MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: సైన్ చేయక ముందే సూపర్ హిట్ అని చెప్పిన చిరంజీవి తల్లి..ఆయన బాడీ ఏంటి, జనాలంతా అదే మాట

Chiranjeevi: సైన్ చేయక ముందే సూపర్ హిట్ అని చెప్పిన చిరంజీవి తల్లి..ఆయన బాడీ ఏంటి, జనాలంతా అదే మాట

చిరంజీవి తల్లి అంజనా దేవి ఓ నవల చదివారు. ఆ నవలని సినిమాగా చేయాలని చిరంజీవితో నిర్మాతలు చర్చలు జరుపుతున్నప్పుడు ఇది తప్పకుండా సూపర్ హిట్ అని అంజనా దేవి అన్నారట. ఆ సినిమా ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 04 2026, 09:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరో కాకముందు కూడా న్యాయం కావాలి, అభిలాష లాంటి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆ టైంలోనే టాలీవుడ్ లో కొత్త స్టార్ ఎదుగుతున్నాడు అని అంతా భావించారు. ఖైదీతో అది కన్ఫర్మ్ అయింది. అభిలాష మూవీ విశేషాలని నిర్మాత కేఎస్ రామారావు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అభిలాష నవల
Image Credit : Asianet News

అభిలాష నవల

ప్రాణం ఖరీదు సినిమా టైం నుంచే చిరంజీవి గురించి నాకు తెలుసు. చాలా బాగా చేస్తున్నాడు కొత్త కుర్రాడు అని అంతా అంటుండేవారు. ఆ టైంలో యండమూరి వీరేంద్రనాథ్ రచించిన అభిలాష అనే నవల ప్రచురించబడింది. ఆ నవల చాలా బావుంది అని అనిపించింది. చిరంజీవి ఒక రోజు షూటింగ్ లో ఉంటే వెళ్లి డిస్కస్ చేశాం. ఆయనకి కూడా నచ్చింది. కానీ కన్ఫర్మ్ చేయలేదు. రేపు మళ్ళీ మీట్ అయి చర్చిద్దాం అని అన్నారు.

35
సూపర్ హిట్ అని చెప్పిన చిరంజీవి తల్లి
Image Credit : Asianet News

సూపర్ హిట్ అని చెప్పిన చిరంజీవి తల్లి

దీనితో నెక్స్ట్ డే చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను. ఆసక్తికర విషయం ఏంటంటే చిరంజీవి తల్లి అంజనాదేవి అప్పటికే అభిలాష నవల చదివేశారట. ఇందులో హీరో పేరు కూడా చిరంజీవే. నీకు చాలా బావుంటుంది, తప్పకండా హిట్ అవుతుంది అని ఆమె చిరంజీవికి చెప్పారు. ఆ విషయాన్ని చిరంజీవి నాతో షేర్ చేశారు. తన తల్లి ఎంకరేజ్ చేయడంతో చిరంజీవి అభిలాష చిత్రానికి వెంటనే ఒప్పుకున్నారు.

45
మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజా
Image Credit : stockPhoto

మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజా

దర్శకుడిగా కోదండరామిరెడ్డి గారిని ఫిక్స్ చేశాం. అప్పటికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజా పేరు తమిళనాడులో మారుమోగుతోంది. ఎలాగైనా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండాలి అని అనుకున్నాం. కథ చెబితే వెంటనే ఒప్పుకున్నారు. ఆ విధంగా మంచి కాంబినేషన్ కుదిరింది.

55
చిరంజీవి బాడీ ఏంటి అలా ఉంది
Image Credit : Asianet News

చిరంజీవి బాడీ ఏంటి అలా ఉంది

ఖర్చుకు వెనుకాడకుండా వివిధ లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. కొన్నిసార్లు రాజస్థాన్ లో బస్సు ప్రయాణం చేయాల్సి వచ్చేది. చిరంజీవి ఫ్యామిలీ, చిత్ర యూనిట్ అంతా బస్సుల్లో ట్రావెల్ చేశాం. అంతా అనుకున్నట్లే జరిగింది సినిమా రిలీజై సూపర్ హిట్ అయింది. కథతో పాటు చిరంజీవి డ్యాన్సుల గురించి కూడా జనాలు ప్రత్యేకంగా మాట్లాడుకోవడం ప్రారంభించింది ఈ సినిమాతోనే. చిరంజీవి యురేకా సకామిక సాంగ్ లో డ్యాన్స్ చేస్తుంటే ఈయన బాడీ ఏంటి ఇంత ఫ్లెక్సిబుల్ గా ఉంది. బాడీలో స్ప్రింగులు ఉన్నాయా అంటూ జనాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు. అంతలా చిరంజీవి డ్యాన్సులతో మెస్మరైజ్ చేశారు అని కేఎస్ రామారావు తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Trigun: సొంత టీంకే వెన్నుపోటు, త్రిగుణ్ దెబ్బకు మారిపోయిన ఆట..కెప్టెన్ గా అవతరించిన రామ్ ప్రసాద్
Recommended image2
Ramayana:హైదరాబాద్ లో రామాయణ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్..రణబీర్, యశ్ తోపాటు టీమ్ మొత్తం రెడీ
Recommended image3
Yash: సంచలనం సృష్టిస్తున్న సినిమాకు రాకింగ్ స్టార్ యశ్ సపోర్ట్.. ఫొటోలు చూసేయండి!
Related Stories
Recommended image1
Vijay Deverakonda: రామ్ చరణ్ కాదు, శ్రీకృష్ణుడిగా విజయ్ దేవరకొండ.. రీమేక్ మూవీపై పెరుగుతున్న అంచనాలు
Recommended image2
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved