MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: ఇండస్ట్రీ హిట్ కొట్టాల్సిన చిరంజీవి మూవీ, 10 రోజుల తర్వాత కొలాప్స్.. కారణం ఎవరో తెలుసా ?

Chiranjeevi: ఇండస్ట్రీ హిట్ కొట్టాల్సిన చిరంజీవి మూవీ, 10 రోజుల తర్వాత కొలాప్స్.. కారణం ఎవరో తెలుసా ?

చిరంజీవి నటించిన ఓ మూవీ ఇండస్ట్రీ హిట్ అయ్యే రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండగా సడెన్ గా బ్రేకులు పడ్డాయి. కలెక్షన్స్ ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. దానికి కారణం మరో క్రేజీ హీరో సినిమా. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 05 2026, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో రికార్డ్ బ్రేకింగ్ సినిమాల్లో నటించారు. చిరంజీవికి రికార్డులు కొత్త కాదు. అదే విధంగా చిరంజీవి కెరీర్ లో ఫ్లాపులు కూడా ఉన్నాయి. టాలీవుడ్ లో అత్యధిక ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉన్న హీరో చిరంజీవే. అయితే కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్ రేంజ్ వరకు వెళ్లి ఆగిపోయాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి అన్నయ్య మూవీ
Image Credit : Youtube/Geetha Arts

చిరంజీవి అన్నయ్య మూవీ

చిరంజీవి నటించిన ఓ సూపర్ హిట్ మూవీ విషయంలో ఊహించని షాక్ తగిలింది. ఆ సినిమా మరేదో కాదు అన్నయ్య. చిరంజీవి వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య హిట్లర్ లాంటి సూపర్ హిట్ మూవీ ఇచ్చారు. ఆయనతోనే చిరంజీవి మరోసారి అన్నయ్య అనే సినిమా చేశారు. సౌందర్య ఈ మూవీ హీరోయిన్ గా నటించారు.

35
ఇండస్ట్రీ హిట్ అనుకున్నారు
Image Credit : Asianet News

ఇండస్ట్రీ హిట్ అనుకున్నారు

రవితేజ, వెంకట్ ఈ మూవీలో చిరంజీవి బ్రదర్స్ గా నటించారు. చిరంజీవి కామెడీ టైమింగ్, సౌందర్యతో కెమిస్ట్రీ, ఇద్దరి మధ్య వచ్చే సీన్లు, బ్రదర్ సెంటిమెంట్ ఈ సినిమాకి హైలైట్స్ అనే చెప్పాలి. మణిశర్మ అందించిన సంగీతం అదిరిపోయింది. జనవరి 4న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్స్ తో ఓపెన్ అయింది. వారం తర్వాత కూడా అన్నయ్య మూవీ జోరు తగ్గలేదు. దీనితో చిరంజీవి ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ ఖాయం అని అంతా అనుకున్నారు.

45
10 రోజుల తర్వాత కొలాప్స్
Image Credit : Asianet News

10 రోజుల తర్వాత కొలాప్స్

కానీ సరిగ్గా పది రోజుల తర్వాత సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ దిగాడు. వెంకటేష్, సిమ్రాన్ జంటగా నటించిన కలిసుందాం రా మూవీ అన్నయ్య విడుదలైన 10 రోజులకు విడుదలయింది. ఒక్కసారిగా వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తాన్ని తన వైపు లాగేసుకున్నాడు. దీనితో అన్నయ్య మూవీ కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.

55
కలిసుందాం రా ప్రభంజనం
Image Credit : Asianet News

కలిసుందాం రా ప్రభంజనం

అప్పటికే అన్నయ్య సూపర్ హిట్ అయినప్పటికీ కలిసుందాం రా వల్ల ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ కోల్పోయింది. కలిసుందాం రా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యువత కూడా ఆ సినిమాకి ఫిదా అయ్యారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Ravichander Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వార్తల వేళ.. అనిరుధ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
Recommended image2
Deva: 400 సినిమాలు.. ఇళయరాజా హవాకు ఎదురెళ్లి.. ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దేవా!
Recommended image3
Music Director Deva: తొలిప్రేమ, భాషా సినిమాల సంగీత దర్శకుడు దేవా కన్నుమూత..
Related Stories
Recommended image1
NTR: తల్లిదండ్రుల కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగం ఏంటో తెలుసా, అందుకే బాలయ్యకి అంత ఇష్టం
Recommended image2
Tollywood: మీడియం బడ్జెట్ సినిమాలతో బడా స్టార్లని తొక్కేశారు.. 100 కోట్ల లాభాలు తెచ్చిన ముగ్గురు హీరోలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved