సౌత్ ప్రిన్స్ మహేష్ బాబు ఎలా కనిపించినా సూపర్బ్ గా ఉంటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా మహేష్ కు సంబందించిన కొన్ని షూటింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. మహేష్ సరికొత్త గెటప్ తో కనిపిస్తుండడంతో ఆ ఫొటోస్ ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. 

అమెరికాలో రీసెంట్ గా ఒక షెడ్యూల్ ని స్టార్ట్ చేసిన దర్శకుడు వంశీ మహేష్ ను ఒక మిలియనీర్ బిజినెస్ మెన్ స్థాయిలో చూపించాడు. సూటు బూటుతో మహేష్ కనిపించిన తీరు కనుల విందుగా ఉందని అభిమానులు ఎంతగానో ఆనందపడుతున్నారు. మహేష్ లుక్ మాములుగా లేదంటూ.. చంపేశాడు అని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ కనిపించిన ఈ లుక్ ని చూస్తుంటే సినిమాలో మహేష్ తప్పకుండా అధరోగొట్టేస్తాడని చెప్పవచ్చు. 

త్వరలోనే యూఎస్ షెడ్యూల్ ని ముగించుకొని చిత్ర యూనిట్ స్వదేశానికి తిరిగిరానుంది. రాగానే తెలంగాణలో ఒక విలేజ్ లో నరేష్ కు సంబందించిన సీన్స్ ను చిత్రీకరించనున్నారు. మహేష్ కూడా సీన్స్ లో ఉంటాడట. ఇక మహేష్ సరసన సినిమాలో పూజా హెగ్డే నటించనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ కానుంది.