MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌

Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 10 తొమ్మిదవ రోజు ఎపిసోడ్‌ ఆసక్తికరంగా సాగింది. దేబ్జానీ, ముఖేష్‌ గడ మధ్య కెమిస్ట్రీ ఆసక్తికరంగా మారింది. నువ్వంటే ఇష్టమని, కానీ నువ్వు నన్ను మోసం చేస్తున్నావని దేబ్జానీ కామెంట్‌ చేయడం వైరల్‌గా మారింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 15 2026, 11:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దేబ్జానీ చుట్టూనే బిగ్ బాస్‌ తెలుగు 10 కంటెంట్‌
Image Credit : youtube/@starmaa

దేబ్జానీ చుట్టూనే బిగ్ బాస్‌ తెలుగు 10 కంటెంట్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 10 రెండో వారం 9వ రోజుకి చేరుకుంది. మంగళవారం ఎపిసోడ్‌ ఆసక్తికరంగా సాగింది. ఓవైపు దేబ్జానీ, ముఖేష్‌ గౌడ మధ్య లవ్‌ ట్రాక్‌, మరోవైపు కెప్టెన్సీ టాస్క్ కోసం కంటెస్టెంట్ల వాదనలు ఆసక్తికరంగా మారాయి. ఇందులోనూ దేబ్జానీ హైలైట్‌ కావడం విశేషం. ఇక ప్రారంభంలో డార్లింగ్‌ అనే పదానికి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు దేబ్జానీ.. చాలా మంది డార్లింగ్ అని వాడుతున్నారు. అది తప్పు, అలా వాడకూడదు. చాలా మందికి కనీసం డార్లింగ్‌ స్పెల్లింగ్‌ కూడా తెలియదు అని దేబ్జానీ.. నరేష్‌ ముందు అనగా, నరేష్‌ డార్లింగ్‌ స్పెల్లింగ్‌ చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో దేబ్జానీ రియాక్ట్ అవుతూ, ఏ నువ్వు కాదు, షటాప్‌ అంటూ ఫన్నీగా ఫైర్‌ అయ్యింది. ఇది నవ్వులు పూయించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ముఖేష్‌ మోసం చేశాడంటూ దేబ్జానీ రచ్చ
Image Credit : youtube/@starmaa

ముఖేష్‌ మోసం చేశాడంటూ దేబ్జానీ రచ్చ

ఆ తర్వాత స్విమ్మింగ్‌ పూల్‌లో.. ముఖేష్‌ గౌడ, వర్షిణి స్విమ్‌ చేశారు. ముఖేష్‌ షర్ట్ లేకుండా స్విమ్‌ చేశాడు. దీన్ని దేబ్జానీ నిలదీసింది. నువ్వు నాకు ఇష్టమని చెప్పాను, అయినా నన్ను కాదని ఆమెతో బట్టలు లేకుండా స్విమ్‌ చేశావంటూ గోల చేసింది. తనని మోసం చేశావంటూ రచ్చ చేసింది. దీనికి రాం ప్రసాద్‌ కూడా సపోర్ట్ చేశాడు. మా చెల్లినే మోసం చేస్తావా అంటూ రెచ్చిపోయారు. ఈ క్రమంలో వాష్‌ రూమ్‌ ఏరియాలో కాసేపు నవ్వులు విరిసాయి. ఇది ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది.

