MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Irumudi 27 Days Collections: థియేటర్లో రవితేజ మాస్‌ జాతర.. 27వ రోజూ ఇరుముడికి సంచలన వసూళ్లు.. ఇక ఓటీటీ వంతు

Irumudi 27 Days Collections: థియేటర్లో రవితేజ మాస్‌ జాతర.. 27వ రోజూ ఇరుముడికి సంచలన వసూళ్లు.. ఇక ఓటీటీ వంతు

మాస్‌ మహారాజా రవితేజ మాస్‌ జాతర థియేటర్లో ఇంకా కొనసాగుతుంది. ఆయన హీరోగా నటించిన `ఇరుముడి` మూవీ విడుదలై నెల రోజులకు దగ్గరగా వస్తున్నా, ఇంకా ఈ మూవీ థియేటర్లో దుమ్ములేపుతోంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 17 2026, 08:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ట్రోలర్స్ సమాధానం చెబుతూ రవితేజ స్ట్రాంగ్‌ బౌన్స్ బ్యాక్‌
Image Credit : Asianet News

ట్రోలర్స్ సమాధానం చెబుతూ రవితేజ స్ట్రాంగ్‌ బౌన్స్ బ్యాక్‌

రవితేజకి హిట్‌ పడి చాలా రోజులవుతుంది. ఈ క్రమంలో ఆయన హీరోగా కెరీర్‌పైనే విమర్శలు వచ్చాయి. మల్టీస్టారర్‌ చిత్రాలు చేయాలని, ఇక క్యారెక్టర్స్ చేయాల్సిందే అనే విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. కానీ తానేంటో మరోసారి నిరూపించారు రవితేజ. ఆయన `ఇరుముడి` చిత్రంలో హీరోగా నటించారు. అయితే ఇది రెగ్యూలర్‌ రవితేజ మార్క్ సినిమాలకు పూర్తి భిన్నమైన చిత్రం. తన మార్క్ డాన్సులు లేవు, పైట్లు లేవు, కామెడీ లేదు. పూర్తిగా డివైన్‌ అంశాలు, తండ్రీకూతుళ్ల బాండింగ్‌ని, అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలను, అమ్మాయిలను పెంచే విధానాన్ని బేస్‌ చేసుకొని దర్శకుడు శివ నిర్వాణ `ఇరుముడి` మూవీని రూపొందించారు. ఈ మూవీతో రవితేజ ట్రోల్స్ కి, విమర్శలకు బాక్సాఫీసు కలెక్షన్లతో సమాధానం చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నాల్గో వారంలోనూ ఇరుముడికి సంచలన వసూళ్లు
Image Credit : X/@MythriOfficial

నాల్గో వారంలోనూ ఇరుముడికి సంచలన వసూళ్లు

ఈ చిత్రంలో ప్రియా భవాని శంకర్‌ హీరోయిన్‌గా నటించింది. సాయికుమార్‌, అజయ్‌ ఘోష్‌, బేబీ నక్షత్ర, రమేష్‌ ఇందిరా, కొమురం, లక్ష్మణ్‌, స్వసిక విజయ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. గత నెల 21న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. అదిరిపోయే వసూళ్లని రాబడుతోంది. ఓపెనింగ్స్ రెగ్యూలర్‌గానే ఉన్నా, ఆ తర్వాత మాత్రం పుంజుకుంది. మొదటి రెండు వారాల్లో ఊహించని వసూళ్లని రాబట్టింది. ఇక ఇప్పుడు నాల్గో వారంలోనూ ఈ సినిమా జోరు తగ్గడం లేదు. మొన్న వారం వచ్చిన సినిమాలు కనీం కోటి రూపాయలుచేయలేని పరిస్థితుల్లో ఉండగా, ఇప్పటికీ `ఇరుముడి` రోజుకి కోటికిపైగా వసూళ్లని రాబట్టడం విశేషం.

34
ఇరుముడి మూవీ 27 రోజుల కలెక్షన్లు
Image Credit : Asianet News

ఇరుముడి మూవీ 27 రోజుల కలెక్షన్లు

`ఇరుముడి` మూవీ 27వ రోజు రూ.1.10కోట్లు రాబట్టింది. 96లక్షల నెట్‌ని రాబట్టగా, సుమారు అరవై లక్షల షేర్‌ని సాధించడం విశేషం. ఈ చిత్రానికి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.237.55కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో ఇది రూ.22.45కోట్లు, ఇండియాలో రూ.215కోట్లు రాబట్టింది. ఇది రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. అదే సమయంలో టాలీవుడ్‌లోనే అత్యధిక లాభాలను తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలవడం విశేషం. ఈ మూవీకి సుమారు రూ.120కోట్ల షేర్‌ వచ్చింది. అంటే వంద కోట్ల వరకు లాభాలు వచ్చాయి. అటు నిర్మాతలు, ఇటు బయ్యర్ల పంట పండింది. ఏడాదికి సరిపడ లాభాలు ఈ ఒక్క మూవీతో రావడం విశేషం.

44
ఫ్యామిలీ ఆడియెన్స్ కి గుడ్‌న్యూస్‌.. ఓటీటీలోకి ఇరుముడి
Image Credit : X

ఫ్యామిలీ ఆడియెన్స్ కి గుడ్‌న్యూస్‌.. ఓటీటీలోకి ఇరుముడి

ఈ మూవీకి సుమారు రూ.40కోట్ల బడ్జెట్‌ అయ్యింది. 20కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగింది. ఓటీటీ రైట్స్ రూపంలో గట్టిగానే వచ్చింది. ఇక ఈసినిమా ద్వారా రవితేజకి ఏకంగా రూ.50-60కోట్ల వరకు పారితోషికం అందిందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ మూవీ థియేట్రికల్‌గా క్లోజ్‌ కాబోతుంది. ఈ రోజు(సెప్టెంబర్‌ 18) అర్థరాత్రి నుంచి ఓటీటీలోకి రాబోతుంది. నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కానుంది. దీంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కిది గుడ్‌ న్యూస్‌గా చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Related Stories
Recommended image1
Maremma Day 5 Collections: రవితేజ తమ్ముడి కొడుకు సినిమాకి టీ ఖర్చులు కూడా రాలేదా.. మారెమ్మ 5 రోజుల వసూళ్లు
Recommended image2
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved