MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?

Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది. అఫ్గానిస్తాన్‌తో జరగబోయే T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా దూరమయ్యారు. అతని స్థానంలో నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కింది. పాండ్యాను జట్టులోకి ఎందుకు తీసుకోలేదు?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 02 2026, 11:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హార్దిక్ పాండ్యా అభిమానులకు బ్యాడ్ న్యూస్
Image Credit : Asianet News

హార్దిక్ పాండ్యా అభిమానులకు బ్యాడ్ న్యూస్

భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు మళ్ళీ ఎదురుదెబ్బ తగిలింది. అఫ్గానిస్తాన్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల T20I సిరీస్ నుంచి అతను దూరమయ్యాడు. పునరావాసంలో ఉన్న సమయంలో కాలి నొప్పి మళ్లీ తిరగబెట్టడమే దీనికి ప్రధాన కారణం. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో అతను తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మళ్లీ సమస్య ముందుకు వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఏం జరిగింది?
Image Credit : Getty

బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఏం జరిగింది?

హార్దిక్ పాండ్యా భారత టీ20 జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని భావించాడు. అందుకోసం బెంగళూరులోని CoE లో కఠిన శిక్షణ తీసుకున్నాడు. మొదట్లో ఎలాంటి అసౌకర్యం లేకుండా బౌలింగ్ పూర్తి స్థాయిలో చేశాడు.

అయితే, ఉన్నట్టుండి కాలి భాగంలో అసౌకర్యం కలగడంతో బౌలింగ్ చేయవద్దని వైద్యులు సూచించారు. వచ్చే సెప్టెంబర్ 13 నుంచి న్యూఢిల్లీలో అఫ్గానిస్తాన్‌తో సిరీస్ ప్రారంభం కానుంది. ఈ తక్కువ సమయంలో పూర్తి ఫిట్‌నెస్ సాధించడం సాధ్యం కాదని వైద్య బృందం స్పష్టం చేసింది.

35
వైద్య బృందం ప్రకటన.. హార్దిక్ ప్రస్తుత పరిస్థితి ఇదే
Image Credit : x@bcci

వైద్య బృందం ప్రకటన.. హార్దిక్ ప్రస్తుత పరిస్థితి ఇదే

హార్దిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేశాడు. కానీ కాలి నొప్పి కారణంగా బౌలింగ్ ఆపాలని సూచించాం. బ్యాటింగ్, మూవ్‌మెంట్‌లో ఎలాంటి పెద్ద సమస్యలు లేవు" అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. CoE మెడికల్ టీమ్ పూర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు హార్దిక్ రీఎంట్రీ సాధ్యం కాదు. త్వరలోనే అతను మళ్ళీ బౌలింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.

45
చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా హార్దిక్
Image Credit : BCCI\Twitter

చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా హార్దిక్

మే 24న ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ మ్యాచ్ ఆడిన తర్వాత హార్దిక్ మళ్ళీ పోటీ క్రికెట్ ఆడలేదు. అంతర్జాతీయ స్థాయిలో చివరిసారిగా మార్చి 8న జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ తరఫున కనిపించాడు. అప్పటి నుంచి అఫ్గానిస్తాన్ హోమ్ సిరీస్, ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు దూరమయ్యాడు. ఇప్పుడు వచ్చిన ఈ కొత్త గాయం వల్ల అతని అంతర్జాతీయ రీఎంట్రీ మరింత ఆలస్యం కానుంది.

55
తెలుగు ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం
Image Credit : Getty

తెలుగు ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం

హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడంతో తెలుగు ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జట్టు పరిస్థితులు ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్‌కు సహకరిస్తే, నితీష్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వాషింగ్టన్ సుందర్ కూడా ఎంపికయ్యాడు. అయితే అతని లభ్యత కూడా ఫిట్‌నెస్‌పైనే ఆధారపడి ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమ్ ఇండియా ఈ సిరీస్ ఆడనుంది.

అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు భారత జట్టు:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Recommended image2
రాంచీలో ర‌ఫ్ఫాడించిన షాయ్ హోప్.. టీమిండియాపై వెస్టిండిస్‌ సంచ‌ల‌న విజ‌యం
Recommended image3
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Related Stories
Recommended image1
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image2
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved