MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Snakes : రాగి పాత్రలు కనిపిస్తే చాలు పాములు పరిగెత్తుకొస్తాయా? ఎందుకో చెప్పిన సద్గురు

Snakes : రాగి పాత్రలు కనిపిస్తే చాలు పాములు పరిగెత్తుకొస్తాయా? ఎందుకో చెప్పిన సద్గురు

Why cobras like copper : దేవుడి పూజలకు, నీళ్లు తాగడానికి మనం రాగి పాత్రలు వాడటం కామనే. కానీ ఎవరూ లేని చోట ఒక రాగి పళ్ళెం పెడితే చాలు.. నాగుపాములు వాటంతట అవే వచ్చి అక్కడ చుట్టుకుని పడుకుంటాయి. ఈ ఆసక్తికరమైన విషయం మీకు తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 18 2026, 02:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సద్గురు జగ్గీ వాసుదేవ్ చెప్పిన నిజాలు
Image Credit : Gemini AI

సద్గురు జగ్గీ వాసుదేవ్ చెప్పిన నిజాలు

మన సనాతన సంప్రదాయం, ఆధ్యాత్మిక సాధనలో 'రాగి' లోహానికి చాలా పవిత్రమైన స్థానం ఉంది. ఇందులో నీళ్లు తాగడం చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు… ఇది పూర్వీకుల నుండి వచ్చిన అలవాటు. ఇక పూజా కార్యక్రమాల్లో రాగి పాత్రలనే ఎక్కువగా వాడుతుంటారు.

అయితే ఈ రాగికి, నాగుపాములకు మధ్య నమ్మశక్యం కాని ఒక లింక్ ఉందనే విషయం చాలామందికి తెలియదు. రాగి పాత్రలు ఉన్న చోటికి నాగుపాములు ఆకర్షింపబడతాయట…. అందుకే చాలాసార్లు దేవాలయాలు, దేవుడి గదుల్లో పాములు కనిపిస్తాయని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ చెబుతున్నారు. ఇంతకీ పాములు రాగి పాత్రలకు ఎందుకు అట్రాక్ట్ అవుతాయో కూడా ఆయన వివరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆధ్యాత్మిక సాధకులకు రాగి ఎందుకు ముఖ్యం?
Image Credit : ChatGPT

ఆధ్యాత్మిక సాధకులకు రాగి ఎందుకు ముఖ్యం?

సద్గురు చెప్పిన దాని ప్రకారం.. లోహాలు ప్రాణశక్తితో ఒక్కోలా స్పందిస్తాయి. రాగి కేవలం విద్యుత్‌ను మాత్రమే కాదు, మనిషిలోని 'ప్రాణశక్తి'కి కూడా చాలా సున్నితంగా స్పందిస్తుంది. దానికి ఆ అద్భుతమైన శక్తి ఉంది. అందుకే ప్రాచీనకాలం నుంచి ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్లు రాగిని ప్రధాన లోహంగా వాడుతున్నారు. మన రుషులు కూడా రాగి చెంబులో ఎప్పుడూ నీటిని వెంటపెట్టుకునేవారు… అందులోని నీరు చాలా పవర్ ఫుల్ అని పురాణ కథలు చెబుతున్నాయి.

35
రాగి పాత్ర ఉన్నచోటికి నాగుపాములు ఎందుకొస్తాయి?
Image Credit : ChatGPT

రాగి పాత్ర ఉన్నచోటికి నాగుపాములు ఎందుకొస్తాయి?

జనాలు తిరగని ఒక నిర్మానుష్య ప్రదేశంలో లేదా తోట మూలన ఒక రాగి పాత్ర లేదా పళ్ళెం పెట్టి చూడండి. ఒకవేళ ఆ చుట్టుపక్కల నాగుపాము ఉంటే అది నేరుగా ఆ రాగి పాత్ర దగ్గరికి వచ్చి దానిలో చుట్టుకుని కూర్చుంటుంది. అడవిలో ఉండే పాముల్లో కూడా ఇది చాలా సహజంగా కనిపించే లక్షణం అని సద్గురు చెప్పారు.

45
పాములు పట్టే గిరిజనుల సీక్రెట్ ఇదే
Image Credit : ChatGPT

పాములు పట్టే గిరిజనుల సీక్రెట్ ఇదే

పాములు పట్టే గిరిజనులకు ఈ రహస్యం మొదటి నుంచీ బాగా తెలుసు. అడవుల్లో పాములను పట్టుకోవడానికి వాళ్లు కేవలం ఒక రాగి పళ్ళేన్ని నేల మీద పెడతారు. నాగుపాము దానంతట అదే వచ్చి ఆ రాగి పళ్ళెం మీద కూర్చుంటుంది. ఆ తర్వాత వాళ్లు పాముకు ఎలాంటి హాని చేయకుండా చాలా సులభంగా పట్టుకుంటారని ఆసక్తికర విషయాన్న వెల్లడించారు సద్గురు.

55
పాములకు, రాగి పాత్రకు ఉన్న సంబంధమేంటి?
Image Credit : ChatGPT

పాములకు, రాగి పాత్రకు ఉన్న సంబంధమేంటి?

నాగుపాము, రాగి.. ఈ రెండింటికీ ప్రకృతిలోని 'ప్రాణశక్తి తీవ్రత' కు చాలా సున్నితంగా స్పందించే గుణం ఉంది. ఒక వ్యక్తిలో లేదా ఒక ప్రదేశంలో ప్రాణశక్తి అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు, రాగి, పాములు సహజంగానే ఆ దిశగా ఆకర్షితమవుతాయి. అందుకే యోగా, ఆధ్యాత్మిక సాధనలో రాగి వాడకానికి, పాము సంకేతానికి అంత ప్రాముఖ్యత ఉందని సద్గురు వివరించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ancient Egypt: రాజులతోపాటు సేవకులనూ పాతిపెట్టేవారంట! ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?
Recommended image2
నదులు సముద్రంలో కలవకపోతే ఏమవుతుంది.? విపత్తు త‌ప్ప‌ద‌ని తెలుసా.?
Recommended image3
బ్రాయిల‌ర్ చికెన్ తింటే అమ్మాయిలు త్వ‌ర‌గా మెచ్యూర్ అవుతారా.? కోళ్ల‌కు నిజంగానే హార్మోన్స్ ఇస్తారా?
Related Stories
Recommended image1
Snakes : అడవిలో కంటే జనావాసాల్లో ఉండే పాములే ఎక్కువకాలం బ్రతుకుతాయట.. ఎందుకో తెలుసా?
Recommended image2
Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved