Asianet News TeluguAsianet News Telugu

మహేష్ ‘మహర్షి’ కథ ఇదేనా?

గతంలో ఓ సినిమా స్టోరీ ఏంటి తెలియాలంటే రిలీజ్ అయ్యేదాకా ఆగాలి. ఇప్పుడు పరిస్దితి మారింది. ఓ ప్రక్క లీక్ లు మరో ప్రక్క ఊహాగానాలు అంటూ రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. ట్రైలర్ చూసి కథ చెప్పేసే స్దాయిలో జనం క్రియేటివిటీ పెరిగిపోయింది. 

is it mahesh's maharshi story line
Author
Hyderabad, First Published Nov 5, 2018, 12:27 PM IST

గతంలో ఓ సినిమా స్టోరీ ఏంటి తెలియాలంటే రిలీజ్ అయ్యేదాకా ఆగాలి. ఇప్పుడు పరిస్దితి మారింది. ఓ ప్రక్క లీక్ లు మరో ప్రక్క ఊహాగానాలు అంటూ రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. ట్రైలర్ చూసి కథ చెప్పేసే స్దాయిలో జనం క్రియేటివిటీ పెరిగిపోయింది. అంతెందుకు సినిమా లోగో చూస్తే చాలు. కథను కొంతవరకూ అంచనా వేస్తున్నారు.  చాలాసార్లు అసలు కథ కన్నా..ఈ కొసరు కథలే చాలా బాగుంటున్నాయి. చాలా వరకూ కరెక్ట్ అవుతున్నాయి..కనెక్ట్ అవుతున్నాయి కూడా. తాజాగా అదే పద్దతిలో ‘మహర్షి’ కథ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో తిరుగుతోంది. అదేంటో చూద్దాం. 

ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరక్షన్ లో  మహేష్‌బాబు చేస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం ఇప్పటికి విడుదలైన ప్రమోషన్ యాక్టివిటీస్ తో  ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏమైంటుందనే ఊహాగానాలు సైతం మొదలయ్యాయి. 
 
జనం చెప్పుకునే ఈ సినిమా కథ విషయానికి వస్తే… చదువుకోసం  అమెరికాకు వెళ్లిన మహేష్ ..అక్కడే సెటిల్ అవుతాడు. పెద్ద పారిశ్రామిక వేత్తగా ఎదుగుతాడు. అయితే తండ్రితో ఓ విషయంలో మాటా మాటా వచ్చి...ఓ రోజు  తన స్నేహితులు అల్లరి నరేష్, పూజ హెడ్గే లతో కలిసి ఇండియాలోని తన గ్రామానికి వస్తాడు. ఇక్కడకు వచ్చాక రైతులు కష్టాలు , వ్యవసాయానికి వారు ఉపయోగించే పద్దతులు,వాటి వలన పెద్దగా రాబడి రావటం లేదని గమనించి...చలించిపోతాడు. 

వ్యవసాయాన్ని కూడా కొత్త పద్దతుల్లో అధునాతనంగా చేస్తే లాభసరిగా మారుతుందని భావిస్తాడు. అదే చెప్పి చూస్తాడు. ఇక్కడెవరూ ఆ విషయం సీరియస్ గా తీసుకోడు. దాంతో తనే ఇక్కడ ఓ రైతుగా మారి తన తెలివితో యంత్రాలతో పనిచేయించి వ్యవసాయం లాభసాటిగా మారుస్తాడు. ముఖ్యంగా సేంద్రీయ విధానాలు, ఇతర ఆధునిక వ్యవసాయ పద్ధతుల పట్ల రైతులకు అవగాహన కల్పించి వారిని అభివృద్ధి దిశగా నడిపిస్తారని తెలిసింది. 

ఇప్పటికే ‘శ్రీమంతుడు’ సినిమాలో ఊరును దత్తత తీసుకోవడం, ‘భరత్ అనే నేను’ చిత్రంలో బాధ్యత, జవాబుదారీతనం కలిగి ఉండడం వంటి అంశాలను టచ్ చేశారు. ఇప్పుడు ఈ చిత్రంలో వ్యవసాయంలో కొత్త పద్దతులతో ముందుకెళ్లే ఈ కాలం కుర్రాడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. 

ఈ చిత్రంలో చిత్రంలో కీలకమైన కాలేజీ ఎపిసోడ్‌లను డెహ్రాడూన్‌లో, ఇండ్రస్టిలియస్ట్ గా మహేష్ కనిపించే ఎపిసోడ్‌లను అమెరికాలో షూట్ చేశారు. ఇక ముఖ్యమైన సెకండాఫ్ ఎమోషనల్ సీన్లు అన్నింటినీ గ్రామీణ నేపథ్యంలో షూట్ చేయాల్సి ఉంది. దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి.. 

మహేష్ బాబు ఐదు గెటప్పుల్లో..!

'మహర్షి' షూటింగ్ లో హాట్ బ్యూటీ మిస్!

టాక్ ఆఫ్ ది టౌన్: అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్షిప్... సీక్రెట్ ఇదే

మహేష్.. దిల్ రాజు మాట వినడం లేదా..?

మహర్షి: మహేష్ లుక్ మాములుగా లేదు.. చంపేసాడు!

తప్పులో కాలేసిన హీరో మహేష్ బాబు

మహర్షి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఛానెల్!

మహేష్ నిజంగానే మోసం చేస్తున్నాడు?

Follow Us:
Download App:
  • android
  • ios