35
సుధీర్‌పై త్రిగుణ్‌ ఫైర్‌
Image Credit : youtube/@starmaa

సుధీర్‌పై త్రిగుణ్‌ ఫైర్‌

మరోవైపు సుధీర్‌ విషయంలో త్రిగుణ్‌ కంప్లెయింట్‌ చేశాడు. టిష్యూస్‌ పడేసే విషయంలో సుధీర్‌ ప్రవర్తనపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. అలాగే షాలినికి సపోర్ట్ చేసే విషయంలోనూ సుధీర్‌ చేసిన పనిని తప్పుపట్టాడు త్రిగుణ్‌. ఆ వ్యక్తి మొహం కూడా చూడాలని లేదంటూ ఓపెన్‌గా కామెంట్‌ చేశాడు. మధ్యలో వినాయకచవితి సంబరాలు చేశారు. స్వీట్లు తిన్నారు. అనంతరం సుధీర్‌, త్రిగుణ్‌ కూర్చొని మాట్లాడుకున్నారు. సృష్టి విషయంలో తెలియకుండా మాట్లాడావని, నా క్యారెక్టర్‌ అస్సాసినేట్‌ చేశావని త్రిగుణ్‌.. సుధీర్‌కి క్లాస్‌ పీకాడు. అనంతరం కెప్టెన్సీ కంటెండర్‌కి సంబంధించిన ఫలితం వచ్చింది. ఈ సారి ఆడియెన్సే ఎవరు కెప్టెన్సీ కండెండర్‌ ఉండాలనేది నిర్ణయిస్తారు. ఈ లెక్కన దేబ్జానీ, త్రిగుణ్‌, అమన్‌, షాలిని, ముఖేష్‌ గౌడ, రోహిత్‌, జాన్సీ, రామ్‌ ప్రసాద్‌లకు కెప్టెన్సీ కండెండర్‌ అయ్యే అవకాశాన్ని ఆడియెన్స్ ఇచ్చారు.

45
కెప్టెన్సీ టాస్క్ ల్లో
Image Credit : youtube/@starmaa

కెప్టెన్సీ టాస్క్ ల్లో

వీరి మధ్య టాస్క్ లకు సంబంధించిన పోటీ జరిగింది. గజిబిజీగా ఉన్న అక్షరాల్లోని పదాన్ని గుర్తించాలి. ఈ టాస్క్ లో సరిగా పెట్టిన వాళ్లు.. ఉన్న వారిలో ఎవరు కెప్టెన్‌ అయ్యేందుకు అనర్హులు అనేది చెప్పాలి. ఒక్కొక్కరు ఒక్కోక్కల్ని నామినేట్‌ చేశారు. ఈ క్రమంలో కంటెస్టెంట్ల మధ్య గట్టి వాదనలే జరిగాయి. మొదటి రౌండ్‌లో త్రిగుణ్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. ఆయన్ని చాలా మంది అనర్హుడిగా భావించారు. ఆ తర్వాత రామ్‌ ప్రసాద్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. వీరితోపాటు దేబ్జానీ కూడా ఎలిమినేట్‌ అయ్యింది. రోహిత్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. ఝాన్సీ, షాలిని, అమన్‌, ముఖేష్‌ గౌడ మధ్య పోటీ ఉంది. వీరిలో అమన్‌, ముఖేష్‌ లు కూడా డేంజర్‌లో ఉన్నారు. మరి ఇంకా ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. రేపటి గేమ్‌ ఆసక్తికరంగా ఉండబోతుంది.

55
కంటెంట్‌ ఇస్తోన్న దేబ్జానీ..
Image Credit : youtube/@starmaa

కంటెంట్‌ ఇస్తోన్న దేబ్జానీ..

అయితే ఇందులో దేబ్జానీ విషయంలో ఆమెకి తెలుగు సరిగా మాట్లాడటం రాదని ఆమెని ఎలిమినేట్‌ చేస్తున్నట్టు చాలా మందిచెప్పగా, ఆ తర్వాత ఆమెకి సపోర్ట్ గా చాలా మంది కంటెస్టెంట్లు రంగంలోకి దిగారు. తనకు ఇంత మంది సపోర్ట్ చేయడంపై హ్యాపీ అవుతూ, షాలినిపై రెచ్చిపోయింది దేబ్జానీ. ఇది నా అసలైన సక్సెస్‌ అని ఆమె రియాక్ట్ కావడం విశేషం. మొత్తంగా ఈ రోజు ఎపిసోడ్‌లో దేబ్జానీ అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే షాలిని, ఝాన్సీ లు కూడా హైలైట్‌ అయ్యారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image2
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image3
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Related Stories
Recommended image1
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image2
Mahendragiri Varahi 4 Days Collections: సుమంత్‌ బాక్సాఫీసు రేంజ్‌ ఇదేనా.. మహేంద్రగిరి వారాహికి షాకింగ్‌ వసూళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved