MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?

Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?

సుమంత్‌ ప్రభాస్, అనంతిక శనిల్‌ కుమార్‌ జంటగా నటించిన మూవీ `రోమాంచకం`. సందీప్‌ రెడ్డి వంగా, ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మించిన ఈ మూవీ నవ్వించడంలో సక్సెస్‌ అయ్యిందా?

4 Min read
Author : Aithagoni Raju
Published : Sep 03 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రోమాంచకం మూవీ రివ్యూ
Image Credit : X/@VangaPictures

రోమాంచకం మూవీ రివ్యూ

సందీప్‌ రెడ్డి వంగా ఓ వైపు ప్రభాస్‌తో `స్పిరిట్‌` మూవీని రూపొందిస్తున్నారు. తన భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌లోనే ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఓ వైపు భారీ పాన్‌ ఇండియా మూవీ చేస్తూనే మరోవైపు చిన్న సినిమాని నిర్మించారు. అదే `రోమాంచకం` మూవీ. దీనికి ఆయన సమర్పకులుగా వ్యవహరిస్తుండగా, ఆయన అన్న ప్రణయ్‌ రెడ్డి నిర్మించారు. వేణుగోపాల్‌ రెడ్డి దర్శకుడు. సుమంత్‌ ప్రభాస్‌, అనంతిక శనిల్‌ కుమార్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇందులో నరేంద్ర, మణి, ఉపేంద్ర వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం నేడు గురువారం(సెప్టెంబర్‌ 3)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? సుమంత్‌ ప్రభాస్‌కి హిట్‌ పడిందా ? సందీప్‌ రెడ్డి వంగా బ్రదర్స్ నిర్మాతలుగా సక్సెస్‌ అయ్యారా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రోమాంచకం మూవీ కథ
Image Credit : X/@VangaPictures

రోమాంచకం మూవీ కథ

అన్వేష్‌(సుమంత్‌ ప్రభాస్‌).. సరికొత్త డేటింగ్‌ యాప్‌ క్రియేట్‌ చేసి అమ్మాయిలను, అబ్బాయిలను కలిపేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ ప్రారంభంలోనే తనని ఎవరూ పట్టించుకోరు, ఇంట్లో కూడా మనోడి టాలెంట్ ని నమ్మరు. ఫ్రెండ్స్ కామెడీ చేస్తుంటారు. ఈ క్రమంలో డేటింగ్‌ యాప్‌ ద్వారానే చెన్నై పిల్లని పటాయిస్తాడు. ఆమె పేరు మైథిలి(అనంతిక శనిల్‌ కుమార్‌). కానీ ఆమె అనేక రకాల టెస్ట్ లు పెడుతుంది. వాటిలో మనోడు పాస్‌ అవుతాడు. నెమ్మదిగా ఫ్రెండ్స్ అయి ఆ తర్వాత ప్రేమలోకి వెళ్లిపోతారు. మైథిలి బర్త్ డే రోజు సర్‌ప్రైజ్‌ చేద్దామని హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్తాడు అన్వేష్‌. కానీ ఆ అమ్మాయి హ్యాండిస్తుంది. దీంతో పిచ్చోడు అవుతాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి ఫోన్‌ చేసి హైదరాబాద్‌ వస్తున్నా, మీ ఫ్లాట్‌ కి వస్తానని చెబుతుంది. చెప్పినట్టే వస్తుంది. అన్వేష్‌ చూపించిన కొత్త ఫ్లాట్‌లో ఉంటుంది. కానీ అన్వేష్‌ బయటకు వెళ్లి వచ్చే లోపు మాయమవుతుంది. మరి ఆమె ఎక్కడికి వెళ్లింది? ఎవరి వద్దకు వెళ్లింది? ఎందుకు వెళ్లింది? మళ్లీ అన్వేష్‌, మైథిలి కలిశారా? లేదా? వీరి ప్రేమ ఏ తీరం చేరింది? ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో రోమాంచకం అనిపించింది ఏంటి? అనేది సినిమా.

36
రోమాంచకం మూవీ విశ్లేషణ
Image Credit : X/@VangaPictures

రోమాంచకం మూవీ విశ్లేషణ

లౌడ్‌ కామెడీ ప్రధానంగా అడపాదడపా సినిమాలు వస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని ఆడుతున్నాయి, చాలా వరకు డిజప్పాయింట్‌ చేస్తున్నాయి. ఈ చిత్రం కొంత వరకు అదే జోనర్‌లో ఉంటుంది. ఫన్‌, సిచ్చువేషన్‌ ప్రధానంగా రాసుకున్న కామెడీ కొంత వరకు బాగానే వర్కౌట్‌ అయ్యింది. కామెడీ, లవ్‌ ట్రాక్‌ చుట్టూనే మూవీ తిరుగుతుంది. డైలాగ్‌ కామెడీ ఇందులో హైలైట్‌గా నిలుస్తుంది. హీరో, తన నలుగురు ఫ్రెండ్స్ చేసే అల్లరి చిల్లర పనులు, చిల్లర డైలాగులు, కొంటె పనులను ఎస్టాబ్లిష్‌ చేస్తూ మూవీ రన్‌ అవుతుంది. అయితే హీరో డేటింగ్‌ యాప్‌ అనే స్టార్టప్‌ కంపెనీ పెట్టాలనే ప్రయత్నాల్లో ఉండటం, ఈ క్రమంలోనే ఓ చెన్నై పిల్ల టచ్‌లోకి రావడం, ఆమె విచిత్రమైన టెస్ట్ లు పెట్టడం, హీరో కిందా మీద పడి పాస్‌ కావడం ఇంట్రెస్టింగ్‌గా రన్‌ అవుతుంది. పేరు కన్నుక్కోమని చెప్పగా, మనోడు తపస్సు చేసి ఆమె పేరును కరెక్ట్ గా గెస్ చేస్తాడు. దీంతో పడిపోతుంది. ఆ తర్వాత ఫోన్‌, చాటింగ్‌ కామన్‌గా జరుగుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. వీరి లవ్‌ ట్రాక్ పై ఫ్రెండ్స్ కామెంట్‌ చేయడం నవ్వించేలా ఉంటుంది. అమ్మాయి బర్త్ డే విషెస్‌ చెప్పడానికి చెన్నై వెళ్లగా ఆమె హ్యాండివ్వడం సస్పెన్స్ గా మారుతుంది. ఈక్రమంలో ఫ్రెండ్స్ తో కలిసి మందేయడం ఆమెని తలుచుకోవడం, ఫ్రెండ్స్ కామెడీ చేయడం హిలేరియస్‌గా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు సడెన్‌గా అమ్మాయి ఫోన్‌ చేసి వస్తున్నా అని చెప్పి తన ఫ్లాట్‌ కి రావడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. వచ్చిన కాసేపటికే ఆమె మిస్సింగ్‌.. ఆమెని వేతికే క్రమంలో చోటు చేసుకునే సన్నివేశాలు,ఫ్రెండ్స్ మధ్య గొడవలు, వెతుకులాట గోల గోలగా ఉంటుంది. అందులోనుంచే ఫన్‌ జనరేట్‌ అయ్యింది. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ఎపిసోడ్‌ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ఎడింగ్‌లో ఓ సర్‌ప్రైజ్‌ ఉంటుంది. అనుదీప్‌ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లిపోయాడు. సినిమాపై అభిప్రాయాన్ని మార్చేశారు.

46
రోమాంచకం మూవీలో ప్లస్, మైనస్‌లు
Image Credit : X/@VangaPictures

రోమాంచకం మూవీలో ప్లస్, మైనస్‌లు

సినిమాలో ప్లస్‌లు చూస్తే, సినిమాలో సందర్భానుసారంగా వచ్చే కామెడీ, డైలాగ్‌ కామెడీ వర్కౌట్‌ అయ్యింది. హీరో పాత్ర, యాక్టింగ్‌, ఆయన తీరుతెన్నులు ప్లస్‌గా చెప్పొచ్చు. ఆయన ఫ్రెండ్‌గా చేసిన వాళ్లంతా బాగా చేశారు. అయితే నటుడు నరేంద్ర మాత్రం దుమ్ములేపాడు. సినిమాకి అతనే హీరో అని చెప్పొచ్చు. అంతగా నవ్వించాడు. డైలాగ్‌తో, ఎక్స్ ప్రెషన్స్ తో ఇరగదీశాడు. సంగీతం బాగుంది. బీజీఎం ఆకట్టుకుంది. కెమెరా వర్క్ ఓకే అనిపిస్తుంది. డైలాగ్స్, డైలాగ్‌ కామెడీ సినిమాకి ప్లస్‌గా నిలిచాయి. సెకండాఫ్‌ సినిమాకి ఆయువు పట్టుగా చెప్పొచ్చు.

మైనస్‌ విషయానికి వస్తే.. సినిమాలో కథ లేదు. సీన్లని బట్టి మూవీని నడిపించారు. చాలా చోట్ల లాజిక్‌ లెస్‌గా ఉంటుంది. లవ్‌ ట్రాక్‌ అంతగా పండలేదు కాలేదు. ఆమె కోసం హీరో అంతగా బాధపడటమనేది కన్విన్సింగ్‌గా లేదు. హీరోయిన్‌ పాత్ర తీరుతెన్నుల విషయంలో ఓ క్లారిటీ మిస్‌ అయ్యింది. సినిమాలో లౌడ్‌ కామెడీ ఎక్కువైంది. హీరో, తన ఫ్రెండ్స్ తో చేసే గోల ఎక్కువగా ఉంది. ఉపేంద్ర పాత్ర కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఎమోషన్స్ అసలే లేవు.

