MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Silver Foil: సిల్వర్ ఫాయిల్ వెజిటేరియనేనా? FSSAI ఏం చెబుతోంది?

Silver Foil: సిల్వర్ ఫాయిల్ వెజిటేరియనేనా? FSSAI ఏం చెబుతోంది?

Silver Foil: స్వీట్సు తినడానికే కాదు...చూడ్డానికి కూడా టెంప్టింగ్ గా కనిపిస్తాయి. అవి అలా కనిపించడానికి రీజన్..వాటి మీద వేసే సిల్వర్ ఫాయిల్. చూడగానే మెరిసిపోతుంటుంది. కానీ మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా..ఈ సిల్వర్ ఫాయిల్ వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా?

2 Min read
Author : Nandini Arava
Published : Sep 18 2026, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సిల్వర్ వర్క్ వెజిటేరియనా?
Image Credit : gemini ai

సిల్వర్ వర్క్ వెజిటేరియనా?

పండుగైనా, ఫంక్షన్ అయినా, ఇంటికి స్వీట్లు వచ్చినా.. సిల్వర్ ఫాయిల్ తో మెరిసిపోయే స్వీట్స్ కనిపిస్తే లాగించేస్తాం. కానీ ఆ స్వీట్‌పై కనిపించే మెరిసే వెండి రేకు విషయంలో చాలాకాలంగా ఒక సందేహం ఉంది. అసలు ఈ సిల్వర్ వర్క్ వెజిటేరియనా? లేక ఇందులో జంతు పదార్థాలు కూడా ఉంటాయా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సిల్వర్ ఫాయిల్ ను 'చాందీ కా వర్క్' అని పిలుస్తారు
Image Credit : Istock

సిల్వర్ ఫాయిల్ ను 'చాందీ కా వర్క్' అని పిలుస్తారు

సిల్వర్ ఫాయిల్‍ను మన దేశంలో ‘చాందీ కా వర్క్’ అని పిలుస్తారు. స్వీట్లపై వేసే ఈ రేకు చాలా పలుచగా ఉంటుంది. రుచి, వాసన ఉండవు. స్వీట్‌కు కేవలం అందమైన మెరుపును మాత్రమే ఇస్తుంది. అయితే ఈ వెండి రేకు తయారయ్యే విధానం కారణంగానే ఇంతకాలం శాకాహారుల్లో అనుమానాలు ఉన్నాయి.

గతంలో సిల్వర్ ఫాయిల్ తయారు చేయడం అంత ఈజీ కాదు. స్వచ్ఛమైన వెండిని తీసుకుని.. దాన్ని పలుచటి రేకుగా మార్చేందుకు పలు పొరల మధ్య ఉంచి గంటల తరబడి బలంగా కొట్టేవారు. ఈ ప్రక్రియలో వెండి రేకులు అంటుకోకుండా ఉండేందుకు కొన్ని సంప్రదాయ పద్ధతుల్లో జంతు కణజాలాన్ని ఉపయోగించేవారట.

35
జంతు పదార్థాలు ఉపయోగించేవారంట..
Image Credit : Youtube

జంతు పదార్థాలు ఉపయోగించేవారంట..

అంటే.. మనం స్వీట్‌పై చూస్తున్నది వెండే అయినా.. దాన్ని తయారు చేసే ప్రక్రియలో జంతు పదార్థాలు ఉపయోగించేవారన్నమాట. ఈ విషయం బయటకు రావడంతోనే శాకాహారులు సిల్వర్ వర్క్ ఉన్న స్వీట్ల విషయంలో జాగ్రత్త పడటం మొదలుపెట్టారు. ముఖ్యంగా పండుగల సమయంలో పూర్తిగా వెజ్ తినే కుటుంబాల్లో ఇది పెద్ద సందేహంగా మారింది.

45
FSSAI ఏం చెబుతోంది?
Image Credit : istock

FSSAI ఏం చెబుతోంది?

అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. 2016లో FSSAI తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం సిల్వర్ లీఫ్ తయారీలో జంతు మూలాల నుంచి వచ్చే పదార్థాలను ఉపయోగించకూడదని, తయారీ ప్రక్రియలోనూ జంతు కణజాలం ఉండకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

55
మార్కెట్లో అడిగి తెలుసుకోండి
Image Credit : gemini ai

మార్కెట్లో అడిగి తెలుసుకోండి

సిల్వర్ ఫాయిల్ పేరుతో నాణ్యత లేని ఇతర పదార్థాలు ఉపయోగించకుండా ఉండేందుకు కూడా రూల్స్ ఉన్నాయి. టెక్నాలజీ మారడం వల్ల సిల్వర్ ఫాయిల్ తయారీ విధానం కూడా మారిపోయింది. ఇప్పుడు యంత్రాల సాయంతో వెండిని అత్యంత పలుచటి రేకులుగా తయారు చేస్తున్నారు. జంతు పదార్థాలకు బదులుగా ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగిస్తున్నారు.

అయితే ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. FSSAI నిబంధనలు ఉన్నాయనే కారణంతో మార్కెట్‌లో దొరికే ప్రతి సిల్వర్ ఫాయిల్ మంచిదని కాదు. ప్యాకేజ్డ్ స్వీట్లు కొనుగోలు చేసేటప్పుడు లేబుల్‌పై ఉన్న వివరాలను పరిశీలించడం మంచిది. స్వీట్ షాపుల్లో కొనుగోలు చేస్తే సిల్వర్ ఫాయిల్ గురించి అడిగి తెలుసుకోవచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bird’s Paradise Lake: ప్రపంచంలో ఎన్నో సరస్సులు ఉన్నా కొల్లేరు మాత్రం చాలా ప్రత్యేకం.. ఎందుకంటే?
Recommended image2
Guava Capital: దేశంలోనే జామపండ్లకు స్పెషల్ సిటీ.. కేరాఫ్ అడ్రస్‌ ఎక్కడో తెలుసా?
Recommended image3
Vegetable Prices : కిలో బెండకాయలు రూ.1000..! యూకేలో ఏ కూరగాయ ధర ఎంతుంటుందో తెలుసా?
Related Stories
Recommended image1
Aloo Paratha: డాబాస్టైల్ ఆలూ పరాటా...స్టఫింగ్ బయటకు రాకూడదంటే ఈ టిప్ ట్రై చేయండి
Recommended image2
Car Warranty Rules: కారు కొన్న వెంటనే ఇది చేస్తే వారంటీ పనికిరాదు..ఇది తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved