MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Irumudi Day 12 Collections: బాక్సాఫీసు వద్ద రవితేజ రేంజ్‌ ఏంటో చూపించిన ఇరుముడి.. హైయ్యెస్ట్ ప్రాఫిట్స్

Irumudi Day 12 Collections: బాక్సాఫీసు వద్ద రవితేజ రేంజ్‌ ఏంటో చూపించిన ఇరుముడి.. హైయ్యెస్ట్ ప్రాఫిట్స్

Irumudi Day 12 Collections: మాస్‌ మహారాజా రవితేజ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్నాడు. మూడో వారంలో కూడా ఆయన నటించిన `ఇరుముడి` మూవీ అదిరిపోయే వసూళ్లని రాబట్టడం విశేషం. మంగళవారం కూడా అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 02 2026, 08:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రవితేజ బాక్సాఫీసు రేంజ్‌ ఏంటో చూపిస్తోన్న `ఇరుముడి`
Image Credit : Asianet News

రవితేజ బాక్సాఫీసు రేంజ్‌ ఏంటో చూపిస్తోన్న `ఇరుముడి`

రవితేజకి సరైన హిట్‌ పడితే ఎలా ఉంటుందో నిరూపించింది `ఇరుముడి` మూవీ. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ గత నెల 21న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ప్రియా భవాని శంకర్‌ హీరోయిన్‌గా నటించగా, బేబీ నక్షత్ర, అజయ్‌ ఘోష్‌, సాయికుమార్‌, రమేష్ ఇందిరా, స్వసిక విజయ్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. అయ్యప్ప భక్తుల కథతో, తండ్రీకూతుళ్ల బాండింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు నుంచి పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. అయ్యప్ప భక్తుల కథ, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌ ఉన్న నేపథ్యంలో ఈ మూవీని చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. దీంతో ఇప్పటికీ దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇరుముడి మూవీ 12 రోజుల కలెక్షన్లు
Image Credit : Asianet News

ఇరుముడి మూవీ 12 రోజుల కలెక్షన్లు

`ఇరుముడి` మూవీ రవితేజకి అదిరిపోయే విజయాన్ని అందించారు. ఆయనకు సరైన హిట్‌ పడితే బాక్సాఫీసు వద్ద రచ్చ ఎలా ఉంటుందో ఈ మూవీ చూపిస్తోంది. ఇది ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ దాటి లాభాల్లోకి వెళ్లింది. వీకెండ్‌లోనే కాదు వీక్‌ డేస్‌లోనూ ఊహించని వసూళ్లని రాబట్టడం విశేషం. మంగళవారం(12వ రోజు) కూడా బాక్సాఫీసు వద్ద రవితేజ దుమ్ములేపాడు. ఈ చిత్రానికి ఇండియాలో రూ.5.90కోట్ల నెట్‌ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్‌లో యాభై లక్షలు రాబట్టింది. మొత్తంగా 12 రోజుల్లో ఈ మూవీ రూ.186.50కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. అయితే ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద సాలిడ్‌గా రన్‌ కావడం మరో విశేషం.

33
ఇరుముడికి లాభాల పంట
Image Credit : X

ఇరుముడికి లాభాల పంట

ఓ వైపు టాక్సిక్‌ మూవీ థియేటర్లో ఆడుతోంది. అంతో ఇంతో సందడి చేస్తోంది. ఆ పోటీని తట్టుకొని కూడా ఈ చిత్రానికి ఇంతటి భారీ వసూళ్లు రావడం విశేషంగా చెప్పొచ్చు. అయితే ఈ మూవీకి అయిన బడ్జెట్‌ రూ.40కోట్లు. థియేట్రికల్‌గా అయిన బిజినెస్‌ రూ.20 కోట్లు. రూ.21కోట్ల బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్ తో విడుదలైన ఈ మూవీ రెండు రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. మూడో రోజుతోనే లాభాల్లోకి వెళ్లింది. నిర్మాతలకు ఊహించని లాభాలు తీసుకొస్తుంది. బయ్యర్ల పంట పండిందని చెప్పొచ్చు. ఇప్పటికే సుమారు రూ. రూ.74కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. ఇంకా ఎంత వరకు వెళ్తుందనే చెప్పలేం. ఈజీగా రెండు వందల కోట్లు దాటుతుందని చెప్పొచ్చు. ఇది రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవబోతుంది. అదే సమయంలో ఈ ఏడాది విడుదలైన మూవీస్‌లో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టే మూవీగానూ నిలుస్తుందని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nushrratt Bharuccha: బెల్లంకొండ శ్రీనివాస్ హీరోయిన్ వెన్నెముకకు గాయం..క్రేజీ హీరో మూవీ షూటింగ్ లో ప్రమాదం
Recommended image2
Kajal Aggarwal: రైతులంతా నేరస్థులే అంటూ కోర్టులో కాజల్ రచ్చ.. సంచలన పాయింట్ తో తెరకెక్కించిన మూవీ ఓటీటీలోకి
Recommended image3
Chiranjeevi: చిరంజీవిని ఢీ కొట్టేందుకు ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి వచ్చారు.. అయినా లాభం లేదు, ఆ రోజు పెద్ద రచ్చ
Related Stories
Recommended image1
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image2
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved