MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Moral Story: నా కన్నా గొప్ప ఎవరూ లేరు అనుకుంటే.. చివరకు జరిగేది ఇదే.. కళ్లు తెరిపించే కథ ఇది..!

Moral Story: నా కన్నా గొప్ప ఎవరూ లేరు అనుకుంటే.. చివరకు జరిగేది ఇదే.. కళ్లు తెరిపించే కథ ఇది..!

Moral Story: ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కానీ, చాలా మంది అందరి కంటే తామే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు. అలా అనుకోవడమే కాదు.. ఇతరులను తక్కువ చేసి చూస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలిపే కథ ఇది.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 18 2026, 02:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నేనే గొప్ప అనుకుంటే..
Image Credit : gemini ai

నేనే గొప్ప అనుకుంటే..

లోకంలో "నాకంటే బలవంతుడు లేడు", ‘ నా కంటే టాలెంటెడ్ ఎవరూ లేరు’ అనే అహంకారం మనిషిని లేదా ఏ ప్రాణినైనా పతనానికి నడిపిస్తుంది. రూపంలో చిన్నగా ఉన్నారని ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే శరీర పరిమాణం కంటే 'ఐక్యమత్యం', 'ఆత్మవిశ్వాసం' చాలా శక్తివంతమైనవి. ఈ గొప్ప సత్యాన్ని నిరూపిస్తూ, అహంకారంతో ఉన్న ఏనుగుల గుంపుకు చిన్న చీమలు బుద్ధి చెప్పిన అద్భుతమైన కథ ఇది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అహంకారం.. ఆత్మాభిమానం:
Image Credit : gemini ai

అహంకారం.. ఆత్మాభిమానం:

అది ఒక దట్టమైన అడవి. ఒకరోజు ఏనుగుల గుంపు దాహంతో నీళ్లు తాగడానికి వాగు వైపు వెళ్తుండగా, దారిలో చీమలన్నీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఏనుగులు ఆ చీమలను చూసినా, అసలు లెక్కచేయకుండా గర్వంతో వాటిపై నుంచి తొక్కుకుంటూ వెళ్ళిపోవడంతో కొన్ని చీమలు చనిపోగా, మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. నీళ్లు తాగి తిరిగి వస్తున్న ఏనుగులకు ధైర్యంగా ఎదురునిలిచిన చీమలు, తమలాంటి చిన్న ప్రాణులపై బలాన్ని చూపించడం తగదని నిలదీశాయి. కానీ ఏనుగులు మాత్రం తమకే సలహాలు ఇచ్చేంత గొప్పవారా అంటూ మితిమీరిన అహంకారంతో చీమలను ఈసడించుకున్నాయి.

చిన్న చీమల ఐక్యపోరాటం:

ఏనుగుల అహంకారానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్న చీమలన్నీ ఒక్కటయి, గుంపుగా ఏనుగులపైకి దాడి చేశాయి. ఏనుగుల చెవుల్లోకి, కళ్లలోకి దూరి తీవ్రంగా కుట్టడం మొదలుపెట్టగా, ఆ నొప్పులు తట్టుకోలేక కళ్లు మూతపడిన కొన్ని ఏనుగులు కొండపై నుంచి కిందపడి మరణించగా, మరికొన్ని చెట్లను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాయి. చిన్న చీమలే కదా అని తేలికగా తీసిపారేసిన ఏనుగులకు చివరికి ఘోర పరాభవం ఎదురైంది.

33
మన జీవితానికి ఈ కథ ఇచ్చే సందేశం:
Image Credit : Asianet News

మన జీవితానికి ఈ కథ ఇచ్చే సందేశం:

ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, రూపంలో చిన్నగా ఉన్నంత మాత్రాన ఎవరినీ బలహీనులు అని తక్కువ అంచనా వేయకూడదు. అధికారం, బలం లేదా ధనం ఉందనే అహంకారంతో ఇతరులను తొక్కిపడేయాలని చూస్తే చివరికి ఏనుగుల లాగే పతనం తప్పదు. అలాగే ఎంత పెద్ద సమస్యలనైనా, ఎంతటి బలవంతులనైనా ఐకమత్యంతో ఎదుర్కొంటే విజయం సాధించవచ్చు. బలహీనులు సహనంతో ఉన్నంత మాత్రాన చేతకానివారు అనుకోకూడదు, తిరగబడితే చిన్న చీమ కూడా మహావృక్షం లాంటి ఏనుగును పడగొట్టగలదని గుర్తుంచుకోవాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
నీతి కథలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Family Travel: జస్ట్ రూ.500తో ఫ్యామిలీ ట్రిప్..ఎలా ప్లాన్ చేయాలంటే..?
Recommended image2
9 రోజులు.. కానీ 8 నైవేద్యాలే.. బతుకమ్మ వేడుకల్లో ఒక రోజు నైవేద్యం ఎందుకు ఉండదో తెలుసా?
Recommended image3
Chapati Dough: చేతితో కలపకుండా కేవలం నిమిషంలో చపాతీ పిండి కలిపే బెస్ట్ ట్రిక్ ఇది..!
Related Stories
Recommended image1
Motivational Story: సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు, కావాల్సింది ఇదే, ప్రతి ఒక్కరూ చదవాల్సిన కథ ఇది..!
Recommended image2
Moral Story: కర్మ ఈజ్ బూమరాంగ్.. పక్కవారిపై నింద వేసి సంతోషపడుతున్నారా? మీ కళ్లు తెరిపించే కథ ఇది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved