి 3 మైండ్ బ్లోయింగ్ 5G కొత్త ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫీచర్ల వివరాలు ఇవే
Recommended image3
WhatsApp Tips : మీ ఫోన్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నా వాట్సాప్ మాత్రమే ఆఫ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?
Related Stories
Recommended image1
Weather Update: 3 రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
Recommended image2
Tank Bund Ganesh Immersion: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం బంద్.. ఖైరతాబాద్ వినాయకుడి పరిస్థితి ఏంటి? అసలు కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved