MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 50 లక్షల బడ్జెట్, 120 కోట్ల కలెక్షన్స్, సెన్సేషనల్ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

50 లక్షల బడ్జెట్, 120 కోట్ల కలెక్షన్స్, సెన్సేషనల్ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు ఎక్కువగా సత్తా చాటుతున్నాయి. కోట్లు కొల్ల గొడుతున్నాయి. 50 లక్షల బడ్జెట్ తో రూపొందిన ఓ మూవీ 120 కోట్లు కొల్లగొట్టింది. భారీ విజయాన్ని సాధించిన ఆ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఎప్పుడు ఎక్కడో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 03 2026, 09:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చిన్న సినిమా భారీ విజయం..
Image Credit : book my show

చిన్న సినిమా భారీ విజయం..

తక్కువ బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కించి భారీ వసూళ్లు సాధించడం ఈ మధ్య కాలంలో సాధారణంగా మారింది. ఎక్కువగా మలయాళ చిత్రసీమలో ఈ సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలయాళంతో పాటు పాటు తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలలో కూడా చిన్న సినిమాల హవా పెరిగిపోయింది. ఇక విచిత్రం ఏంటంటే.. ఈమధ్య కాలంలో గుజరాతీ సినిమా ఒకటి ఇలాంటి విజయన్నే సాధించింది. ఆ సినిమా ఏదో కాదు..లాలో కృష్ణ సదా సహాయతే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రికార్డు క్రియేట్ చేసిన గుజరాతీ సినిమా..
Image Credit : book my show

రికార్డు క్రియేట్ చేసిన గుజరాతీ సినిమా..

గుజరాతీలో రూపొందిన ఈ సినిమా క్రితం ఏడాది అక్టోబర్ 10వ తేదీన విడుదలైంది. రీవా రిచ్, శ్రుహాద్ గోస్వామి, కరణ్ జోషీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అంకిత్ సఖియా దర్శకత్వం వహించగా, స్మిత్ జె సంగీతాన్ని అందించారు. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల ఆదరణతో విశేష విజయాన్ని అందుకుంది.

34
50 లక్షలతో 120 కోట్లు కొల్లగొట్టింది?
Image Credit : book my show

50 లక్షలతో 120 కోట్లు కొల్లగొట్టింది?

కృష్ణ సదా సహాయతే' రికార్డు క్రియేట్ చేసింది. అంకిత్ సాకియా దర్శకత్వంలో వచ్చిన ఈ ఆధ్యాత్మిక సినిమాను కేవలం 50 లక్షల బడ్జెట్‌తో తీశారు. అక్టోబర్ 10న రిలీజ్ అయిన ఈ మూవీ నిర్మాతకు ఏకంగా 200 రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది.మొత్తం 120 కోట్ల రూపాయల వసూళ్లు సాధించడం విశేషంగా చెప్పుకోవచ్చు. గుజరాతీ ఫిల్మ్ ఇండస్ట్రీలో తొలిసారిగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమా ఇదే. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు లేకుండా, భారీ గ్రాఫిక్స్ లేకుండానే విజయాన్ని సాధించడం అద్బుతమనే చెప్పాలి.

44
ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
Image Credit : Twitter

ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

ఈ చిత్రం ఒక సాధారణ ఆటో డ్రైవర్ జీవితాన్ని ప్రధానంగా తీసుకుని తెరకెక్కించబడింది. కృష్ణుడి అనుగ్రహం కారణంగా అతని జీవితం ఎలా ప్రభావితమైందనే అంశం చుట్టూ కథ నడుస్తుంది. చాలా సింపుల్ స్టోరీకి ఎమోషనల్ ఎలిమెంట్స్ జోడించి.. అద్భుతమైన సినిమాను తెరకెక్కించారు.

 థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ పైకి వస్తుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ SonyLIV ఈ నెల 6వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nana Patekar Top 10 Movies: నానా పటేకర్‌ విశ్వరూపం చూపించే టాప్‌ 10 సినిమాలు.. అస్సలు మిస్‌ అవ్వద్దు
Recommended image2
Nana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే
Recommended image3
The Paradise 14 Days Collection: దారుణంగా పడిపోయిన ప్యారడైజ్‌, నానికి లాస్ట్ ఛాన్స్.. ఇంకా ఎంత రావాలంటే?
Related Stories
Recommended image1
విజయ్ రష్మిక కి అల్లు అర్జున్ అదిరిపోయే మ్యారేజ్ గిఫ్ట్, ఐకాన్ స్టార్ ఇవ్వబోయే సర్ ప్రైజ్ ఏంటో తెలుసా?
Recommended image2
మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలను పిచ్చిగా ఇష్టపడే ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకంతఇష్టమంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved