సూపర్ స్టార్ మహేష్ బాబుని మోస్ట్ చార్మింగ్ హీరో ఆఫ్ టాలీవుడ్ అని అంటుంటారు. అంతగా తన లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అయితే తన లుక్, గెటప్ విషయంలో మహేష్ బాబు ఎప్పుడూ ప్రయోగాలు చేయలేదు. కానీ తన 25వ సినిమా 'మహర్షి' కోసం సరికొత్త లుక్ తో కనిపించనున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ లో గడ్డం, మీసంతో మహేష్ బాబు అందంగా కనిపించాడు. రీసెంట్ గా లీక్ అయిన కొన్ని ఫోటోలలో సూట్ వేసుకొని హ్యాండ్సమ్ గా కనిపించాడు. కేవలం ఈ రెండు గెటప్స్ మాత్రమే కాకుండా సినిమాలో మొత్తం ఐదు గెటప్పులో కనిపించనున్నాడట మహేష్.

అయితే ఇది కేవలం మహేష్ లుక్స్ మీద దృష్టి పెట్టడానికి అన్నట్లుగా కాకుండా కథలో భాగంగా ఉంటుందట. హీరోస్టూడెంట్ లైఫ్ నుండి కార్పోరేట్ కంపనీ యజమానిగా ఎదిగే క్రమంలో మహేష్ ని ఐదు సరికొత్త లుక్స్ తో చూపించబోతున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ లో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని ఫిబ్రవరి నుండి మొదలుపెట్టనున్నారు. అప్పుడే మహేష్ లుక్స్ ని ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నట్లు సమాచారం.

దర్శకుడు వంశీ పైడిపల్లి.. మహేష్ ఫ్యాన్స్ కి అన్ని రకాల ఈ సినిమా నచ్చే విధంగా తీర్చిదిద్దుతున్నాదట. ఈ సినిమా మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. ఇటీవలే ఈ సినిమా అమెరికాలో మేజర్ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. త్వరలోనే హైదరాబాద్ లో మరో షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

'మహర్షి' షూటింగ్ లో హాట్ బ్యూటీ మిస్!

టాక్ ఆఫ్ ది టౌన్: అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్షిప్... సీక్రెట్ ఇదే

మహేష్.. దిల్ రాజు మాట వినడం లేదా..?

మహర్షి: మహేష్ లుక్ మాములుగా లేదు.. చంపేసాడు!

తప్పులో కాలేసిన హీరో మహేష్ బాబు

మహర్షి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఛానెల్!

మహేష్ నిజంగానే మోసం చేస్తున్నాడు?