సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లో పూజ హెగ్డేకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది.

బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ తెలుగులో బాలకృష్ణతో కలిసి లెజెండ్, డిక్టేటర్ వంటి సినిమాలలో నటించింది. అయినప్పటికీ తెలుగులో ఆమెకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇప్పుడు మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

సినిమాలో మహేష్ బాబు స్టూడెంట్ గా, వ్యాపారవేత్తగా, రైతుల సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా ఇలా మూడు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. స్టూడెంట్ గా ఉన్నప్పుడు మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపిస్తుంది. వ్యాపారవేత్తగా కనిపించే సమయంలో మహేష్ కి సోనాల్ కనెక్ట్ అవుతుందట.

మొదట ఈ పాత్ర కోసం మెహ్రీన్ ని అనుకున్నారు. కానీ చివరకు ఆ పాత్ర సోనాల్ కి దక్కింది. త్వరలోనే సోనాల్ సినిమా సెట్స్ లో జాయిన్ కానుంది. ఇటీవలే సినిమా ఫారెన్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో మరో షెడ్యూల్ మొదలుకానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇవి కూడా చదవండి.. 

మహేష్ ‘మహర్షి’ కథ ఇదేనా?

మహేష్ బాబు ఐదు గెటప్పుల్లో..!

'మహర్షి' షూటింగ్ లో హాట్ బ్యూటీ మిస్!

టాక్ ఆఫ్ ది టౌన్: అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్షిప్... సీక్రెట్ ఇదే

మహేష్.. దిల్ రాజు మాట వినడం లేదా..?

మహర్షి: మహేష్ లుక్ మాములుగా లేదు.. చంపేసాడు!

తప్పులో కాలేసిన హీరో మహేష్ బాబు

మహర్షి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఛానెల్!

మహేష్ నిజంగానే మోసం చేస్తున్నాడు?