56
రోమాంచకంలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?
Image Credit : X/@VangaPictures

రోమాంచకంలో ఆర్టిస్ట్ లు ఎలా చేశారంటే?

నటీనటులు

అన్వేష్‌ పాత్రలో సుమంత్‌ ప్రభాస్‌ బాగా చేశాడు. చాలా వరకు బెటర్‌గా కనిపించాడు. అయితే ఆయన పాత్రలో యాక్టింగ్‌ కొన్ని చోట్ల మీటర్‌ దాటింది. కాకపోతే లుక్‌ పరంగా, యాక్టింగ్‌ పరంగా చాలా వరకు మెచ్యూరిటీ కనిపించింది. ఇక ఫ్రెండ్స్ కూడా బాగా నటించారు. వాళ్లు సినిమాకి ప్లస్‌గా నిలిచారు. వారిలో నరేంద్ర మాత్రం ఇరగదీశాడు. సినిమాని తన భుజాలపై మోశాడు. సినిమాలో కామెడీ చాలా వరకు వర్కౌట్‌ అయ్యిందంటే అది నరేంద్ర వల్లే అని చెప్పొచ్చు. హీరోయిన్‌గా అనంతిక శనిల్‌కుమార్‌ ఉన్నంతలో మెప్పించింది. కళ్లతోనే కట్టిపడేసింది. నటన పరంగా మెప్పించింది. కాకపోతే ఆమె పాత్ర ఆశించిన స్థాయిలో లేదు. ఆమె ఇంకా బాగా చేయగలదు. ఎస్‌ఐగా ఉపేంద్ర ఓకే అనిపించాడు. ఆయన పాత్ర నవ్వించడం కంటే ఇరిటేషన్‌ తెప్పించింది. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

66
టెక్నీకల్‌గా రోమాంచకం ఎలా ఉంది? ఫైనల్‌ రిపోర్ట్
Image Credit : X/@VangaPictures

టెక్నీకల్‌గా రోమాంచకం ఎలా ఉంది? ఫైనల్‌ రిపోర్ట్

వాసుకి వైభవ్‌ మ్యూజిక్‌ సినిమాకి ప్లస్ గా నిలిచింది. పాటలు బాగున్నాయి. ఆర్‌ఆర్‌ ఆకట్టుకునేలా ఉంది. కొంత లౌడ్‌నెస్ ఎక్కువైంది. పవన్‌ పప్పుల కెమెరా వర్క్ ఓకే అనిపిస్తుంది. విజువల్స్, ఫ్రేమ్స్ ఆకట్టుకుంటాయి. స్పెషల్‌గా నిలుస్తాయి. నిర్మాణ విలువలకు కొదవలేదు. ప్రణయ్‌ రెడ్డి, సందీప్‌ రెడ్డి వంగా రాజీలేకుండా నిర్మించారు. ఇక దర్శకుడు వేణుగోపాల్‌ రెడ్డి ఎంచుకున్న కథ అంటే ఓకే, ఎందుకంటే అందులో పెద్దగా కథేం లేదు. సినిమాని రాసుకోవడంలో ఫర్వాలేదు. కామెడీగా, డైలాగ్స్ పరంగా బాగా రాసుకున్నాడు. స్క్రీన్‌ ప్లే బాగుంది. కాకపోతే దాన్ని తెరపై ఆవిష్కరించే విషయంలో జడ్జ్ మెంట్‌ మిస్‌ అయ్యింది. ఫ్రెండ్స్ తో కామెడీ చేయించే క్రమంలో అది డోస్‌ పెరిగింది. అతిగా మారింది. దీంత చాలా చోట్లు నవ్వులు రావడం కాక ఇరిటేషన్‌ తెప్పిస్తుంది. కొన్ని చోట్ల మాత్రం బాగానే వర్కౌట్‌ అయ్యింది. క్లైమాక్స్ సినిమా నిలబెడుతుందని చెప్పొచ్చు. యూత్‌ కి బాగా నచ్చుతుంది. పోరగాళ్లు బాగా ఎంజాయ్‌ చేస్తారు.

ఫైనల్‌గా: లౌడ్‌ కామెడీతో ఆకట్టుకునే రోమాంచకం. యూత్‌ ఎంజాయ్‌ చేస్తారు.

రేటింగ్‌: 2.75

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Day 1 Collections: రణబాలికి షాకింగ్‌ కలెక్షన్లు.. విజయ్‌, రష్మిక మూవీకి మొదటి రోజు వచ్చింది ఇంతేనా?
Recommended image2
Garividi Lakshmi Movie Review: గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ, బుర్రకథ కళాకారిణి జీవితం వెండితెరపై ఎలా ఉందంటే?
Recommended image3
Ranabaali Movie Review: రణబాలి మూవీ రివ్యూ రేటింగ్‌.. విజయ్‌ దేవరకొండ రష్మిక హిట్‌ కొట్టారా? డీలా పడ్డారా ?
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image2
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved