సూపర్ స్టార్ మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాను ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మిస్తుండడంతో సినిమా బడ్జెట్ కంట్రోల్ తప్పుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫారెన్ లో సినిమాను షూట్ చేయడం, భారీ షెడ్యూల్స్ కారణంగా ప్రొడక్షన్ కాస్ట్ అనుకున్న దానికంటే ఎక్కువగా అవుతుందని, ముగ్గురు నిర్మాతల్లో ఒకరికి అధికారం ఇవ్వకపోవడంతో అదుపు చేయడం వీలు కావడం లేదని అంటున్నారు.

గతంలో వంశీ పైడిపల్లి రూపొందించిన 'ఊపిరి' సినిమా కూడా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువగా అవ్వడంతో సినిమాకి హిట్ టాక్ వచ్చినా లాభాలు మాత్రం రాలేదు. ఈ విషయాన్ని నిర్మాత పీవీపీ స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు 'మహర్షి' సినిమాలో కూడా అదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్.

నిర్మాతలు సినిమాను లాభాలకు అమ్ముకున్నా.. బయ్యర్లు మాత్రం ఈ కారణంగా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక మహేష్ మార్కెట్ ని దృష్టిలో  పెట్టుకొని ఆ మేరకు ఖర్చు చేస్తే మంచిదనే అభిప్రాయలు వినిపిస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి.. 

'మహర్షి' లో సాయికుమార్, 'అతడు' ని గుర్తు చేసేలా...?

'మహర్షి' సినిమాతో రిస్క్ లో పడతారా..?

మహేష్ సినిమాలో బాలయ్య హీరోయిన్!

మహేష్ ‘మహర్షి’ కథ ఇదేనా?

మహేష్ బాబు ఐదు గెటప్పుల్లో..!

'మహర్షి' షూటింగ్ లో హాట్ బ్యూటీ మిస్!

టాక్ ఆఫ్ ది టౌన్: అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్షిప్... సీక్రెట్ ఇదే

మహేష్.. దిల్ రాజు మాట వినడం లేదా..?

మహర్షి: మహేష్ లుక్ మాములుగా లేదు.. చంపేసాడు!

తప్పులో కాలేసిన హీరో మహేష్ బాబు

మహర్షి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఛానెల్!

మహేష్ నిజంగానే మోసం చేస్తున్నాడు?